రూపాయి విలువ మరింత క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే చరిత్రలో తొలిసారి 80.06కు చేరుకుంది. ఆర్థిక మాంద్యం భయాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్ని దేశాల కరెన్సీ విలువను దెబ్బతీశాయి. అమెరికా బాండ్ యీల్డులు రాబడి పెరగడంతో డాలరుకు డిమాండ్ పెరిగింది. ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకున్నా రూపాయి క్షీణత ఆగడం లేదు. దిగుమతి చేసుకొనే సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎల్.ఈ.డి టి.విలు, డిజిటల్ కెమేరాలు, సర్క్యూట్ బోర్డులు.. దిగుమతి చేసుకొనే లగ్జరీ కార్లు, వాటి విడిభాగాల ధరలు పెరుగుతాయి. చమురు ధర పెరుగుదలతో ప్రయాణ ఖర్చులు భారమవుతాయి. విదేశీ విద్య ఖర్చు పెరుగుతుంది. సబ్బులు, కాస్మొటిక్స్, పెయింట్స్ ధరలు పెరుగుతాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులు తరలి పోతాయి.