అన్వేషించండి

Dattatreya Jayanti 2023: మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి - ఈ రోజు చదవాల్సిన స్త్రోత్రం ఇదే!

Datta Jayanti 2023: అత్రి-అనసూయ సంతానం అయిన దత్తాత్రేయుడి జయంతి మార్గశిర పౌర్ణమి. ఈ రోజు ప్రత్యేక పూజ, పునస్కారం చేయకున్నా ఈ స్తోత్రం చదువుకున్నా మంచి జరుగుతుందంటారు పండితులు....

Dattatreya Jayanti 2023:   అత్రి మహాముని, మహా పతివ్రత అనసూయల సంతానం దత్తాత్రేయడు. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి ఆయన. సత్యాన్వేషణలో భాగంగా దత్తాత్రేయుడు చిన్న వయసులోనే ఇల్లు వదిలి వెళ్లి..జీవితంలో చాలా భాగాన్ని ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లోని నర్మదా నది ప్రాంతాలలో తిరుగాడారని పండితులు చెబుతారు.  ఉత్తర కర్ణాటకలో గాణ్గాపూర్ లో దత్తుడికి జ్ఞానోదయం కలిగింది. గిరినార్‌లో పర్వతాగ్రం వద్ద దత్త పాదముద్రలు ఉన్నాయంటారు. పరశురాముడిని గురించి ప్రస్తావించే త్రిపుర-రహస్య గ్రంథం గంధమాదన పర్వతం వద్ద దత్తుడు ధ్యానం చేస్తున్నట్లు పేర్కొంది. తన తండ్రి అత్రి మహర్షి ఆదేశానుసారం దత్తాత్రేయుడు గౌతమీ నది గట్టు వద్ద కూర్చుని శివుడిని ప్రార్థించాడని, చివరకు బ్రహ్మజ్ఞానం పొందాడని బ్రహ్మ పురాణం చెబుతోంది. అందుకనే, దత్తాత్రేయుడు నాథ సంప్రదాయంలో ఆది సిద్ధుడుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమి దత్త జయంతి సందర్భంగా చదువుకోవాల్సిన స్తోత్రం ఇదే...

Also Read: అనసూయ మహా పతివ్రత ఎందుకంటే!

Sri Dattatreya Stotram 

అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః
తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే

 శ్రీ దత్తాత్రేయ స్తోత్రం
జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిమ్ |
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే || 

అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్నారదఋషిః  
అనుష్టుప్ ఛందః  శ్రీదత్తః పరమాత్మా దేవతా  
శ్రీదత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||

నారద ఉవాచ |
జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే |
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |
దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తు తే ||

కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ |
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తు తే || 

హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

యజ్ఞభోక్త్రే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ |
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే || 

ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యేఽప్యంతే దేవస్సదాశివః |
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే || 

భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |
జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ |
సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తు తే || 

జంబూద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే |
జయమాన సతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తు తే || 

భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |
నానాస్వాద్యమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తు తే ||

బ్రహ్మజ్ఞానమయీ ముద్రావస్త్రమాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే || 

అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే || 

సత్యరూప సదాచార సత్యధర్మపరాయణ |
సత్యాశ్రయ పరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తు తే || 

శూలహస్త గదాపాణే వనమాలాసుకంధర |
యజ్ఞసూత్రధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |
దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తు తే ||

దత్తవిద్యాయ లక్ష్మీశ దత్తస్యాత్మస్వరూపిణే |
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |
సర్వపాపప్రశమనం దత్తాత్రేయ నమోఽస్తు తే ||

ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ |
దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ || 

ఇతి శ్రీనారదపురాణే నారదవిరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్ |

Also Read: ఈ రోజు దత్త జయంతి, దత్తుడు అంటే ఎవరు - ఈ రోజుకున్న విశిష్టత ఏంటి!

Sri Datta Ashtakam – శ్రీ దత్తాష్టకం
గురుమూర్తిం చిదాకాశం సచ్చిదానందవిగ్రహం |
నిర్వికల్పం నిరాబాధం దత్తమానందమాశ్రయే || 

యోగాతీతం గుణాతీతం సర్వరక్షాకరం విభుం |
సర్వదుఃఖహరం దేవం దత్తమానందమాశ్రయే || 

అవధూతం సదాధ్యానం ఔదుంబరసుశోభితం |
అనఘాప్రియా విభుం దేవం దత్తమానందమాశ్రయే ||

నిరాకారం నిరాభాసం బ్రహ్మవిష్ణుశివాత్మకం |
నిర్గుణం నిష్కళం శాంతం దత్తమానందమాశ్రయే || 

అనసూయాసుతం దేవం అత్రివంశకులోద్భవం |
దిగంబరం మహాతేజం దత్తమానందమాశ్రయే || 

సహ్యాద్రివాసినం దత్తం ఆత్మజ్ఞానప్రదాయకం |
అఖండమండలాకారం దత్తమానందమాశ్రయే ||

పంచయజ్ఞప్రియం దేవం పంచరూపసుశోభితం |
గురుపరంపరం వందే దత్తమానందమాశ్రయే ||

దత్తమానందాష్టకం యః పఠేత్ సర్వవిద్యా జయం లభేత్ |
దత్తానుగ్రహఫలం ప్రాప్తం దత్తమానందమాశ్రయే || 

Also Read: రాశిమారిన బుధుడు ఈ 5 రాశులవారి ఫేట్ మార్చేస్తాడు!

ఫలశ్రుతి –
ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః
సర్వసిద్ధిమవాప్నోతి శ్రీదత్తశ్శరణం మమ ||

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget