Draupadi and Satyabhama : భర్త మనసు దోచుకునేందుకు ద్రౌపది సత్యభామకి చెప్పిన సూత్రాలివే - ఈ తరం మహిళలూ ఆచరించొచ్చు!
Draupadi and Satyabhama: ఐదుగురు భర్తలున్నా ఎవ్వరి మనసు గాయపర్చకుండా బాధ్యతలు నిర్వర్తిస్తున్నావు...ఇదెలా సాధ్యం. ఆ సూత్రాలేంటో చెప్పమని ద్రౌపదిని అడిగింది సత్యభామ..ఆ సూత్రాలు ఇప్పటికీ ఆచరణీయమే..
Conversation between Draupadi and Satyabhama: ద్రుపదుడి యఙ్ఞవాటిక నుంచి ఆవిర్భవించిన శక్తి స్వరూపిణి ద్రౌపది. తల్లి గర్భంనుంచి జన్మించినది కాదు కావునే ద్రౌపదిని అయోనిజ అంటారు. అందంలోనే కాదు వ్యూహత్మకంగా ఆలోచించడంలోనూ ఆమెను మించినవారు లేరు. అందుకే కౌరవ సభలో దుశ్శాసనుడు, అడవిలో సైంధవుడు, విరాటుని కొలువులో కీచకుడు ఇలా ఎంతో మంది నుంచి అవమానాలు ఎదుర్కొన్నా కుంగిపోలేదు...స్త్రీ ప్రతీకారం ఎలా ఉంటుందో చూపించింది. మహాభారతంలో అడుగడుగునా ద్రౌపది వీరత్వం గురించి ప్రస్తావన ఉంటుంది. అయితే ఆమె ఎంత వీరవనితో అంత ఉత్తమ ఇల్లారు కూడా. అందుకే ఓ సందర్భంలో శ్రీ కృష్ణుడి ఇష్టసఖి సత్యభామ స్వయంగా ద్రౌపదిని కలసి..భర్త మనసు దోచుకోవాలంటే ఏ సూత్రాలు పాటించాలని అడిగింది. అప్పుడు సత్యభామకు ద్రౌపది ఇచ్చిన సమాధానం ఇదే...
Also Read: ఓదార్పు అంటే ఇదీ - ద్రౌపదీ వస్త్రాపహరణం తర్వాత శ్రీకృష్ణుడు-ద్రౌపది మధ్య జరిగిన సంభాషణ అత్యంత ఆసక్తికరం
సుఖం సంతోషం నుంచి కాదు దుఃఖం నుంచి వస్తుంది
భార్య - భర్త బంధం బలపడాలంటే కోటలు, రాజ్యాలు, ఆభరణాలు, పరిచారికలతో సేవలు ఇలా సకల భోగాలు అనుభవించడం కాదు... ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇద్దరూ కలసి దానిని ఎదుర్కోవాలి. ఆ కష్టం నుంచి బయటపడిన మరుక్షణమే అర్థమవుతుంది ఇద్దరి బంధం ఎంత బలమైనదో..విలువైనదో అని... అప్పటి నుంచి జీవితం ఊహించనంతగా మారిపోతుంది
భర్తకు సాదరంగా ఆహ్వానం పలకాలి
ఇంటినుంచి భర్త బయటకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు..ఇంటికి తిరిగిన వచ్చే క్షణంలోనూ చిరునవ్వుతో ఎదురెళ్లి తీసుకురావాలి. ఈ విషయం సౌందర్య లహరిలోనూ ఉంది...ఓ సారి కొలువులో ఉన్న పార్వతీదేవికి..శివుడి స్వరం వినిపించి ఆమె ఎక్కడుందో కూడా మర్చిపోయి పరుగుపరుగున ఎదురెళ్లి స్వామివారిని ఆహ్వానించింది.
భర్త బాగోగులు భార్య మాత్రమే చూడాలి
ఎన్ని బాధ్యతలలో తలమునకలై ఉన్నప్పటికీ భర్త అవసరాలను భార్యే దగ్గరుండి చూసుకోవాలి. ఎవ్వరికీ అప్పగించకూడదు. భార్య సేవలు చేస్తే అది ప్రేమతో కూడిన బాధ్యత అవుతుంది...మరొకరు సేవలు చేస్తే అది వారి అవసరం అని గుర్తించాలి
Also Read: అంపశయ్యపై ఉన్న భీష్ముడిని ద్రౌపది అడిగిన ఒకే ఒక ప్రశ్న!
మూడో వ్యక్తి ప్రమేయం వద్దు
భార్య-భర్త ఇద్దరూ కూడా ఏకాంతంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటారు. ఏకాంతం అంటే శృంగారపరమైనవి మాత్రమే కాదు కుటుంబాలకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి.. వాటిని ఎప్పుడూ మూడో వ్యక్తితో చెప్పకూడదు. అలా చెప్పినప్పుడు ఓసారి నమ్మకం కోల్పోతే ఆ బంధం బలహీనమైపోతుంది..
స్నేహతులెవరు - శత్రువులెవరు
జీవిత భాగస్వామి హితులు, స్నేహితులు ఎవరో తెలుసుకుని వారు ఇంటికి వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించాలి. అదే శత్రువులైతే వారిని కనీసం ఇంట్లో అడుగుపెట్టనీయకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి..
అదుపులో పెట్టాలన్న ఆలోచనే వద్దు
తన ఆలోచనలో తనని ఉండనివ్వాలి కానీ అదుపుచేయాలి అనుకోరాదు. ప్రేమ, బాధ్యతతో భాగస్వామిని అదుపు చేయాలి కానీ అందం, ఆకర్షణ, అజమాయిషీతో అదుపుచేసినా దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు
ఇలాంటి స్త్రీలకు దూరంగా ఉండాలి
మోసం చేసే స్త్రీలు, అబద్ధాలు చెప్పే స్త్రీలు, ఎక్కువసమయం కుటుంబానికి దూరంగా ఉండే స్త్రీలు చెప్పిన మాటలు ఎప్పుడూ వినడం తగదు. ఇలాంటి స్త్రీలు బంధాలను నాశనం చేయడానికి వెనుకాడరు..
ఇప్పటి తరంలో బంధం నిలబడాలంటే భార్యమాత్రమే కాదు..భర్త కూడా ఈ సూత్రాలు పాటించడం చాలా అవసరం అంటారు పండితులు..