Ramadan 2023: ఈ సారి మన దేశంలో ఈద్ కా చాంద్ ఆలస్యం
ముస్లింలు ఈ సంవత్సరం మొదటి రంజాన్ ఉపవాసాన్ని 23 మార్చి గురవారానికి బదులుగా శుక్రవారం 24 మార్చి న ప్రారంభిస్తారు.
రంజాన్ నెలవంక లేదా రంజాన్ కా చాంద్ భారతదేశంలో ఎక్కడా కనిపించలేదని జమియత్ ఉలమా ఇ హింద్ ప్రకటించింది. ముస్లింలు ఈ సంవత్సరం మొదటి రంజాన్ ఉపవాసాన్ని 23 మార్చి గురువారానికి బదులుగా శుక్రవారం 24 మార్చి న ప్రారంభిస్తారు. చంద్రదశల ఆదారంగా ముస్లింలు ఇస్తామిక్ క్యాలెండర్ ను అనుసరిస్తారు. అందువల్ల రంజాన్ ప్రారంభించే రోజు ముగించే రోజు కూడా నెలవంక దర్శనం మీదే ఆధారపడి ఉంటాయి.
రంజాన్ నెలవంక 2023 లో సౌది అరేబియా, యూఏఈ, యూకే ఇంకా కొన్ని ముస్లిం మెజారిటీ దేశాలలో మార్చి 22న కనిపించింది. ఆ దేశాల్లో మొదటి ఉపవాసం మార్చి 23 న ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యాయి. సూర్యాస్తమయం తర్వాత తరావీహ్ ప్రారంభమవుతుంది. మార్చి 22న ఇండియా బంగ్లాదేశ్ ఇతర దక్షిణాసియా దేశాల్లో నెలవంక కనిపించలేదు. కనుక ఈ దేశాలకు మార్చి 24, రంజాన్ 1444 AH నుంచి ప్రారంభమవుతుంది.
ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, పాకిస్తాన్, దక్షిణాఫ్రీకా, ఇండోనేషియా, మలేషియా లో మార్చి 22న రంజాన్ కా చాంద్ కనిపించాల్సి ఉంది. కానీ కనిపించలేదు. అంటే హిజ్రీ1444 షాబాన్ 29వ రోజు, మొదటి ఉపవాసం మార్చి 24న మొదలవుతుంది. ఈ దేశాల్లో తరావీహ్ మార్చి 23 సాయంత్రం నుంచి ప్రారంభం అవుతుంది.
ఇస్లాం సంప్రదాయం ప్రకారం లూనార్ క్యాలెండర్ లో తొమ్మిదవ నెల రంజాన్. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అంతా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. దాదాపు నెలంతా పండుగ రోజులుగా పరిగణిస్తారు. భక్తిగా, ఆధ్యాత్మిక ధర్మిక కార్యక్రమాల్లో గడుపుతుంటారు. ఈ నెలలోనే ఖురాన్ స్వర్గం నుంచి భూమి మీదకు వచ్చిందని నమ్మకం. రంజాన్ నెలలో ఉపవాసం ఇస్లాం 5 మూలస్థంబాలలో ఒకటి. ఈ సమయంలో భోజనం, మద్యపానం, పొగతాగడం, చెడు ఆలోచనల వంటి వాటన్నింటికి దూరంగా ఉంటారు.
ఈ నెలంతా కూడా ముస్లింలు ప్రార్థనలో, ఖురాన్ పఠనంలో ఎక్కువ సమయం గడుపుతారు. మసీదులు కూడా రంజాన్ సందర్భంగా అదనపు సేవలను అందిస్తాయి. ఈ సేవల్లో తరావీహ్ ప్రార్థనలు కూడా ఉంటాయి. ఇవి సాధారణంగా జరిగే ప్రార్థన కంటే ఎక్కువ సమయం పాటు సాగే పగటి ప్రార్థనలతో పాటు రాత్రి ప్రార్థనలు కూడా ఉంటాయి. ఈ నెలంతా కూడా కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు. దానధర్మాలు చెయ్యడానికి ప్రాధాన్యతను ఇస్తారు. వీలైనంత ఎక్కువ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గడిపేందుకు ప్రయత్నం చేస్తారు.
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాస దీక్ష చేస్తారు. సూర్యోదయానికి ముందు సెహరీతో ప్రారంభైమన ఉపవాస దీక్ష ప్రతి రోజూ సూర్యాస్తమయం తర్వాత చేసే ఇఫ్తార్ అనే విందుతో ముగిస్తారు. మరుసటిరోజు తెల్లవారు జామున సెహరీతో తిరిగి ఉపవాసం మొదలవుతుంది. ఇలా నెల రోజుల పాటు సాగుతుంది. చివరి రోజున నెలవంక దర్శనంతో ఉఫవాస దీక్షలు పూర్తయిపోతాయి. తర్వాత ఈద్ ఉల్ ఫీతర్ అనే పండుగ చాలా వైభవంగా జరుపుకుంటారు.
ఈ ఏడాది రంజాన్ పండుగ జరుపుకోబోతున్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్, హ్యాపీ రంజాన్.