అన్వేషించండి

Khairatabad Ganesh 2023: ఈ ఏడాది 'దశ మహా విద్యా గణపతి' గా ఖైరతాబాద్ వినాయకుడు

ఖైరతాబాద్ మహా గణపతికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. ఏడాదికోరూపంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈ సంవత్సరం శ్రీ దశమహా విద్యాగణపతి రూపంలో కొలువుతీరనున్నాడు. ఆ విశేషాలు మీకోసం..

Ganesh Chaturthi 2023

శ్లోకం
వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా 

హిందువులకు అతి ముఖ్యమైన పర్వదినం "వినాయక చవితి". శివపార్వతుల కుమారుడైన గణనాథుడి జన్మదినాన్ని పురస్కరించుకుని "వినాయక చవితి" జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాసంలో నాలుగో రోజు..అంటే చవితి రోజు ప్రారంభమై..నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. వినాయకచవితి రోజు ప్రతిఇంట్లో బొజ్జగణపయ్య సందడి ఉంటే.. మండపాల్లో మాత్రం దాదాపు 11 రోజుల పాటూ లంబోదరుడు పూజలందుకుని.. ఆ తర్వాత ఊరేగింపుగా గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. భారత దేశం లో ని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగని "గణేష్ చతుర్ధి" లేదా "వినాయక చతుర్ధి" అని కూడా పిలుస్తారు. ఏ కార్యం ప్రారంభంచాలన్నా, ప్రారంభించిన పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుడిని వేడుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబరు 18న వచ్చింది. వీధికో లంబోదరుడు దర్శనమిచ్చినా ఖైరతాబాద్ విగ్రహానికున్న ప్రత్యేకతే వేరు.

Also Read: అష్టకష్టాలు తొలగించి ఐశ్వర్యాన్నిచ్చే స్తోత్రం - శ్రావణ శుక్రవారం పఠించండి!

శ్రీ దశమహా విద్యాగణపతి 
విఘ్నాధిపతిగా తొలిపూజ అందుకునే గణపయ్యను వాడవాడలా ఘనంగా పూజించే వేడుక దగ్గరకొచ్చేస్తోంది. గతేడాది 50 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ మహా గణపతి విగ్రహం ఈ ఏడాది 63 అడుగుల్లో రూపుదిద్దుకోనుంది.  శ్రీ దశమహా విద్యాగణపతి భక్తులను అనుగ్రహించనున్నాడు పార్వతీ తనయుడు. విగ్రహం ఎత్తు 63 అడుగులు, వెడల్పు 28 అడుగులుగా ఉండనుంది. నిల్చున్న తీరులో 'శ్రీ దశమహా విద్యాగణపతి' విగ్రహం ఉండగా.. తలపై ఏడు సర్పాలు ఉండనున్నాయి. వెనక సంస్కృతంలో రాసిన గ్రంథం కనిపిస్తుంది. పది చేతులు ఉంటాయి. కుడి వైపు చేతుల్లో కింద నుంచి పైకి ఆశీర్వాదం, దండ, ధాన్యం, తల్వార్, బాణం ఉంచుతారు. ఎడమవైపు కింద నుంచి పైకి చేతిలో లడ్డూ, గ్రంథం, తాడు, అంకుశం, బాణం ఉంటాయి. కాళ్ల వద్ద అటూ ఇటూ పది అడుగుల ఎత్తున వరాహదేవి, సరస్వతీ దేవి విగ్రహాలు ఉంటాయి. ప్రధాన మండపం రెండు వైపులా శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహస్వామి, శ్రీ వీరభద్ర స్వామి వార్ల విగ్రహాలు దాదాపు 15 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంటాయి. ఇప్పటికే విగ్రహం తయారీ పనులు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. చవితి పండుగకు మూడు రోజుల ముందే భక్తులు విగ్రహాన్ని చూడొచ్చని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ హితం కోసం మట్టి గణపతినే ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు నిర్వాహకులు.

Also Read: దైవారాధన నుంచి ఖగోళంలో జరిగే అద్భుతాల వరకూ అన్నిటికీ ఈ పురాణాలే ఆధారం!

గణేశ ద్వాదశనామ స్తోత్రమ్

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః ||

అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః |
సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః || 

గణానామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః |
ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక || 

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః || 

ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |
ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ || 

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్ |
ఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్ ||

విధ్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే || 

|| ఇతి ముద్గలపురాణోక్తం శ్రీగణేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్ ||

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget