అన్వేషించండి

Horoscope 30 July 2022: ఈ రాశులవారు ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉంటారు, జులై 30 మీ రాశిఫలాలు

Horoscope 30 July : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

జులై 30 శనివారం రాశిఫలాలు (Horoscope 30-07-2022)

మేషం
అతి కష్టమైన సమస్యలకు మీకు పరిష్కారం దొరుకుతుంది. వృత్తిపరంగా ఈరోజు మంచి రోజు అవుతుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. మీరు మీ ఆలోచనలను ఇతరుల ముందు సానుకూలంగా ప్రదర్శించగలుగుతారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. పోటీపరీక్షలు రాసినవారు విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ సాధ్యం అవుతుంది. అంకితభావం, కృషితో ఇతరుల కన్నా ముందుంటారు. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. 

వృషభం
ఈ రోజు మీకు అకస్మాత్తుగా ధనలాభం ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. అవసరం అయినవారికి సహాయం చేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి..రాబోయే రోజుల్లో ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ రాశికి చెందిన ఆర్ట్ విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు...

మిథునం
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. చాలాకాలం పాటూ కొనసాగిన ఓ పని నుంచి ధనలాభం ఉంటుంది. ఆసక్తికర ఆలోచనలు, ప్రణాళికలు వేస్తారు. పెళ్లికానివారికి సంబంధాలు కుదురుతాయి. మీ తెలివితేటలతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. 

Also Read: శ్రావణమాసం ప్రారంభమైంది, వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి part-1

కర్కాటకం
ఈ రోజు వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు. పాత పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. నచ్చిన ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

సింహం
ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఇంటి బాధ్యత పెరుగుతుంది. కార్యాలయంలో పనివల్ల ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 

కన్య
వ్యాపారం పుంజుకునే ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త ప్రయోగాలు చేయడంలో సక్సెస్ అవుతారు. ఈ రోజు మీకు ఏం చేసినా కలిసొస్తుంది...ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. జీవత భాగస్వామితో సమయం గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది. 

తుల
ఈ రోజంతా తీరిక లేకుండా ఉంటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి, అప్పగించిన పని పూర్తిచేస్తారు. వ్యాపారులు తమ లక్ష్యాలు చేరుకునేందుకు మరింత కష్టపడాలి. ప్రభావవంతమైన వ్యక్తులతో ముఖ్యమైన పరిచయాలు ఏర్పాటు చేసుకుంటారు. 

Also Read: గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ వ్రతం విధానం part-2

వృశ్చికం
భౌతిక ఆనందాలు పెరుగుతాయి. డబ్బు సంపాదించడానికి సత్వరమార్గాన్ని అవలంబిస్తారు. మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టేందుకు మంచి బహుమతులు ఇస్తారు. కుటుంబంలో అందరితో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 

ధనుస్సు
ఈ రోజు మీకు ప్రత్యేకమైన రోజు అనిపించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఏదైనా క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి రోజు మంచిది. మీ తెలివితేటలను సరిగ్గా ఉపయోగించండి. కార్యాలయంలో పరిచయస్తుల మద్దతు పొందుతారు.

మకరం
ఈ రోజు మీకు మిశ్రమ రోజు అవుతుంది. మాట జాగ్రత్త.ఉద్యోగులు ఏం చేసినా కాస్త ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ ఖర్చులు కూడా సేమ్ టు సేమ్. కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు.

Also Read: పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన వరలక్ష్మీ వ్రత కథ

కుంభం
తల్లిదండ్రుల దీవెనలు మీపై ఉంటాయి. తల్లిదండ్రుల సలహాలు పాటించడం ద్వారా మీకు మంచిజరుగుతుంది. సామాజికసేవ చేయాలనే ఆలోచన మీకు వస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి కొన్ని సలహాలు పొందుతారు. మీ ప్రవర్తనతో అందర్నీ మెప్పిస్తారు. 

మీనం
ఈ రోజు మీరు చాలా సహనంగా పనిచేస్తారు. డబ్బు సంపాదన మార్గాలపై ఆలోచిస్తారు.స్తిరాస్తులనుంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కొత్తపని చేయాలని ఆలోచన ఉంటే ముందడుగు వేయండి. రోజువారీ పనులు పెరుగుతాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
Sydney Test Updates: ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు -  12 మంది మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
Embed widget