2021-22 ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31.

గడువు లోపు ITR ఫైల్ చేయాలి. లేదంటే పెనాల్టీని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ITR దాఖలు తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ చేసినా చేయకపోయినా మీ రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ID, మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది.

మీ రీఫండ్ ఆదాయపు పన్ను శాఖ ద్వారా జనరేట్ చేస్తే ఒకటి నుండి నాలుగు వారాల్లో మీ ఖాతాలో జమ అవుతుంది.

ఆదాయపు పన్ను నియమం ప్రకారం వాపస్ చేసిన తర్వాత ఐటీ శాఖ మీకు డబ్బు తిరిగి ఇవ్వదు.

జనవరి 5, 2012 న ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం..

మీ ఆదాయపు పన్ను వాపసు రూ. 100 కంటే తక్కువగా ఉంటే మీ బ్యాంక్ ఖాతాకు పంపరని నిపుణులు చెబుతున్నారు.

రూ. 100 ఆదాయపు పన్ను రీఫండ్ ఉంటే వచ్చే ఏడాది ఐటీ రీఫండులో సర్దుబాటు చేస్తారు.

ఉదాహరణకు రెండేళ్లుగా మీ ఐటీ రిటర్ను రూ. 70, రూ.80 అనుకోండి మొత్తం ఒకేసారి 150 మీ ఖాతాలో జమ చేయబడుతుంది.

IT Refund: రీఫండుతో సంబంధం లేకుండా మీ రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ID, మొబైల్ నంబర్‌కు ఆదాయపు పన్ను శాఖ నుంచి సందేశం వస్తుంది.