ఐదవ రోజు లతితా త్రిపురసుందరీ దేవి, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు
ఐదవ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. ఎరుపు రంగు చీరతో చేతిలో చెరకు విల్లు ధరించిన దేవి రూపం ఈరోజున ఆశిస్సులు అందిస్తుంది.
ఆశ్వయుజ శుద్ధ పంచమి శరన్నవరాత్రుల్లో శుక్రవారం 5వ రోజు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు పంచమి. ఈ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనం ఇస్తారు. లలితాత్రిపుర సుందరీ దేవికి కుంకుమార్చన ఇష్టమైన సేవ. ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించి దద్యోధనం లేదా రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించాలి. ఎర్ర కలువల తో పూజించడం శ్రేష్ఠం. అవి దొరకని పక్షంలో మందారాలు లేదా మరేదైనా ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించుకోవాలి.
త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవి అని అర్థం. అమ్మవారు ఒక చేత చెరుకు విల్లు ధరించి మరో చేతిలో పూబాణాలను ధరించి ఉంటుంది. భండాసుర సంహారం కోసం అవతరించిన దేవి లలితా త్రిపుర సుందరి. భండాసురుని వధించేందుకు ఆమె భీకరమైన యుద్ధం చేసిన లలితకు ‘‘కరాంగూళీ నఖోత్పన్న నారయణ దశాకృతి’’ అనే నామం ఏర్పడింది. త్రిపుర సుందరీదేవి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సకల శుభాలు కలుగుతాయి.
ప్రకృతిశక్తికి ప్రతీక లలితాదేవి. మన చుట్టూ ఉండే పాంచభౌతిక శక్తే శ్రీలలిత. పంచభూతాలన్నీ ఒకదానిలో ఒకి ఇమిడి ఉన్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే ఐదు రూపాలలో ఒకదానిలో ఒకటి చొచ్చుకొని ఉన్నాయి. ఇన్నింటిలోను ఉండే శక్తి మరొకి ఉంది. ఆ శక్తినే లలితగా భావన చేసే సంప్రదాయం భారతీయులది. ఇంకా విశేషంగా భూమిచుట్టూ ఉన్న ఓజోన్ పొర లోపలి భాగంలో జీవశక్తి వృద్ధి చెందుతుంది. ఈ అంశాన్ని శ్రీ సూక్తం (హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం) ఈ శక్తి హిరణ్య ప్రాకారాంతర్గతమని చెప్పడం జరిగింది. అంటే హిరణ్య ప్రాకారమే ఓజోన్ పొర. ఈ ఓజోన్ పొర (హిరణ్య ప్రాకారం)కు బయట జ్వలంతిగా లోపలివైపు ఆర్ద్రగా కనిపిస్తుంది. భూమి శివలింగంగా భావనచేస్తే భూమి చుట్టూ ఆవరించి ఉన్న ఈ అమ్మవారిని లలితగా భావన చేస్తాం. అందుకే శివుని మీద కూర్చున్న లలిత విగ్రహాలుగా మనం చూస్తుటాం. ఈ అమ్మవారి ఉపాసన వ్యక్తిలో సౌమ్యత్వాన్ని పెంచుతుంది.
కామ్యార్థాలకు, మోక్షార్థాలకు రెండింకి కూడా లలితాదేవి ఆలంబన. శ్రీచక్ర స్థితంగా కనిపించే అమ్మవారు లలితా త్రిపుర సుందరి. లలితాఅమ్మవారి శక్తిని ఖడ్గమాలగా కూడా కొలిచే సంప్రదాయ ఉంది. ఆత్మ, మనస్సు, శరీరం అనేవి మూడు పురాలు. వీటినే త్రిపురాలు అంటారు. ఈ మూడు పురాలలో ఉండే రాక్షసత్వం (త్రిపురాసురులు) తొలగిస్తే అమ్మ సౌందర్యాన్ని నింపి త్రిపుర సుందరిగా వెలసిల్లుతుంది. పాంచభౌతికశక్తి సమాహారమైన అమ్మవారిని తత్త్వాన్ని ఉపాసిస్తే మన పాంచభౌతిక శరీరంలో అన్ని భాగాలలోను అనంతమైన శక్తి చేకూరి మనని శాశ్వతులను చేసే ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఆ తత్త్వాన్ని తెలుసుకుని ఈ నవరాత్రుల్లో ఉపాసిద్దాం.
Also Read: ఈ రాశులవారికి సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!
మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీః విశ్వమంగళమ్
షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ ఇష్టకామేశ్వరీ కుర్యాత్ జగన్నీరోగ శోభనమ్
జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ లోకం సద్బుద్ధి సుందరమ్
పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దద్యాత్ మాంగల్యానంద జీవనమ్
సకుంకుమ విలేపనా మళిక చమ్బి కస్తూరికాం
సమన్దహసితేక్షణాం సశరచాప పాశాంకుశాం
అశేషజనమోహినీ మరుణమాల్యభూషామ్బరాం
జపాకుమ భాసురాం జపవిధౌ స్మరేదమ్బికాం
అస్య శ్రీలలితా త్రిశతీ స్తోత్ర మహామంత్రస్య
భగవాన్ హయగ్రీవ ఋషి:
అనుష్లప్ ఛంద:
శ్రీలతితా మహా త్రిపుర సుందరీ దేవతా
ఐం –బీజం
సౌ: -శక్తి:
క్లీం – కీలకం
శ్రీ లలితా మహా త్రిపుర సుందరీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ:
వీటితో పాటు ఖడ్గమాల, అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి.
Also Read: నవరాత్రుల నాలుగో రోజు ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి