మార్చిలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే!
మార్చిలో పుట్టినవారు చాలా సహజంగా ఉంటారు. వీరు చాలా తెలివైనవారు, మోసం చేయడం చాలా కష్టం. వీరికి వ్యతిరేకంగా ఎవరైనా పథకం వేసినట్టైతే ఈజీగా పసిగట్టేయగలరు
మార్చిలో పుట్టిన వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. ఎక్కువ మంది నాయకులుగా ఉన్నత స్థానంలో ఉంటారు
వీరిలో సృజనాత్మకత ఎక్కువ. ప్రతిభావంతులు, కళాత్మక మనస్సు కలిగి ఉంటారు. గర్వం, తొందరపాటు రెండూ ఎక్కువే. ఇతరులను త్వరగా ద్వేషించి వారి కోపానికి గురవుతారు.అందుకే వీరితో స్నేహం ఎక్కువ కాలం నిలవదు
వీరికి జాలి, ప్రేమ కూడా తక్కువే. మాటల్లో ఉన్న జోరు సాయం చేయడంలో ఉండదు. రాజకీయాల్లో బాగా రాణిస్తారు. వీరి ఆలోచనలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి
స్వతంత్ర్య భావాలు ఎక్కువ, ఎవ్వరినీ లెక్కచేయరు. ఈనెలలో పుట్టినవారి సంసార జీవితం అంత సాఫీగా సాగదు
ఎదుటివారి పొగడ్తలకు లొంగిపోయి వారికి పనులు చేసి పెడుతుంటారు. శతృత్వం కొని తెచ్చుకునే రకం
వీరు ఏ వ్యాపారం చేసినా కలిసొస్తుంది, ఆకస్మిక ధనలాభం పొందుతారు
37 ఏళ్లు దాటినప్పటి నుంచీ బాగా కలిసొస్తుంది, ఆర్థికంగా నిలదొక్కుకుంటారు, సుఖపడతారు
మార్చిలో పుట్టిన వారి ఆరోగ్యం: తలనొప్పి, కంటికి సంబంధించిన సమస్యలొస్తాయి మార్చిలో పుట్టిన వారి ఆదాయం: ధైర్యానికి అదృష్టం కూడా తోడవుతుంది..బాగా సంపాదిస్తారు
Note: ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి