అన్వేషించండి

Chanakya Niti: మీ ద‌గ్గ‌ర డబ్బు ఉన్నపుడు ఈ 3 తప్పులు చేయొద్దు

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి ధనవంతుడు అయినప్పుడు లేదా డబ్బు ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు. డబ్బున్నప్పుడు చేయ‌కూడ‌ని తప్పులు ఏమిటి..?

Chanakya Niti: మనిషి మనుగడకు ఆహారం ఎంత ముఖ్యమో డబ్బు కూడా అంతే ముఖ్యమని చాణక్యుడు చెప్పాడు. మంచి జీవనశైలిని అలవర్చుకోవడానికి డబ్బు చాలా ముఖ్యం. మహాలక్ష్మి అనుగ్రహంతో వీటిని మనం పొందవచ్చు. లక్ష్మి అనుగ్రహం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. కొన్ని నియమాలు, నిబంధనలతో జీవించడం ద్వారా మనం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. చాణక్యుడు ప్రకారం, మనకు డబ్బు ఉన్నప్పుడు లేదా ధనవంతులు అయినప్పుడు, మనం కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

అహంకారం

మనం డబ్బు సంపాదించడానికి రోజూ ఎన్నో కష్టాలు పడుతున్నాం. కానీ, మనకు డబ్బు వచ్చినప్పుడు లేదా మనం ధనవంతులయ్యాక, మనం గతాన్ని, కష్ట సమయాలను మరచిపోతాం. అందువ‌ల్ల మ‌న కింద ప‌నిచేసేవారిని తక్కువగా చూస్తాం. కష్ట సమయాలను మరచిపోయి, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాల‌నే ఆస‌క్తి చూప‌ం. అటువంటి అహంకార లక్షణాలను మనం ఒంటప‌ట్టించుకోకూడ‌దు. గ‌ర్వం ఉన్న వ్య‌క్తితో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదు. ఆమె ఆశీర్వాదాన్ని అలాంటి వ్య‌క్తుల‌కు ఇవ్వదు. ఫ‌లితంగా మీరు ఏ ధ‌నాన్ని చూసి గొప్ప‌వారిగా అనుభూతి చెందుతున్నారో ఆ గొప్పతనాన్ని కోల్పోతారు.

Also Read : చాణ‌క్య నీతి ప్ర‌కారం ఈ 6 ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు మాత్రమే ధనవంతులు అవుతారు

మితిమీరిన ఖర్చు

చాణక్యుడి ప్రకారం, మనం ఎల్లప్పుడూ డబ్బును పరిమితుల్లోనే ఖర్చు చేయాలి. డబ్బు ఉన్నందువల్ల అతిగా ఖర్చు చేసే వారితో ఉండ‌టం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. మన అవసరాన్ని బట్టి డబ్బు ఖర్చు పెట్టాలి. అనవసరమైన ఖర్చు మనల్ని ఏదో ఒకరోజు బీద‌వారిగా మార్చేస్తుంది. అనవసరంగా డబ్బు ఖర్చు చేసే వ్యక్తి ఏదో ఒక రోజు అప్పుల పాలవుతాడు. డబ్బు సమస్యలు అతనిని వెంటాడతాయి. తనకు ఇష్టం లేకపోయినా అలాంటి వ్య‌క్తిని పేదరికం తలుపు తడుతుందని చాణక్యుడు చెప్పాడు.

దురాశ‌

దురాశ అనేది ఒక వ్యక్తిలోని నీచమైన లక్షణం. ఏం చూసినా కావాల‌నుకుంటున్నారు. అలాంటి వారు తమ మితిమీరిన కోరికలను తీర్చుకోవడానికి డబ్బు గురించి ఆలోచించరు. అందువ‌ల్ల తాను  సంపాదించిన డబ్బునంతా తన‌ కోరిక తీర్చుకోవడానికి ఉపయోగిస్తారు. ఇది అతనికి మరింత ఆర్థిక ఇబ్బందులను కలిగించవచ్చు. భవిష్యత్తులో తన పరిస్థితి చూసి బాధపడాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు. ధ‌నానికి అధిదేవ‌త అయిన‌ లక్ష్మీ దేవి అటువంటి వ్యక్తులకు తన ఆశీర్వాదాలను ఎప్పుడూ అందించదు. అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండాల‌ని ఆమె కోరుకుంటుంది. అందుకే డబ్బు ఖర్చు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి.

విజ‌య‌వంత‌మైన వ్యాపార‌వేత్త‌ కావాలంటే ఈ లక్షణాలు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి!

చాణక్య నీతి ప్రకారం, పైన పేర్కొన్న 3 చెడు లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తి తన జీవితంలో ఆర్థిక‌ సమస్యల‌ను, పేదరికాన్ని ఎదుర్కొంటాడు. మీరు ఇలాంటి పొరపాట్లు చేస్తుంటే తప్పకుండా ఈ రోజే  మేల్కోండి.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Who is Usha Chilukuri: ఉష చిలుకూరిది ఈ ఊరే, ఏపీ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డ ఆమె తల్లిదండ్రులు
ఉష చిలుకూరిది ఈ ఊరే, ఏపీ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డ ఆమె తల్లిదండ్రులు
IAS Krishna Teja: కేరళకు సెలవు, ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలోకి ఐఏఎస్ కృష్ణతేజ
కేరళకు సెలవు, ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలోకి ఐఏఎస్ కృష్ణతేజ
In Pics: ఉషా చిలుకూరి - వాన్స్ ఫస్ట్ ఎక్కడ కలుసుకున్నారో తెలుసా? ఉషా వాన్స్ రేర్ ఫ్యామిలీ ఫోటోలు
ఉషా చిలుకూరి - వాన్స్ ఫస్ట్ ఎక్కడ కలుసుకున్నారో తెలుసా? ఉషా వాన్స్ రేర్ ఫ్యామిలీ ఫోటోలు
Nara Lokesh: విద్యా దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ అమలు: మంత్రి నారా లోకేష్
విద్యా దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ అమలు: మంత్రి నారా లోకేష్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PCB Threatened BCCI Regarding 2025 Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ సస్పెన్స్‌లో కొత్త అప్‌డేట్ | ABP Desamటీ20ల్లో ఓపెనర్లుగా ఈ నలుగురిలో ఎవరికి ఛాన్స్ | ABP DesamAnant Ambani gifts 2Cr Worth Watches |పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ కి కళ్లు చెదిరే గిఫ్టులిచ్చిన అంబానీVizianagaram Fort Lesser Known Story | దేశానికి ఆఖరి కోటగా చెప్పే విజయనగరం కోటపై ఆసక్తికర విషయాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Who is Usha Chilukuri: ఉష చిలుకూరిది ఈ ఊరే, ఏపీ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డ ఆమె తల్లిదండ్రులు
ఉష చిలుకూరిది ఈ ఊరే, ఏపీ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డ ఆమె తల్లిదండ్రులు
IAS Krishna Teja: కేరళకు సెలవు, ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలోకి ఐఏఎస్ కృష్ణతేజ
కేరళకు సెలవు, ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలోకి ఐఏఎస్ కృష్ణతేజ
In Pics: ఉషా చిలుకూరి - వాన్స్ ఫస్ట్ ఎక్కడ కలుసుకున్నారో తెలుసా? ఉషా వాన్స్ రేర్ ఫ్యామిలీ ఫోటోలు
ఉషా చిలుకూరి - వాన్స్ ఫస్ట్ ఎక్కడ కలుసుకున్నారో తెలుసా? ఉషా వాన్స్ రేర్ ఫ్యామిలీ ఫోటోలు
Nara Lokesh: విద్యా దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ అమలు: మంత్రి నారా లోకేష్
విద్యా దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ అమలు: మంత్రి నారా లోకేష్
Nirmala Sitaraman: చివరి దశకు కేంద్ర బడ్జెట్ - సంప్రదాయ హల్వా వేడుకలో నిర్మల
చివరి దశకు కేంద్ర బడ్జెట్ - సంప్రదాయ హల్వా వేడుకలో నిర్మల
Nandyal Girl Case: బాలిక మృతదేహానికి రాయి కట్టి నదిలో పడేసింది ఓ బాలుడి తండ్రి - నంద్యాల ఎస్పీ సంచలన విషయాలు
బాలిక మృతదేహానికి రాయి కట్టి నదిలో పడేసింది ఓ బాలుడి తండ్రి - నంద్యాల ఎస్పీ సంచలన విషయాలు
Telangana : తెలంగాణలో రేషన్ కార్డు లేకుండానే ఆరోగ్యశ్రీ సేవలు- రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణలో రేషన్ కార్డు లేకుండానే ఆరోగ్యశ్రీ సేవలు- రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Free Bus Service: ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన
ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన
Embed widget