Garuda Purana: గరుడ పురాణం ప్రకారం..ఇంట్లో సుఖసంతోషాలకోసం ఈ 3 మార్గాలను అనుసరించండి!
గరుడ పురాణం ప్రకారం ఇంట్లో సుఖశాంతులు కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

Garuda Purana: హిందూ శాస్త్రాల ప్రకారం, ఈ భూమిపై మనిషి చేసే కర్మలను బట్టి..మరణానంతరం తగిన ఫలితం లభిస్తుంది. సనాతన ధర్మంలో దేవతలతో ముడిపడి ఉన్న అనేక పురాణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి గరుడ పురాణం. శ్రీ మహావిష్ణువు స్వయంగా తన వాహనం అయిన గరుత్మంతుడికి చెప్పిన వివరాలు ఇవి. సాధారణంగా గరుడ పురాణం అనగానే ఆత్మలు, ఆత్మ ప్రయాణం, నరకం, పాపాల చిట్టా, పరిహారాలు, శిక్షలు అవే గుర్తొస్తాయి అందరకీ. కానీ ఇందులో తల్లికడుపులో నలుసు పడినప్పటి నుంచీ జన్మించేవరకూ.. ఆ తర్వాత జీవనం... మరణం వరకూ మొత్తం ఉంటుంది. పాపాలు, శిక్షలు మాత్రమే కాదు..ఉత్తమ వ్యక్తిగా ఆచరించాల్సిన చాలా విషయాలున్నాయి ఇందులో. వాటిని పాటించడం ద్వారా జీవితంలో సుఖశాంతులుంటాయి. ఆయుష్షు, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అవేంటో తెలుసుకుందాం
ఆహారం
గరుడ పురాణంలో ఇంటి సమృద్ధి.. శాంతిని కాపాడుకునేందుకు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పింది. వండిన ఆహారాన్ని దేవునికి సమర్పించకుండా ఎంగిలి చేయకూడదు, రుచి చూసి వంటచేయకూడదు అని స్పష్టంగా చెప్పింది. ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆహారం, ధనానికి కొరత ఉండిపోతుందట. వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం.. మిగిలిన ఎంగిలి ఆహారాన్ని ఉంచకపోవడం లక్ష్మీదేవి అన్నపూర్ణా దేవి అనుగ్రహం పొందడానికి ఒక మార్గం అని చెబుతారు.
స్త్రీలను గౌరవించడం
ఈ పురాణంలో స్త్రీల ప్రాముఖ్యతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే మహిళలను గౌరవిస్తారో, అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అదే సమయంలో ఎక్కడైతే స్త్రీలను అవమానిస్తారో అక్కడ సుఖసంతోషాలు నెమ్మదిగా అంతరించిపోతాయి. చాలా మంది తల్లిదండ్రులను, పెద్దలను, భార్యను అవమానిస్తూ విమర్శిస్తూ ఉంటారు. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తనింట్లో స్త్రీలను గౌరవించకపోతే కష్టానికి తగిన ఫలితాన్ని పొందలేడు. అందుకే పెద్దలపట్ల గౌరవంతో, సేవాభావంతో ఉండాలి.
దానం
హిందూ ధర్మంలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ జన్మలో చేసే దానధర్మాలే మరుజన్మను నిర్ణయిస్తాయని చెబుతారు. చేసిన దానధర్మాల గురించి చెప్పుకోకూడదు. చేసే మంచి ఎప్పుడూ గోప్యంగా ఉంచాలని చెప్పడం వెనుక ఆంతర్యం ఇదే. ప్రతి ఒక్కరూ తన శక్తి మేరకు అవసరమైనవారికి సహాయం చేయాలి. క్రమం తప్పకుండా దానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి. తద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించినవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
నరకం నిజమా? మోక్షం ఉంటుందా? గరుడ పురాణానికి సంబంధించిన 3 భయంకరమైన హెచ్చరికలు!
అదృష్టాన్ని దూరం చేసి అజ్ఞానాన్ని పెంచే అలవాట్లు ఇవి - గరుడ పురాణం చెప్పిన ముఖ్యమైన విషయాలివే!
కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులేవి తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
'కాంతార' దేవుళ్ళు నిజంగా ఉన్నారా? పంజుర్లి, గుళిగ గురించి మిమ్మల్నిఆశ్చర్యపరిచే నిజాలు!






















