Horoscope Today 5 December 2021: మీలో ప్రతిభతో అందర్నీ ఆకట్టుకుంటారు, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
చేపట్టిన పనులు వేసుకున్న ప్లాన్ ప్రకారం పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఎవ్వరితోనూ వివాదాలకు అవకాశం ఇవ్వకండి. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. వ్యాపారులు, ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.
వృషభం
వృషభ రాశివారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండదు. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహాల విషయంలో నిర్లక్ష్యం తగదు. వ్యాపారులు కష్టపడాలి. ఉద్యోగులకు సాధారణ ఫలితాలున్నాయి.
మిథునం
మీకు ఈ రోజంతా శుభ ఫలితాలే. మీ ప్రతిభ వెలగులోకి వస్తుంది. మీ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. చిన్నప్పటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువుపై మరింత శ్రద్ధ పెరుగుతుంది.
Also Read: మీ చేతికి ఈ రెండు వేళ్లూ సమానంగా ఉన్నాయా.. అయితే బాగా సంపాదిస్తారట..
కర్కాటకం
తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు స్వీకరించడం ద్వారా కొన్ని పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు.స్నేహితులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగుల సమస్యలు తీరుతాయి.ఓ సంఘటన కొంత బాధ కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
సింహం
ఈ రోజు సింహరాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థికంగా అనుకూలమైన సమయం. మీ ప్రవర్తన, పనితీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కుటుంబంలో కొన్ని సమస్యలు వేధిస్తాయి. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఆస్తులకు సంబంధించి వివాదాలు జరిగే అవకాసం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పెద్దగా మార్పులుండవు.
కన్య
ఎంతో కష్టపడితే కానీ ఫలితాలు అందుకోలేరు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ముందడుగు వేయండి. అనవసర విషయాల కోసం సమయాన్ని వృధా చేయొద్దు. ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. వివాదాల్లో తలదూర్చవద్దు, అధిక ప్రసంగాలు చేయొద్దు. శత్రువులు చురుగ్గా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. వ్యాపారాల్లో పెద్దగా కలసిరాదు. ఉద్యోగులుకు సాధారణ సమయం.
Also Read: రోజూ ఇంటిముందు ముగ్గేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా మరి..
తుల
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సన్నిహితుల సలహాలు పరిగణలోకి తీసుకుని ముందడుగు వేయండి. ఉద్యోగులు,వ్యాపారులకు ఈ రోజు శుభసమయం. ముఖ్యమైన పనుల విషయంలో తొందరపాటు వద్దు. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
వృశ్చికం
ఈ రోజు మీపై ఒత్తిడి ఉంటుంది. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. అనుకోని ప్రయాణాలు,కొన్ని సమస్యలు చికాకు పెంచుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనుల విషయంలో తొందరపాటు వద్దు..ప్రశాంతంగా ఆలోచించండి.
ధనుస్సు
ధనస్సు రాశివారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ శత్రువులు చురుగ్గా ఉంటారు మీరు అప్రమత్తంగా వ్యవహించండి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లుతుంది. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం.
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
మకరం
పనులు పూర్తిచేసేందుకు ఎంత కష్టపడినా కొన్ని అడ్డంకులు తప్పవు. తగాదాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. దైవారాధన చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు, ఉద్యోగులకు బాగానే ఉంటుంది. సన్నిహితుల నుంచి సహకారం అందుతుంది.
కుంభం
చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. దైవదర్శనానికి వెళతారు. కుటుంబ సభ్యులు, బంధువులతో సంతోష సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
మీనం
వ్యవహారాలు మందుకుసాగకపోవడంతో చికాకుగా ఉంటారు. ఎంతో కష్టపడితే కానీ ఫలితం అందుకోవం అసాధ్యం. నిర్ణయాల్లో మార్పులు ఉంటాయి.వ్యాపారాల విస్తరిస్తారు. ఉద్యోగులకు చికాకులు తప్పవు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది.
Also Read:చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి