By: RAMA | Updated at : 31 Jul 2022 05:59 AM (IST)
Edited By: RamaLakshmibai
Horoscope 31 July, 2022
జులై 31 ఆదివారం రాశిఫలాలు (Horoscope 31-07-2022)
మేషం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది.ప్రశాంతంగా ఉంటారు. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు.చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో లాభపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి.
వృషభం
కొన్ని సమస్యల నుంచి ఈ రోజు మీకు ఉపశమనం లభిస్తుంది. ఓ పెద్ద పనిని పూర్తిచేస్తారు. ఇచ్చిన అప్పులు వసూలవుతాయి. పాత అప్పులు క్లియర్ చేసుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు చదువుపైనుంచి దృష్టి మరోవైపు మరలకుండా చూసుకోవాలి.
మిథునం
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఉద్యోగులు, వ్యాపారులకు అంత అనూకలంగా ఉండదు. కొన్ని పనుల్లో లాభం, మరికొన్ని పనుల్లో నష్టం రెండూ ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులు పెట్టొద్దు. విద్యార్థులకు సాధారణ రోజు అవుతుంది.
Also Read: శ్రావణమాసం ప్రారంభమైంది, వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి part-1
కర్కాటకం
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది.మీ పని రంగంలో విజయం సాధిస్తారు. తొందరపాటు నిర్ణయం వల్ల నష్టపోతారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ద్వారా వ్యాపారులు లాభపడతారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. తోబుట్టువులతో సంతోష సమయం గడుపుతారు. ఈ రోజు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
సింహం
ఈ రోజు అధిక శ్రమ వల్ల తొందరగా అలసిపోతారు. ఉద్యోగులు, వ్యాపారులు సరైన సమయానికి నిర్ణయం తీసుకోపోవడం వల్ల ఆర్థికంగా నష్టోతారు. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఈ రోజు శుభప్రదం. స్నేహితులతో కలసి బయటకు వెళ్లే ప్లాన్ చేసుకుంటారు.
కన్య
ఈ రోజంతా గందరగోళంగా ఉంటారు. ఆఫీసు రాజకీయాల్లో ఇరుక్కోవడం వల్ల మీ ఇమేజ్ మసకబారుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు పెద్దగా మార్పులుండవు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు రావాలంటే మరింత కష్టపడాలి. సోదరుల మద్దతు పొందుతారు. స్నేహితులతో విభేదాలు రావొచ్చు.
తులా
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. సానుకూలంగా ఉంటారు. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. కష్టపడితేనే ఫలితం సాధిస్తారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. అన్నదమ్ములతో సరాదాగా గడుపుతారు.
వృశ్చికం
ఈ రోజు మీ రోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. రోజంతా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అనవసరంగా ఎవరితోనూ వివాదం పెట్టుకోవద్దు. కోపాన్ని అదుపుచేసుకోండి. కార్యాలయంలో కొన్ని రాజకీయాల్లో చిక్కుకుంటారు..కాస్త ఓపికగా వ్యవహరించండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించండి. ఆర్థిక లాభాల కోసం నూతన అవకాశాలొస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి తగ్గించండి. విద్యార్థులు చదువుపైనుంచి మనసు మళ్లకుండా చూసుకోండి.
Also Read: గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ వ్రతం విధానం part-2
ధనుస్సు
ఈ రోజు నిదానంగా ఉంటుంది. ఏదో అలసట, నీరసం అనిపిస్తుంది. కార్యాలయంలో ఏపని చేయాలని అనిపించదు. ఆర్థికంగా పెద్దగా తేడాలుండవు. రిస్క్ తీసుకోవద్దు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మరింత కాన్సన్ ట్రేషన్ చేయాలి. మనసంతా గందరగోళంగా ఉంటుంది. తోబుట్టువులతో వివాదాలు పెరగొచ్చు.
మకరం
ఈ రోజు మకర రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యక్తిగత జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. వృత్తి జీవితంలో కొన్ని సమస్యలుంటాయి. ఆర్థిక ప్రణాళికలు నిలిచిపోతాయి. కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. విద్యార్థులు కష్టపడి పనిచేస్తేనే విజయం సాధిస్తారు. తాగాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
Also Read: పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన వరలక్ష్మీ వ్రత కథ
కుంభం
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఏ ప్రణాళికలు వేసినా కార్యాలయంలో ఆర్థిక పురోగతికి అవకాశాలు ఉంటాయి. ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. వ్యాపారులకు అనుకూలమైన సమయం. కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టొచ్చు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు.
మీనం
ఈ రోజంతా ఎనర్జటిక్ గా ఉంటారు. ఉద్యోగం, వ్యాపారంపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. పెండిగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. లాభదాయనమైన అవకాశాలొస్తాయి. ఇప్పుడు పెట్టే పెట్టుబడులు రానున్న రోజుల్లో లాభాలనిస్తాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి. స్నేహితుల సహకారం ఉంటుంది.
Spirituality: దానం-ధర్మం ఈ రెండిటికీ ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది!
Zodiac Signs: మీది ఏ రాశి, మీరు ఆఫీసులో సహోద్యోగులతో ఎలా ఉంటారో తెలుసా!
AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే - ప్రభుత్వ జీవో రిలీజ్ !
Spirituality:పెళ్లిలో అరుంధతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు, ఇంత అర్థం ఉందా!
Tirumala: శ్రీవారి ఆలయంలో ప్రతి మంగళవారం నాడు నిర్వహించే సేవ, పూజలు ఇవే
సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?