Panchang 21 July 2022: జులై 21 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హయగ్రీవ సంపదా స్తోత్రం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 21 గురువారం పంచాంగం
తేదీ: 21-07 -2022
వారం: గురువారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం,బహుళ పక్షం
తిథి : అష్టమి గురువారం మధ్యాహ్నం 12.13 వరకు తదుపరి నవమి
నక్షత్రం: అశ్విని సా 6.41 వరకు తదుపరి భరణి
వర్జ్యం : మధ్యాహ్నం 2.34 నుంచి 4.12 వరకు తదుపరి గురువారం రాత్రి తల్లవారుజామున 4.43 నుంచి సూర్యోదయం వరకు
దుర్ముహూర్తం : ఉదయం 9.57 నుంచి 10.49 వరకు
అమృతఘడియలు : ఉదయం 11.17 నుంచి 12.25 వరకు
సూర్యోదయం: 05:38
సూర్యాస్తమయం : 06:34
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: కామవాంఛతో పురుషులు…ధర్మం విడిచిన స్త్రీలు… కలియుగంలో మనుషుల ప్రవర్తనపై శివపురాణం ఏం చెప్పిందంటే…
లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై శ్రీ మహా విష్ణువు ఎన్నో అవతారాలెత్తాడు. అలాంటి వాటిలో దశావతారాలు ముఖ్యమైనవి. అయితే దశావతారాలు కాకుండా తన భక్తుల కోసం విష్ణమూర్తి మరో అవతారమే హయగ్రీవుడు. హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా … జ్ఞానప్రదాతగా పూజలు అందు కుంటున్నాడు. లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య – విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
హయగ్రీవ శ్లోకం
జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే
జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారం అని అర్థం. కేవలం విద్య మాత్రమే కాదు.. రాఖీ పౌర్ణమి రోజు హయగ్రీవుడిని ఆరాధిస్తే అన్ని కార్యాలయాల్లోనూ విజయం సిద్ధిస్తుందని చెబుతారు. దేవీ పురాణం, స్కాంధ పురాణం, శ్రీమద్భాగవతంతోపాటు ఆగమ శాస్త్రాల్లో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది.
Also Read: శ్రావణ భార్గవిని వివాదంలోకి నెట్టిన ఈ కీర్తన అసలు సందర్భం, అర్థం తెలుసా!
హయగ్రీవ సంపదా స్తోత్రం(Hayagreeva Sampada Stotram in Telugu)
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః ||1||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ .
తస్య నిస్సరతే వాణీ జహ్ను కన్యాప్రవాహవత్ ||2||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిహిః |
విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః ||3||
శ్లోక త్రయమిదం పుణ్యం హయగ్రీవపదాంకితం |
వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం . ||4||
ఇతి శ్రీమద్వాదిరాజ పూజ్య చరణ విరచిత
హయగ్రీవ సంపదా స్తోత్రం సంపూర్ణం ||
Also Read: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!