అన్వేషించండి

Guru Purnima 2025: పతంజలి యోగపీఠ్‌లో ముగిసిన గురు పూర్ణిమ వేడుకలు, గురు-శిష్య సంప్రదాయాన్ని కొనియాడిన రామ్‌దేవ్

Guru Purnima 2025 | ప్రపంచంలో పలు దేశాలు ఆధిపత్య పోరాటంలో ఉన్నాయని యోగా గురు రామ్‌దేవ్ అన్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక నాయకుడిగా భారత్ స్థిరపడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

Guru Purnima 2025 Celebrations:  జూలై 10న దేశవ్యాప్తంగా గురు పూర్ణిమను ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈవెంట్‌ను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున భారత్‌లో జరుపుకుంటారు. మహాభారతంతో పాటు 18 పురాణాల రచయిత అయిన మహర్షి వేద వ్యాసుడు ఈ రోజున జన్మించాడని హిందువులు విశ్వసిస్తారు. అందువల్ల, ఈ రోజును గురువుల ఆరాధనకు అంకితం చేశాం. ఈరోజును వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు.

వేద వ్యాసుడు మొదటి గురువుగా పరిగణిస్తాం. ఈ సందర్భంగా, పతంజలి యోగపీఠ్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు అయిన రామ్‌దేవ్, ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణ మార్గదర్శకత్వంలో పతంజలి వెల్నెస్, యోగపీఠ్-2లోని యోగ భవన్ ఆడిటోరియంలో గురు పూర్ణిమ వేడుకను ఘనంగా నిర్వహించారు.

స్వామి రామ్‌దేవ్ ఏమన్నారంటే..

ఈ కార్యక్రమంలో రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ ఒకరినొకరు పూలమాలతో సన్మానించుకుని పరస్పరం గౌరవించుకున్నారు. దేశ ప్రజలకు వీరు గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వామి రామ్‌దేవ్ మాట్లాడుతూ.. గురు పూర్ణిమ అనేది సనాతన ధర్మాన్ని కొనసాగించే పండుగ లాంటిది అన్నారు. ఇది భారతదేశంలో గురు-శిష్యుల గొప్ప సంప్రదాయానికి, శాశ్వత సాంస్కృతిక వారసత్వానికి పరిపూర్ణతను తెచ్చే వేడుక అని పేర్కొన్నారు. 

వేదాలు, గురు ధర్మంలోనూ జాతీయ కర్తవ్య సారం ఉందని బాబా రామ్‌దేవ్ తెలిపారు. ప్రస్తుత ప్రపంచ ఆధిపత్యం కోసం పోరాటానికి సాక్ష్యంగా నిలుస్తోందని, అయితే ఈ ఆధిపత్యం సత్యం, యోగ, ఆధ్యాత్మికత, న్యాయంపై ఆధారపడి ఉంటేనే అందరికీ ప్రయోజనం చేకూరుతుందని రాందేవ్ పేర్కొన్నారు.

గురు పూర్ణిమ ప్రాముఖ్యతపై ఆచార్య బాలకృష్ణ

ఈ సందర్భంగా ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ.. గురు పూర్ణిమ అనేది గురు-శిష్యుల ప్రాముఖ్యత, మన సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగ అన్నారు.  అయితే, ఒకరు పూర్తి నమ్మకంతో తమ గురువు మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ సంప్రదాయానికి నిజమైన అర్థం ఉంటుందని పేర్కొన్నారు. గురు-శిష్యుల వంశపారంపర్యం, యోగ, ఆయుర్వేదం, సనాతన ధర్మం, వేదాల నుంచి లభించిన జ్ఞానం ద్వారా భారతదేశం ప్రపంచానికి పెద్దన్న హోదాను పొందుతుందని ఆయన స్పష్టం చేశారు.

యాత్రికులకు ఆహారం అందిస్తున్న పతంజలి యోగపీఠ్

కన్వర్ యాత్ర కోసం హరిద్వార్‌లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. పవిత్ర జలం కోసం దేశంలోని నలుమూలల నుంచి భక్తులు హరిద్వార్‌కు చేరుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పతంజలి యోగపీఠ్ ఒక నిరంతర కిచెన్ (అఖండ భండారా) ఏర్పాటు చేసింది. దాంతో భక్తులకు పతంజలి యోగపీఠ్ భోజనం అందించి వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget