Horoscope Today, 14 August 2022: ఈ రాశులవారు స్టేటస్ కోసం ఖర్చుచేయడం మానుకోవాలి, ఆగస్టు 14 రాశిఫలాలు
Horoscope 14th August : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
మేషం
ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు సంబంధిత అంశాలు మీకు సమస్యగా మారొచ్చు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు చదువుపట్ల శ్రద్ధ పెరుగుతుంది. శత్రువులు పెరుగుతారు..జాగ్రత్తగా ఉండాలి.
వృషభం
ఈ రోజు మీకు కొత్త ఆదాయ వనరులు వస్తాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు మంచి రోజు. ప్లాన్ చేసుకున్న పనులన్నీ సక్రెస్ ఫుల్ గా పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. మీ జీవిత భాగస్వామి సహాయంతో మీ పనులు పూర్తవుతాయి. అప్పులు తీసుకున్నవారు చెల్లించేందుకు ఇదే మంచి సమయం. విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవడంపై ఆశక్తి చూపుతారు.
మిథునం
దాన, ధర్మాలు చేయడంలో బిజీగా ఉంటారు. మీ సొంత పనులకన్నా ఇతరుల పనులపై ఎక్కువ శ్రద్ధ చూపించడం, ఎదిటి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం మీకు హానికరం. కుటుంబ పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. ఉద్యోగులు మార్పు దిశగా అడుగులు వేయకపోవడమే మంచిది. జీవిత భాగస్వామి సహకారంతో చాలాపనులు పూర్తవుతాయి. విద్యార్థులు చదువుపట్ల ఆశక్తి చూపిస్తారు.
Also Read: రాశిమారిన అంగారకుడు, ఈ రాశులవారికి ఆరోగ్యం, ఆదాయం, ఆనందం
కర్కాటకం
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు తమ ప్రతిభతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. పూర్తి అవగాహనతో చేసే పనులు మీకు మంచి చేస్తాయి. కుటంబ సభ్యులతో సరదా సమయం గడుపుతారు. మీ ఆలోచనా విధానం ప్రశంసలు అందుకుంటుంది. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు.
సింహం
ఈరోజు మీకు ఆకస్మిక లాభం చేకూరుతుంది. రోజువారీ కార్యకలాపాల్లో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. ముందుగా ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ వహించాలి..లేకుంటే అవి మీకు తరువాత సమస్యలను సృష్టిస్తాయి. వ్యాపార రంగంలో శత్రువులు కూడా మీకు హాని చేయలేరు. ఉన్నతాధికారులతో వాదన పెట్టుకోవద్దు. భవన నిర్మాణ పనులు చేసే వారికి పెద్ద ఉద్యోగం లభిస్తుంది.
కన్య
ఆస్తులు కొనుగోలు దిశగా అడుగేస్తారు. మీ శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటారు.కార్యాలయంలో మీ పై అధిక పనిభారం కారణంగా మీరు కొంచెం ఆందోళన చెందుతారు. చాలాకాలం తర్వాత స్నేహితులను కలుస్తారు.
Also Read: వృషభ రాశిలో కుజుడి సంచారం, ఈ 5 రాశులవారికి అన్నీ సవాళ్లే!
తుల
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. కార్యాలయంలో ఇతర వనరుల నుంచి ఆదాయం సంపాదించే అవకాశాలు లభిస్తాయి. రాజకీయాల దిశలో పని చేసే వారికి శుభసమయం. వివాదాలకు దూరంగా ఉండాలి. మీరు మీ పిల్లల కెరీర్‌లో ఎదుర్కొంటున్న సమస్య కోసం మీ కుటుంబ సభ్యులలో ఎవరినైనా సహాయం అడుగుతారు
వృశ్చికం
ఈ రోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు ఆలోచించకుండా తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇంటి నుంచి పొందే సహాయం కారణంగా మీరు సమస్యల నుంచి తొందరగా బయటపడతారు. మిమ్మల్ని మీరు ఎవరితోనైనా పోల్చుకోవడం కోసం,స్టేటస్ కోసం డబ్బుని వృధా చేయకండి. విద్యా విషయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది.
ధనుస్సు
సామాజిక రంగాల్లో పనిచేసే వారికి మేలు జరుగుతుంది. కెరీర్ పరంగా మీరు పెద్ద విజయాన్ని అందుకునే అవకాశం ఉంది. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. తోడబుట్టినవారితో వివాదాలు చర్చల ద్వారా ముగుస్తాయి. ఓ పార్టీకి హాజరవుతారు. నూతన పెట్టుబడులకు ఇదే మంచి సమయం.బ్యాంకింగ్ రంగంలో పని చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది.
Also Read: ఈ 5 రాశుల అబ్బాయిలను పెళ్లిచేసుకున్న అమ్మాయిలు అదృష్టవంతులు
మకరం
ఈ రోజు మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ అజాగ్రత్త కారణంగా చిన్న సమస్య పెద్దదిగా మారుతుంది. మీ కుటుంబ సభ్యుల సహాయంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఖర్చుల గురించి ఆందోళన చెందుతారు..అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. మార్కెటింగ్ పనులు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
కుంభం
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. కళాత్మక పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీకు వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం మీకు కలిసొస్తుంది. విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొంటే అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధిస్తారు. పెట్టుబడి పెట్టడం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది
మీనం
ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు మంచి రోజు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందుతారు. కార్యాలయంలోని మీ సహోద్యోగులు మీకు ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. విదేశాల నుంచి దిగుమతి-ఎగుమతి వ్యాపారం చేసే వ్యక్తులు నష్టపోతారు. కుటుంబ సభ్యులతో వివాదానికి దూరంగా ఉండండి. విద్యార్థులు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు.