చాణక్య నీతి: పోలీస్ స్టేట్ , వెల్ ఫేర్ స్టేట్..వీటి మధ్య వ్యత్యాసం తెలుసా!
Chanakya Neeti : రాజకీయ శాస్త్రంలో రెండు రకాల రాజ్యాలుంటాయని వివరించాడు చాణక్యుడు. అందులో మొదటిది పోలీస్ స్టేట్ ...రెండోది వెల్ ఫేర్ స్టేట్... ఈ రెండింటి మధ్యా వ్యత్యాసం ఏంటంటే...
Chanakya Neeti Telugu: పాలకుడు ఎలా ఉండాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? రోజువారీ షెడ్యూల్ ఎలా ఉండాలి? ప్రజలకు ఎలాంటి పాలన అందించాలి? పాలకుడు ఎలాంటి తప్పులు చేయడం ద్వారా ప్రజాగ్రహాన్ని చూడాల్సి ఉంటుంది?..ఇలా ఎన్నో విషయాలపై సూచనలు చేసిన ఆచార్య చాణక్యుడు రాజకీయ శాస్త్రంలో ఉండే రెండు రాజ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాడు.. మొదటిది పోలీస్ స్టేట్ రెండోది వెల్ ఫేర్ స్టేట్...
Also Read: ప్రజలకు ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడడానికి కారణాలివే - చాణక్య నీతి !
పోలీస్ స్టేట్
పోలీస్ రాజ్యంలో ప్రభుత్వ బాధ్యతలు చాలా పరిమితంగా ఉంటాయి. దేశంలో శాంతిభద్రతలు సక్రమంగా ఉండేలా చూసుకోవడం, ఇతర దేశాల వారు తమపై దండెత్తకుండా చూసుకోవడం...ఈ రెండు బాధ్యతలు మాత్రమే ఉంటాయి. దేశంలో ప్రజల ఆకలి, దారిద్ర్యంతో బాధపడుతున్నా , ఆర్థికంగా రోజురోజుకీ ఒక్కో అడుగు దిగిపోతున్నా కానీ పోలీస్ రాజ్యంలో పట్టవు. కేవలం ప్రజల వద్దనుంచి పన్నులు వసూలు చేసి సైన్యాన్ని పోషిస్తూ విలాసాలలో తేలియాడినా అడిగేవారుండరు...
వెల్ ఫేర్ స్టేట్
వెల్ ఫేర్ స్టేట్ అంటే శ్రేయోరాజ్య విధానం. ఇందులో దేశంలో శాంతిభద్రతలను కాపాడటం, విదేశీ దండయాత్రల నంచి ప్రజల్ని కాపాడడంతో పాటూ దేశప్రజల కష్టసుఖాలన్నీ రాజు తనవిగా భావించి వారి శ్రేయస్సుకోసం అహర్నిశలు పరితపించాలి.
Also Read: ఆదర్శ పాలకుడికి ఉండాల్సిన లక్షణాలివే - చాణక్య నీతి
రాచరిక వ్యవస్థలో పోలీస్ రాజ్య విధానానికే కానీ శ్రేయోరాజ్య విధానానికి అవకాశం చాలా తక్కువ. ఇప్పటి రాజకీయాల విషయానికొస్తే నియంత పాలన అనే మాట నిత్యం రాజకీయ నాయకుల విమర్శలలో వింటుంటాం కదా అదే. ఇలా పోలీస్ రాజ్యంలా కాకుండా ఎవరైనా తనకు తానుగా శ్రేయోరాజ్యవిధానంలో పరిపాల చేశారంటే అది పూర్తిగా వారి సంస్కారంపై ఆధారపడిఉంటుంది.
కౌటిల్యుడు చెప్పిన అర్థశాస్త్రంలో ప్రజల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని రాజ్యపాలన చేయడం పాలకుడి విధి. వాస్తవానికి అప్పట్లో శ్రేయోరాజ్య విధానం అమలులోనే లేదు..దానికి ప్రాధాన్యతనిచ్చి అమలు చేసేలా చేసిన వ్యక్తి కౌటిల్యుడే. అందుకే కౌటిల్యుడి పాలనా సూచనలు ఎంతోమంది నాయకులను ప్రభావితం చేశాయి..
Also Read: రాజకీయ నాయకుల డైలీ షెడ్యూల్ ఇలా ఉంటే మళ్లీ మళ్లీ గెలవడం ఖాయం!
మన దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ప్రభావితం చేసిన పుస్తకాల్లో కౌటిల్యుడి అర్థశాస్త్రం ఒకటి. 1930 - 1931 సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం నెహ్రూని అరెస్ట్ చేసి జైలులో నిర్బంధించింది. ఆ సమయంలో నెహ్రూ తాను చదివిన పుస్తకాల్లో కొన్ని విషయాలను ప్రత్యేకంగా నోట్స్ రాసుకునేవారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆ విషయాలను తాను రాసుకునే గ్రంధాల్లో ఉపయోగించుకునేవారు. ఇవే విషయాలు ఇందిరకు రాసిన లేఖల్లో కూడా పేర్కొన్నారు. అందులో చాణక్యుడి పుస్తకం గురించి ప్రస్తావిస్తూ...అర్థశాస్త్రం అంటే సందను గురించి మాత్రమే కాదు ఇందులో చాలా విషయాలు చెప్పారు..రాజు నిర్వహించాల్సిన బాధ్యతలు, సలహాదాలు విధులు, వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలు, జాతీయ అంతర్జాతీయ వ్యాపారాలు..ఇలా చాలా విషయాల గురించి ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. వీటితో పాటూ ప్రజల్ని ప్రభుత్వం ఎలా ఆదుకోవాలి, స్త్రీ హక్కులు , వివాహం, విడాకులు, వ్యవసాయ రంగం, చేనేత రంగం ఇంకా చెప్పుకుంటూ పోతే వివిధ అధ్యాయాల మకుటాలతో ఈ ఉత్తరం నిండిపోతుందని ప్రస్తావించారు. కౌటిల్యుడు రాజుని రాజుగా కాకుండా ఇంటి పెద్దగా భావించాడు. తన దృష్టిలో రాచరిక వ్యవస్థ అంటే ప్రజలకు సేవ చేసే వ్యవస్థ...తనేం దైవాంశ సంభూతుడు కాదు సరిగా పాలించకపోతే ప్రజలు తొలగించి మరొకరిని రాజుగా చేయవచ్చంటూ లేఖలో రాశాలు. ఆ తర్వాత కాలంలో నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్ లో చాణక్య-చంద్రగుప్తుల గురించి చెప్పేందుకు ఆరు పేజీలు కేటాయించారు...నెహ్రూని మాత్రమే కాదు నాటి నుంచి నేటి వరకూ ఎందరో పాలకులకు ఆదర్శం చాణక్యుడి అర్థశాస్త్రం.