Horoscope Today 23 August 2022: కర్కాటకం,తులా, ధనస్సు సహా ఈ రాశులవారు లాభడతారు, ఆగస్టు 23 రాశిఫలాలు
Horoscope 23rd August : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 23rd August 2022
మేషం
ఖాళీగా కూర్చోకండి, ఏదో ఒక పనిలో బిజీగా ఉండండి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో గొడవలు రావచ్చు...భావోద్వేగానికి లోనై ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. రాబోయే కాలంలో ఆర్థిక లాభాలుంటాయి. ఉద్యోగులు కష్టపడితేనే ఫలితం అందుకుంటారు.
వృషభం
ఈ రోజు ఉద్యోగులకు అనుకూలమైన రోజు. వ్యాపారంలో కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. జీవిత భాగస్వామి మనసు తెలుసుకుని మసలుకోవడం మంచిది. షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఏ పనీ వాయిదా వేయకుండా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు.
మిథునం
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభాలు ఉండొచ్చు. కార్యాలయంలో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ పనితీరును మార్చుకోవద్దు.
కర్కాటకం
ఈ రోజు కర్కాటక రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు తగ్గించుకోవాలి. కెరీర్‌లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాస్త శ్రమగా అనిపించినా అనుకున్న పనులు అనుకున్నట్టుపూర్తిచేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి
Also Read: వినాయక చవితి పూజ ముహూర్తం వివరాలు, ఎలాంటి విగ్రహం కొనుగోలు చేయాలో తెలుసా!
సింహం
ఈ రోజు ఏదైనా విషయం డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొత్త పని వైపు మనసు ఆకర్షితమవుతుంది. కెరీర్‌లో పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. చాలాకాలం తర్వాత స్నేహితుడిని కలుస్తారు..దీనివల్ల మీరు ప్రయోజనం పొందుతారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఏదైనా పని ప్రారంభిస్తే సక్సెస్ అవుతారు.
కన్య
ఈరోజు పెట్టిన పెట్టుబడిని భవిష్యత్తులో సద్వినియోగం చేసుకోగలుగుతారు. కార్యాలయంలో మీ పురోగతిలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. ఓపికగా వ్యవహరించాలి. ఆరోగ్యం జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండండి.
తుల
ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. డబ్బు ఆదాచేయడంపై శ్రద్ధ చూపించకపోతే భవిష్యత్ లో ఇబ్బంది పడతారు. ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తారు.
వృశ్చికం
వృశ్చిక రాశి వారు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు.కుటుంబంతో సరదాగా గడుపుతారు. కార్యాలయంలో కొత్త బాధ్యతను తీసుకుంటారు. మీకు అప్పగించిన పనిని నెరవేరుస్తారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.
ధనుస్సు
ఈ రోజు ఏదైనా పని చేయాలా వద్దో అర్థంకాక గందరగోళానికి గురవుతారు. అనుభవజ్ఞులను కలవడం ద్వారా దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు అనుకూల సమయం. వేరేవారి మాటల్లో జోక్యం చేసుకోవద్దు
మకరం
ఆదాయం బాగుంటుంది. ప్రయాణాలు కలిసొస్తాయి. మీడియా , విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు విజయం పొందుతారు. ఉద్యోగస్థుల పరిస్థితి కార్యాలయంలో మెరుగ్గా ఉంటుంది. న్యాయ సంబంధిత కేసుల్లో ఉపశమనం లభిస్తుంది.
కుంభం
కుంభ రాశి వారికి జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. స్నేహితుడి సహాయంలో పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులు చదువుపైకన్నా ఇతర వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ పెడతారు.
మీనం
ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఇంటికి అతిథులు రాక మీకు మంచి అనుభూతినిస్తుంది. ఈరోజు లావాదేవీలు చేయడం వల్ల నష్టపోతారు. కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు మంచిరోజు. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశాలున్నాయి.