అన్వేషించండి

Monday Rituals : సోమవారం శివుడిని ఇలా పూజిస్తే.. ఆదాయం పెరుగుతుందట

Shiva Puja : మీ జీవితంలో కొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే సోమవారం రోజున శివునికి కొన్ని పరిహారాలు చేస్తే సమస్యలు దూరం అవుతాయట.

Lord Shiva Rituals : సోమవారాన్ని శివుడి రోజుగా చెప్తారు. అందుకే భక్తులు సోమవారం రోజున శివారాధన చేస్తారు. అయితే మీకు తీరని సమస్యలు ఏమైనా ఉంటే శివునికి కొన్ని పరిహారాలు చేయడం వల్ల అవి తీరుతాయని భక్తులు నమ్ముతారు. మహాదేవుని శరణువేడుకోవడం వల్ల కష్టాలు దూరమవుతాయని.. శివయ్య అందరినీ చల్లగా చూస్తాడని భక్తులు నమ్మి పూజలు చేస్తారు. అయితే మీరు శివునికి పరిహారాలు చేయాలనుకుంటే సోమవారం మంచి రోజు. కొన్ని పరిహారాలు చేయడం వల్ల కష్టాలు నశించి.. జీవితంలో అపారమైన సంపదను పొందుతారని భక్తులు భావిస్తారు. మీరు కూడా ప్రస్తుతం కష్టాలలో ఉంటే.. కచ్చితంగా సోమవారం రోజు ఈ పరిహారాలు చేయండి. 

ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు

సోమవారం రోజు మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? అయితే మీరు వెళ్లేప్పుడు కచ్చితంగా మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. మీకు మంచి జరగాలని, విజయం వరించాలని మనసులో శివుడిని ప్రార్థించండి. సోమవారం ఇలా చేయడం వల్ల మీ మనసు సానుకూలంగా మారుతుంది. ఇంటర్వ్యూ బాగా కొనసాగుతుంది. అంతేకాకుండా మీ కృషి, హార్డ్​వర్క్​కి తగ్గ ఫలితం మీకు దక్కుతుంది. 

డబ్బు కొరత ఉంటే.. 

డబ్బు కొరత అనేది చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో డబ్బు కొరత ఎదుర్కొంటున్నారా? ఎంత ట్రై చేసినా మీ వ్యాపారంలో లాభం రావట్లేదా? దీనివల్ల మీకు ఏమి చేయాలనే ఆలోచన రావట్లేదా? ఇది మీ మనోబలాన్ని తగ్గిస్తుందా? అయితే మీరు సోమవారం రోజు ఇలా చేయండి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు.. రెండు తెల్లటి పువ్వులను మీతో ఉంచుకోండి. పని పూర్తయిన తర్వాత వాటిని ప్రవహించే నీటిలో వదిలేయండి. సోమవారం ఇలా చేయడం వల్ల మీ వ్యాపారం లాభాలను అర్జించడం ప్రారంభిస్తుంది. 

ఆనందంగా ఉండాలంటే.. 

ఎంత డబ్బున్నా.. ఆరోగ్యమున్నా.. ఆనందం లేకపోతే అన్ని వృథానే. అయితే మీలో సంతోషాన్ని, ఆనందాన్ని పెంచుకోవాలంటే.. సోమవారం రోజు తలస్నానం చేయండి. అనంతరం మీ ఇంటికి సమీపంలోని శివాలయానికి వెళ్లి.. నీటిలో కొంత గంగాజలం వేసి.. శివలింగానికి సమర్పించండి. శివయ్యకు ప్రార్థన చేస్తే.. ఐశ్వర్యంతో పాటు భౌతిక ఆనందం పెరుగుతుంది. 

శత్రువుల ఇబ్బంది పెడుతుంటే..

వ్యాపారంలో, ఉద్యోగంలో, కుటుంబంలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే.. శత్రువుల బాధ ఎక్కువైతే.. సోమవారు ఇలా చేయండి. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి.. శివుని ముందు నెయ్యి దీపం వెలిగించండి. అలాగే శివ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం శం శం శివయ్ శం శం కురు కురు ఓం అనే మంత్రాన్ని జపించండి. సోమవారం ఇలా చేయడం వల్ల మీకు శత్రువుల నుంచి విముక్తి దొరుకుతుంది. 

ఆదాయం పెరగాలంటే..

మీ శాలరీ మీకు సరిపోవట్లేదా? మీ ఆదాయం పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు సోమవారం రోజు శివలింగానికి పాలు సమర్పించండి. వీలైతే ఆవు పాలు అందించండి. అలాగే ఓం నంః శివాయ అనే శివమంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ జపాన్ని పూర్తి చేసిన తర్వాత మీ ఆదాయం పెరగడానికి శివుని చేతులు జోడించి ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. 

పిల్లలతో సంబంధాలు పెరగాలంటే..

మీ పిల్లలు అన్ని పనులలో మీకు సహాయం చేయాలని, వారితో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా? అయితే సోమవారం ఇలా చేయండి. శివునికి కొబ్బరికాయ సమర్పించి.. డ్రై ఫ్రూట్స్​ని నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయడం ద్వారా మీ పిల్లలు అన్ని పనులలో మీకు సహాయం చేస్తారు. వారితో మీ సంబంధం మెరుగ్గా ఉంటుంది. 

మనస్పర్థలు తొలిగిపోవాలంటే.. 

ఇంటి సభ్యులు, ప్రేమించిన వ్యక్తుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయా? మీ మనస్సు చంచలంగా ఉండి.. దేనిమీద ఫోకస్ చేయలేకపోతున్నారా? అయితే మీ ఇంటికి సమీపంలోని ఆలయాన్ని సందర్శించి.. శివునికి బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించండి. పేదలకు అన్నం దానం చేయండి. సోమవారం ఇలా చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల కుటుంబ వాతావరణంలో సానుకూలత వస్తుంది. 

ఇలా చేస్తే కోరికలు నిజంగా తీరుతాయా అనే డౌట్​తో కాకుండా.. నమ్మకంతో శివుడిని పూజిస్తే.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. భక్తులు నమ్మకంతో చేసినప్పుడే వారికి పాజిటివ్ ఆలోచనలు పెరిగి పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. 

Also Read : కలలో ఆవు కనిపించడం శుభప్రదమే - ఇలా కనిపిస్తే మాత్రం కీడే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Court: State vs A Nobody: నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
AP School Uniform: జగన్ సర్కార్ యూనిఫాం పాయే.. కూటమి ప్రభుత్వం కొత్త యూనిఫాం తెచ్చే..
జగన్ సర్కార్ యూనిఫాం పాయే.. కూటమి ప్రభుత్వం కొత్త యూనిఫాం తెచ్చే..
Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Viral Video: వెళ్తున్న రైల్లో స్టంట్స్ చేయాలనుకున్నాడు కానీ అలా ఇరుక్కుపోయాడు - ఈ వీడియో చూస్తే నవ్వాలా? జాలిపడాలా?
వెళ్తున్న రైల్లో స్టంట్స్ చేయాలనుకున్నాడు కానీ అలా ఇరుక్కుపోయాడు - ఈ వీడియో చూస్తే నవ్వాలా? జాలిపడాలా?
Embed widget