Happy Geetha Jayanthi 2024: భగవద్గీత చదివితే ఏం ఉపయోగం .. మిమ్మల్ని కమ్మేసిన మాయను దాటి రాగలరా!
Geetha Jayanthi 2024 wishes : భగవద్గీత ... మాయామోహితుడైన అర్జునుడికి మాత్రమే ఉపదేశించింది కాదు .. ప్రతి మనిషి మహోన్నతుడిగా ఉండాలని శ్రీకృష్ణుడు పూరించిన శంఖారావం ఇది.
Happy Geetha Jayanthi 2024: నరుడి అభ్యున్నతికి నారాయణుడు బోధించిన జీవనసారం గీత. ఇక్కడ నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు. నరుడు.. ఆ రోజు ఒక్క అర్జునుడే! ఈ రోజు.. మనమంతా!
మూడు కాళ్ల ముదుసలికి కాలక్షేపం కాదు
వైరాగ్యంతో వినాల్సిన గ్రంధం కాదు
నవ యవ్వనుడు చిత్తశుద్ధితో ఆచరించాల్సిన నియమావళి
జీవితంలో ప్రతిమలుపుని అద్భుతంగా తీర్చిదిద్దే దిక్సూచి
ఇందులో అస్త్ర శస్త్రాల గురించి లేదు..యుద్ధ నీతులు, వ్యాహాలు చెప్పలేదు
కేవలం నరుడైన అర్జునుడిని అవహించిన మాయను తొలగించేందుకు శ్రీ కృష్ణుడిగా ఉన్న నారాయణుడు బోధ
Also Read: మనిషినిగా ఎలా జీవించాలో నేర్పించే మార్గదర్శి భగవద్గీత పుట్టిన రోజు - ఈ రోజు ఏం చేయాలి!
క్రణశిక్షణను మించిన ఆయుధం లేదు
ప్రస్తుత నీ నడవడికే నీ భవిష్యత్. యవ్వనంలో ఉన్నప్పుడు నువ్వు చేసే సావాసాలు, వేసే అడుగులే భవిష్యత్తును నిర్దేశిస్తాయి. బలవంతుడిని అనే గర్వంతో విర్రవీగి జీవితాన్ని చేజార్చుకుంటే చరమాంకంలో పశ్చాత్తాపం చెందినా ప్రయోజనం లేదు.
యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా
సరైన ఆహార నియమాలు పాటించాలి. సరైన అలవాట్లు కలిగుండాలి. ఆహార, వ్యవహారాల్లో మంచి, చెడులను గుర్తించిన వారు దుఃఖం నుంచి దూరంగా ఉంటారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఒక్కటే చాలదు..దానిని సాధించడానికి అహర్నిశలూ కృషి చేయాలి.
Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
నీ పని నువ్వే చేయి
ఎవరో వస్తారనో..ఏదో చేస్తారోనే ఆగదు..నీ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకు. ఏ పని కోసం ఎవరిపైనా ఆధారపడకు.
నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః
శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేదకర్మణః
నీకు నిర్దేశించిన కర్మలు నువ్వు ఆచరించడమే సరైనది. ఏ కర్మలను ఆచరించకపోవడం కన్నా నీ ధర్మాన్ని అనుసరించి పని చేయడమే ఉత్తమం. ఇక్కడ కర్మ అంటే మీ వృత్తి, ఉద్యోగ ధర్మం. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో అనుక్షణం పోరాడాల్సిందే..బాధ్యతలు తీసుకోవాల్సిందే.
Also Read: పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు!
విజయమో - వీర స్వర్గమో
పారిపోవడమా ..పోరాడటమా...ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో చాలాసార్లు ఎదురవుతుంటాయి. పరారైతే చరిత్ర హీనులుగా మిగిలిపోతాం. పోరాడితే అయితే విజయం అయినా దక్కుతుంది లేదంటే వీరమరణంతో సమానమైన విలువైన పాఠం నేర్చుకోవచ్చు. అందుకే ఎప్పటికీ పలాయనం సరైన చర్య కాదు. సమస్యను ఎదురించి పోరాడితేనే పరిష్కారం లభిస్తుంది.
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీమ్
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః॥
యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది... గెలిస్తే రాజ్యలక్ష్మి సిద్ధిస్తుంది. ఏదైనా నీకు ప్రయోజనమే, కృతనిశ్చయంతో యుద్ధానికి సిద్ధమవ్వు. పోరాడాల్సిన సమయంలో సమస్యల నుంచి పారిపోతే వాటివల్ల సమస్య పెరుగుతుందే కానీ పరిష్కారం దొరకదు. పోరాటాన్ని అలవాటుగా చేసుకుంటే మరుక్షణం విజయం దక్కకపోయినా అంతిమవిజయం నీదే అవుతుంది.
మాయను దాటిరా..
మనసు పొరల్లో ఉండిపోయిన విషయాలు జ్ఞానాన్ని చంపేస్తాయి.. రాగద్వేషాలుగా మారి మనసుని కప్పేస్తాయి..ఆలోచన చంపేస్తాయి..అతి విశ్వాసంతో జీవితాన్నే కోల్పోయే పరిస్థితికి వచ్చేస్తారు. వీటిని దాటుకుని వచ్చినప్పుడే జ్ఞానం వికసిస్తుంది..విజయం సొంతం అవుతుంది.
‘ధూమేనావ్రియతే వహ్నిః యథాధర్శో మలేన చ
యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతమ్
పొగతో నిప్పు..దుమ్ముతో అద్దం.. మావితో గర్భస్థ శిశువూ కప్పబడి ఉన్నట్టే జ్ఞానం మాయతో కప్పేసి ఉంటుంది. అద్దంపై మురికి పడితే తన ప్రకాశాన్ని కోల్పోయినట్టే మనసు కూడా అంతే. ఆకర్షణలనే మాయాపొరలు మనసును కమ్మితే కర్తవ్యాన్ని విస్మరించేస్తారు..ఏది మంచి ఏద చెడు అనే విచక్షణ కోల్పోతారు. వాటిని దాటుకుని వచ్చి ఆలోచిస్తే బుద్ధి వికసిస్తుంది..భవిష్యత్ లో వెలుగు వస్తుంది.
గీతోపదేశం పూర్తైన తర్వాత...అర్జునుడికి తన కర్తవ్యం అవగతం అయింది...అస్త్రశస్త్రాలతో కురుక్షేత్రంలో అగుగుపెట్టి విజయం సాధించాడు. మరి మీకేం అర్థమైంది? మీ జీవితాన్ని ఏ దిశగా నడిపిస్తారు?...
Also Read: ఇవి తెలుసుకుంటే భగవద్గీత చదివినట్టే