News
News
X

Singer Sravana Bhargavi: శ్రావణ భార్గవిని వివాదంలోకి నెట్టిన ఈ కీర్తన అసలు సందర్భం, అర్థం తెలుసా!

అన్నమయ్య కీర్తన విషయంలో సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకుంది. ఆ పాటని స్వామివారికోసం ఏ సందర్భంలో పాడారు, అర్థం ఏంటో చూద్దాం..

FOLLOW US: 

మొన్నటి వరకూ విడాకులు తీసుకుంటోందంటూ వార్తల్లో ఉన్న శ్రావణ భార్గవి ఇప్పుడు అన్నమయ్య కీర్తనను అవమానించింది అంటూ ట్రోల్స్ ఎదుర్కొంటోంది. 'ఒకపరి కొకపరి కొయ్యారమై' అనే పాట అర్థం ఏంటంటే...

పల్లవి :
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమున గళలెల్లా మొలచినట్లుండె

చరణం 
జగదేకపతిమేన జల్లిన కర్పూరధూళి
జిగిగొని నలువంక జిందగాను
మొగి జంద్రముఖి నురమున నిలిపెగనక
పొగరువెన్నెల దీగబోసినట్లుండె

చరణం 
పొరి మెఱుగు జెక్కుల బూసిన తట్టుపుణుగు
కరగి యిరుదెసల గారగాను
కరిగమన విభుడు గనుక మోహమదము
టతొరిగి సామజసిరి దొలికినట్లుండె

చరణం 
మెఱయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను
తఱచయిన సొమ్ములు ధరియించగా
మెఱుగుబోణి యలమేలుమంగయు దాను
మెఱుపుమేఘము గూడి మెఱసినట్లుండె

ఈ కీర్తన అర్థం
కళలన్నీ ముఖంలో మొలకలెత్తినట్లు నిత్యం కొత్తకొత్త ఒయ్యారాలతో కనిపిస్తుందట పురుషోత్తముని ముఖం! దానికి కారణం ఏంటో చిరణాల్లో వివరించారు పెదతిరుమలయ్య.  అలంకరణకోసం దేవుడి ఒంటిపై చల్లిన కర్పూరధూళి కింద రాలుతుంది. ఆ తెల్లటి ధూళి వెలుతురు చిమ్ముతూ నలువైపులా రాలుతూ ఉందట. తెల్లటి ధూళి చిందితే వెలుతురు రావడం ఏంటంటారా..అమ్మవారు చంద్రముఖికదా? ఆమెను గుండెపైన అయ్యవారు పొదుముకున్నారుకదా? రాలే తెల్లటి కర్పూర ధూళి పొగరువెన్నెలలు కురిసినట్టు కనిపిస్తుందంటే అది ఆ చంద్రముఖి మహిమేనని భావన. భలేగా మెరిసిపోతున్న ఆయన బుగ్గలకు పూసిన మేలురకం పునుగు చెక్కిళ్ళనుంచి కారుతుందట. రెండుపక్కలా కారుతున్న ఆ పునుగు ఎలా ఉందంటే మదపుటేనుగు చెంపలపైన స్రవించే ద్రవంలా ఉందట. (మగ ఏనుగుకి మదమెక్కిన సమయాల్లో ఒంటిలో టెస్టోస్ట్రాన్ హార్మోన్ ఎక్కువవ్వడంవల్ల కంటికీ చెవికీ మధ్యభాగంలో నీరు ఊరి స్రవిస్తుంది). మదపుటేనుగుతో పోల్చడం ఏంటి? అమ్మవారిని కరిగమన అని అంటాం కదా అంటే ఏనుగులాంటి ఒయ్యారమైన నడకగలది అని అర్థం. అందుకే స్వామివారిని కరిగమన విభుడు అన్నాడు కవి. దేవుడికి దేవిపైనున్న మోహాన్ని మదపుటేనుగు చంపలపైన ఒలికిపోతున్న ద్రవంతో పోల్చాడు కవి.

Also Read: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!

వివాదం ఎందుకంటే!
‘అన్నమయ్య పెద్ద కుమారుడు పెదతిరుమలాచార్యులు స్వామివారికి అభిషేకం చేస్తూ కీర్తించిన ఈ పాటను శ్రావణ భార్గవి తన అందాన్ని వర్ణించుకుంది అన్నదే ఇప్పుడు వివాదం. భార్యని గుండెలపై పెట్టుకుని తిరుమల కొండపై కొలువైన వెంకన్నకు సంబంధించిన ఈ వర్ణని...ఆమె కాళ్లు ఊపుతూ, తన అందాన్ని వివిధ భంగిమల్లో చూపిస్తూ చిత్రీకరించడం తప్పు అంటున్నారు  అన్నమయ్య వంశస్థులు, పలువురు భక్తులు.ఈ పాటను రెండు రోజుల క్రితమే యూట్యూబ్ లో పోస్టు చేసింది శ్రావణ భార్గవి.ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

Published at : 20 Jul 2022 11:25 AM (IST) Tags: Shravana Bhargavi Shravana Bhargavi in controversy Annamayya Keerthana and Shravana Bhargavi Okapari Okapari

సంబంధిత కథనాలు

Tirumala Updates: టీటీడీ కీలక నిర్ణయం - చతుర్దశ కలశ విశేష పూజ రద్దు

Tirumala Updates: టీటీడీ కీలక నిర్ణయం - చతుర్దశ కలశ విశేష పూజ రద్దు

Weekly Horoscope Telugu: మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఈ వారం జరగబోతోంది, ఆగస్టు 15 నుంచి 21 వరకు రాశిఫలాలు

Weekly Horoscope Telugu: మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఈ వారం జరగబోతోంది, ఆగస్టు 15 నుంచి 21 వరకు రాశిఫలాలు

Horoscope Today 15 August 2022: స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు

Horoscope Today  15 August 2022:  స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ

Horoscope Today, 14 August 2022: ఈ రాశులవారు స్టేటస్ కోసం ఖర్చుచేయడం మానుకోవాలి, ఆగస్టు 14 రాశిఫలాలు

Horoscope Today, 14 August 2022:  ఈ రాశులవారు స్టేటస్ కోసం ఖర్చుచేయడం మానుకోవాలి, ఆగస్టు 14 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది: ఏపీ సీఎం జగన్

Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది:  ఏపీ సీఎం జగన్

KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?

KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?

India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ

India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ

Independence Day 2022: అంబానీ ఇంటిని చూశారా, మూడు రంగులతో ఎలా మెరిసిపోతోందో!

Independence Day 2022: అంబానీ ఇంటిని చూశారా, మూడు రంగులతో ఎలా మెరిసిపోతోందో!