By: ABP Desam | Updated at : 29 Dec 2021 08:28 PM (IST)
Edited By: RamaLakshmibai
horo2021 డిసెంబరు 30 గురువారం రాశిఫలాలు
2021 డిసెంబరు 30 గురువారం రాశిఫలాలు
మేషం
ఈ రాశి వారు ఈరోజు ఎలాంటి లావాదేవీలు జరపొద్దు. ఆస్తులు కొనుగోలు-అమ్మకం రెండింటికీ ఇది సరైన సమయం కాదు. మీ జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తొచ్చు. కోపాన్ని అదుపుచేసేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు, వ్యాపారులు తమ శక్తిమేరకు కష్టపడాలి. ఆరోగ్యం జాగ్రత్త.
వృషభం
ఈ రాశికి చెందిన వారు ఎవరైనా భాగస్వామ్య వ్యాపారం చేస్తే జాగ్రత్తగా వ్యవహరించండి. వారిని గుడ్డిగా నమ్మితే మోసపోవచ్చు. కొత్త ప్రణాళికలు వద్దు, పెట్టుబడులు పెట్టొద్దు. ఉద్యోగంలో ఉన్నతి కోసం కష్టపడాల్సి ఉంటుంది. మీ కష్టాన్ని ఉన్నతాధికారులు సరిగా పట్టించుకోవడం లేదనే భావనతో ఉంటారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థతి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం బాగవ్వాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి.
మిథునం
ఈ రాశి వారు పనితో పాటూ విశ్రాంతి కూడా తీసుకోవాలి. ఉద్యోగులపై పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీ రోజు కోసం ముందుగానే ప్రణాళికలు వేసుకోండి. వ్యాపారులకు లాభదాయకమైన రోజు... ఎప్పటి నుంచో నిలిచిపోయిన డీల్ సెట్ అవొచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సామరస్యం ఉంటుంది.
కర్కాటకం
ఈ రోజు మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులు నియంత్రించండి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు..మాట అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం
ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో సానుకూలంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, ఈరోజు మీరు ప్రత్యేకంగా ఎవరినైనా కలుసుకోవచ్చు. మరోవైపు, మీరు వివాహం చేసుకుంటే, ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశాన్ని పొందొచ్చు. మీ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు అభివృద్ధి మొత్తం జరుగుతుంది. మీరు ఉన్నత స్థానాన్ని పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
కన్య
ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలున్నాయి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించి కానీ, ఇంక్రిమెంట్ కి సంబంధిన సమాచారం వినే అవకాశం ఉంది. వ్యాపారం అభివృద్ధి దిశగా వ్యాపారులు మరో అడుగు ముందుకేస్తారు. ఇప్పుడు కష్టపడుతున్న దానికి భవిష్యత్ లో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబ జీవితంలో హెచ్చుతగ్గులుంటాయి. కుటుంబ సభ్యులతో ఏదో విషయంలో వాగ్వాదం ఉండొచ్చు. మీ వ్యక్తిగత విషయాల్లో బయటి వారిని జోక్యం చేసుకోనివ్వొద్దు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు.
తుల
ఈ రోజు ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. చేపట్టే ప్రతి పనిలో మీ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు కలిసొచ్చే సమయం, వ్యాపారులకు లాభాలొచ్చే సూచనలున్నాయి తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
వృశ్చికం
ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి లేదంటే కొద్దిపాటి అజాగ్రత్త వల్లచాలా నష్టపోతారు. కుటుంబంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ప్రేమ బలపడుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది, అనవసర ఖర్చులు నియంత్రించండి. ఆరోగ్యం బావుంటుంది.
ధనస్సు
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన రోజు. మీరు కొత్త ఆదాయ వనరులను పొందే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం లభిస్తుంది. చిన్న వ్యాపారులకు శుభసమయం. భాగస్వామ్యంతో ఏదైనా పని ప్రారభించాలనుకుంటే ఇది సరైన సమయం కాదు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది.చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.
మకరం
ఈ రాశి విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులు బిజీ బిజీగా ఉంటారు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. . మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
కుంభం
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా బావుంటుంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. విదేశీ కంపెనీలో పనిచేసే వ్యక్తుల పురోగతికి అవకాశం ఉంటుంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇదే శుభసమయం. ఆర్థిక సమస్యలు త్వరలోనే తీరిపోతాయి. ఇంటా-బయటా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు, చిన్న సమస్య ఉన్నా వైద్యుడిని సంప్రదించండి.
మీనం
ఈ రాశి వారికి ఈరోజు పిల్లల వైపు నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వారి మొండితనంతో మీరు ఇబ్బంది పడతారు. అయితే కఠినంగా కాకుండా ప్రేమతో వ్యవహరించండి. ఖర్చులను నియంత్రించుకోండి. ఆర్థిక విషయాల్లో ఇతరులపై ఆధారపడొద్దు. వ్యాపారులకు బాగానే ఉంది. ముఖ్యమైన పనులు కొన్ని సమయానికి పూర్తికావడంతో ఉపశమనంగా ఫీలవుతారు. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందపడతారు.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...
Also Read: ఈ రాశుల్లో పుట్టిన పిల్లలు గాడ్ గిఫ్టే... మీ పిల్లలు ఉన్నారా ఇందులో ఇక్కడ తెలుసుకోండి..
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!
Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట
Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు
Today Panchang 27 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం,దారిద్ర్యం నివారించే సిద్దిలక్ష్మీ స్తోత్రం
Horoscope Today 27th May 2022: ఈ రాశులవారికి అనారోగ్య సూచనలున్నాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !
Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !
Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!