Horoscope 21 July 2022: ఈ రాశివారు ప్రలోభాలకు లొంగిపోవద్దు, జులై 21 రాశిఫలాలు
Horoscope 21 July : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
జులై 21 గురువారం రాశిఫలాలు (Horoscope 21-07-2022)
మేషం
ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. స్నేహితుల కారణంగా సంతోషంగా ఉంటారు. పాత విభేదాలను తొలగించుకోవడానికి ఈ రోజు మంచిది. అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి.
వృషభం
ఈ రోజు మీకు అంత అనుకూలంగా ఉండదు. రోజంతా విసుగ్గా ఉంటారు. ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలు సమసిపోతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మిథునం
కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. రోజంతా ఆనందంగా ఉంటారు. మీ ప్రణాళికలు నిర్వహించడంలో సక్సెస్ అవుతారు. వివాదాస్పద విషయాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు, వ్యాపారులకు మంచి సమయం. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమిస్తారు.
Also Read: జులై 21 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హయగ్రీవ సంపదా స్తోత్రం
కర్కాటకం
కొత్త ఆదాయ వనరులుంటాయి. కుటుంబం కోసం సమయాన్ని వెచ్చిస్తారు.వ్యాపారులకు భారీ లాభాలొస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో పనితీరుతో ప్రశంసలు పొందుతారు. పెద్ద పెద్ద సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి.
సింహం
రోజంతా సంతోషంగా ఉంటారు. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయి..అస్సలు వెనకడుగు వేయకండి. పనికిరాని విషయాలపై దృష్టి పెట్టవద్దు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందగలరు. ఇంటర్యూలకు హాజరయ్యే నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు.
కన్య
మీ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించండి. మిమ్మల్ని ప్రలోభపెట్టి మీపై పనిభారం పెట్టేందుకు ప్రయత్నించేవాళ్లు మీ చుట్టూ ఉన్నారు అప్రమత్తంగా ఉండండి. పిల్లల మొండి వైఖరి చూసి కలత చెందుతారు. కార్యాలయంలో సహోద్యోగులు మీకు చెడు చేయవచ్చు.
తులా
కష్టపడి పని చేస్తారు. ప్రయాణాలు కలిసొస్తాయి. అధికారులతో స్నేహపూర్వకంగా ఉంటారు. ఫలితంగా భవిష్యత్ లో మీ కెరీర్లో ఎదుగుదలకు కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి.వృత్తి ఉద్యోగాలు కలిసొస్తాయి. నిరుద్యోగులకు శుభసమయం.
వృశ్చికం
మీ కీర్తి పెరుగుతుంది. కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలని చూస్తున్నట్లయితే ముందుకు అడుగేయండి. జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడతారు.
Also Read: కామవాంఛతో పురుషులు…ధర్మం విడిచిన స్త్రీలు… కలియుగంలో మనుషుల ప్రవర్తనపై శివపురాణం ఏం చెప్పిందంటే…
ధనుస్సు
ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు చేతికందుతుంది. వ్యాపారాల్లో ఆగిన పనులు పూర్తవుతాయి. అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. జీవిత భాగస్వామితో స్నేహం, పరస్పర సామరస్యం పెరుగుతుంది. ప్రతికూల వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.
మకరం
భార్యాభర్తల మధ్య కొన్ని వివాదాలు వచ్చే అవకాశం ఉంది. మీ అభిరుచిని బట్టి పని చేస్తే బాగుంటుంది. వ్యాపారంలో ఆశించిన లాభం రాకపోవడంతో కాస్త నిరాశ చెందుతారు.రోగాల బారిన పడే అవకాశం ఉంది.
Also Read: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!
కుంభం
పని ఒత్తిడి ఉన్నప్పటికీ పూర్తిస్థాయి ఉత్సాహంగా పనిచేస్తారు. రోజంతా సరదాగా టైమ్ స్పెండ్ చేస్తారు. పిల్లల కెరీర్ కి సంబంధించిన సమస్యలు అధిగమిస్తారు. అతిథుల రాకతో సంతోషం నెలకొంటుంది.
మీనం
మీ దినచర్య క్రమశిక్షణతో ఉంటుంది. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లోవాళ్లకి చెప్పి వెళ్లండి. వ్యాపారులకు అప్పులు చేసే పరిస్థితి వస్తుంది. విద్యార్థులకు చదువుపట్ల శ్రద్ధ తగ్గుతుంది.
Also Read: మార్చిలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి....