Horoscope 22 July 2022: ఈ రాశులవారు అధిక కోపం , అనవసర వాదన విడిచిపెట్టాలి, జులై 22 రాశిఫలాలు
Horoscope 22 July : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
జులై 22 శుక్రవారం రాశిఫలాలు (Horoscope 22-07-2022)
మేషం
ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఎక్కువే. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న విద్యార్థుల కల నెరవేర్చుకునేందుకు ఇదే మంచి సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. మిత్రులను కలుస్తారు. రోజువారీ పనిలో కొంత ప్రతికూలత మాత్రం ఉంటుంది.
వృషభం
మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఓ క్షణం కోపం మరో క్షణం ఆనందం అన్నట్టుంటుంది పరిస్థితి. స్నేహితులను కలుస్తారు. కళలు, సంగీతంపై ఆసక్తి పెరుగుతుంది. ఫుడ్ పై చాలా ఆసక్తి ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
మిథునం
ఓపికగా ఉండాలి. అనవసర కోపం, వాదన వల్ల మీకే ఇబ్బంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. స్నేహితుల సహకారంతో ఆదాయం పెరుగుతుంది. సోదరులతో విభేదాలు ఉండొచ్చు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడతాయి. మాట్లాడేటప్పుడు ఆలోచించండి. ఓ శుభావార్త వింటారు.
Also Read: జులై 22 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ మంగళ గౌరీ స్తోత్రం
కర్కాటకం
తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. మనశ్శాంతి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మితంగా మాట్లాడండి. మారటతీరులో కర్కశత్వం తగ్గేలా చూసుకోండి. వ్యాపారులు ఇబ్బంది పడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కార్యాలయంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సింహం
ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.సహనం తగ్గిపోతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సోదరులు, సోదరీమణుల మద్దతు మీకు ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
కన్య
ఓపికగా ఉండండి. అనవసరమైన కోపం, వాదనకు దూరంగా ఉండండి. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. విద్యాపరమైన లేదా మేధోపరమైన పనిలో నిమగ్నత పెరుగుతుంది. నమ్మకంగా వ్యవహరించండి. మితిమీరిన ఉత్సాహం తగ్గించుకోండి. స్నేహితులను కలుస్తారు. వ్యాపారం ఊపందుకుంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పుతో పురోభివృద్ధి ఉంటుంది.
Also Read: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!
తులా
రోజంతా ఆనందంగా ఉంటారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారం పెరుగుతుంది. స్నేహితుల సహకారం ఉంటుంది. కోపం తగ్గించుకోండి. ఉద్యోగులు, విద్యార్థులకు మంచి రోజు. కీర్తి పెరుగుతుంది. బహుమతులు అందుకుంటారు.
వృశ్చికం
ఆత్మ విశ్వాసం పెరుగుతుంది కానీ మనస్సు చంచలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ఖర్చులు పెరుగుతాయి. పనిచేసే ప్రదేశంలో మార్పులు ఉండొచ్చు. సహనం తగ్గుతుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. విద్యా విషయాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. స్వీట్స్ తినాలనే కోరిక ఉంటుంది.
ధనుస్సు
మానసిక ప్రశాంతత ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న విద్యార్థులకు శుభసమయం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదో విషయంలో అసహనంగా ఫీలవుతారు. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. కార్యాలయంలో ఆహ్లాదకరమైన ఫలితాలు పొందుతారు. మీకు గౌరవం లభిస్తుంది.
Also Read: శ్రావణ భార్గవిని వివాదంలోకి నెట్టిన ఈ కీర్తన అసలు సందర్భం, అర్థం తెలుసా!
మకరం
ఓపికగా వ్యవహరించండి. మీ భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి. మతపరమైన పనులను ఆసక్తిగా చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు పెరుగుతాయి. మనస్సులో కొంత ప్రతికూలత ఉండవచ్చు. ఆదాయం తగ్గుతుంది.. ఖర్చులు అదుపుచేయండి.
కుంభం
ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. పనిభారం పెరుగుతుంది. మీ కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశంలో ఉండవలసి రావచ్చు. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణ ఖర్చులు పెరగుతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. తలపెట్టిన పనుల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.
మీనం
కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. అనవసరమైన కోపం మానుకోండి.మాట్లాడేటప్పుడు ఓపికగా వ్యవహరించండి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మేధోపరమైన పనిలో విజయం సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.
Also Read: ఇంటి ద్వారం ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి