అన్వేషించండి

Pradosh Vrat 2025: ప్రదోష వ్రతం ఎప్పుడు చేస్తారు? ఎందుకు చేస్తారు? పూజా విధానం ఏంటి?

Pradosh Vrat : ఆగస్టు 20, సెప్టెంబర్ 5న ప్రదోష వ్రతం ఆచరించాలి. ఇంతకీ ప్రదోష వ్రతం ఎందుకు ఆచరిస్తారు? పూజా విధానం ఏంటో తెలుసుకోండి

Pradosh Vrat 2025: ప్రతి సంవత్సరం దోషాల నుంచి విముక్తి పొందడానికి 24 ప్రదోష వ్రతాలు చేస్తారు. సమీపంలో ప్రదోష వ్రతం ఎప్పుడంటే ఆగష్టు 20, సెప్టెంబర్ 5న వచ్చాయి  

ప్రదోష వ్రతం  అంటే శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. మహాదేవుడి అనుగ్రహం కోసం ప్రతి నెలా శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే త్రయోదశి రోజు ప్రదోష కాలంలో శివలింగానికి అభిషేకం చేస్తారు. ప్రదోష సమయంలో ఆచరించే వ్రతం కావున ఇది ప్రదోష వ్రతం అయింది.  

ప్రదోష వ్రతం ఎందుకు చేస్తారు?

ప్రదోష వ్రతం చేయడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. కోరిన కోర్కెలు నెరవేరుతాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో ప్రేమ, సామరస్యం , మాధుర్యం కొనసాగుతాయి. సోమ ప్రదోష వ్రతం ఆచరించేవారికి మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.  

2025 ఆగష్టు 20న ప్రదోష వ్రతం
  
బుధ ప్రదోష వ్రతం - శ్రావణ మాసంలో అమావాస్య ముందు త్రయోదశి ఆగష్టు 20 బుధవారం వచ్చింది. వాస్తవానికి ఆగష్టు 20 బుధవారం సూర్యోదయ సమయానికి ద్వాదశి తిథి ఉంది. మధ్యాహ్నం 2 గంటల 20 నిముషాలకు త్రయోదశి ఘడియలు ప్రారంభమయ్యాయి. తిరిగి ఆగష్టు 21 గురువారం మధ్యాహ్నం 12 గంటల 54 నిముషాలకు త్రయోదశి ఘడియలు ముగుస్తున్నాయి. అంటే సాయంత్రం సమయానికి త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఆగష్టు 20న ప్రదోష వ్రతం ఆచరించాలి.  

2025 సెప్టెంబరు 05 ప్రదోష వ్రతం

భాద్రపదమాసంలో పౌర్ణమి ముందు త్రయోదశి సెప్టెంబరు 05 శుక్రవారం వచ్చింది. ఈ రోజు త్రయోదశి సూర్యోదయం నుంచి అర్థరాత్రి వరకూ ఉంది. ఎలాంటి సందేహాలు లేకుండా ప్రదోష వ్రతం సెప్టెంబరు 05న ఆచరించవచ్చు

పూజా సమయం - సాయంత్రం 6.38 to రాత్రి 8.55

ప్రదోష వ్రత పూజా విధానం (Pradosh Vrat Vidhi)

ఉదయాన్నే నిద్ర లేచి స్నానమాచరించి తెల్లటి వస్త్రాలు ధరించాలి.

భోళా శంకరుడిని పూజించాలి. పూజలో బిల్వపత్రాలు, గంగాజలం, అక్షతలు, పూలు వినియోగించండి

ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సమయంలో శివునికి శాస్త్రోక్తంగా పూజ చేయాలి

“ఓం నమః శివాయ” మంత్రాన్ని జపించాలి.

ప్రదోష వ్రత కథ చదవి పరమేశ్వరుడికి హారతి ఇవ్వాలి

ప్రదోష సమయంలో శివుడు నందీశ్వరుడితో కలిసి భక్తుల కోరికలు తీర్చేందుకు భూలోకానికి తరలి వస్తాడని భక్తుల విశ్వాసం. వివిధ రకాల ప్రదోష వ్రతాలున్నాయి. వాటిలో సోమ ప్రదోష వ్రతం, శని ప్రదోష వ్రతం ఇలా. ప్రతి ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది  

ప్రదోష వ్రత కథ 

పూర్వం ఒక నగరంలో ఓ స్త్రీ..భర్త మరణం తర్వాత పిల్లలకోసం కష్టపడి పనిచేస్తూ వారిని తల్లి తండ్రీ అన్నీ తానై జీవిన సాగించేది. ఆమె శివభక్తురాలు.  ప్రతి ప్రదోషానికి ఉపవాసం ఉండి, పరమేశ్వరుడిని పూజించేది. ఒక రోజు ఆమెకు ఒక గాయపడిన యువకుడు కనిపించాడు. తనని ఇంటికి తీసుకొచ్చి కోలుకునేవరకూ సేవలు చేసింది. ఆ యువకుడు విదర్భ రాజ్యానికి చెందిన యువరాజు అని, శత్రువుల దాడి నుంచి తప్పించుకుని వచ్చాడని ఆమెకు తెలుస్తుంది. తండ్రిని కూడా శత్రువులు బంధించారని తెలుసుకుంటుంది. అప్పుడు ఆ యువరాజుకి అండగా నిలిచి తండ్రిని విడిపించేందుకు శివుడి అనుగ్రహంతో సహాయం చేసింది. అప్పటి నుంచి ఆమె దారిద్ర్యం, కష్టాలు తొలగిపోయాయి. మరణానంతరం శివసాయుజ్యం పొందింది. ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Droupadi Murmu:
"అభివృద్ధి చెందిన భారత్‌ వైపు వెళ్ళే మార్గంలో అందర్నీ ఆహ్వానించాలి" రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిపబ్లిక్‌డే సందేశం
Gig Workers Shutdown Strike: గిగ్ వర్కర్స్ సమ్మె బాట! నేడు నిలిచిపోనున్న స్విగ్గి, జొమాటో సహా ఆన్‌లైన్ డెలివరీ సేవలు!
గిగ్ వర్కర్స్ సమ్మె బాట! నేడు నిలిచిపోనున్న స్విగ్గి, జొమాటో సహా ఆన్‌లైన్ డెలివరీ సేవలు!
Padma Awards 2026: తమిళనాడు, బెంగాల్‌పై కేంద్రం ఫోకస్‌!ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఎన్ని పద్మ అవార్డులు వచ్చాయి?
తమిళనాడు, బెంగాల్‌పై కేంద్రం ఫోకస్‌!ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఎన్ని పద్మ అవార్డులు వచ్చాయి?
Padma Awards 2026: పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు ప్రముఖులు వీరే.. వారి టాలెంట్ ఏంటి
పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు ప్రముఖులు వీరే.. వారి టాలెంట్ ఏంటి

వీడియోలు

Rohit Sharma Harman Preet Kaur Padma Shri | రోహిత్, హర్మన్ లను వరించిన పద్మశ్రీ | ABP Desam
Rajendra prasad Murali Mohan Padma Shri | నటకిరీటి, సహజ నటుడికి పద్మశ్రీలు | ABP Desam
Bangladesh Cricket Huge Loss | టీ20 వరల్డ్ కప్ ఆడనన్నుందుకు BCB కి భారీ నష్టం | ABP Desam
Ashwin Fire on Gambhir Decisions | డ్రెస్సింగ్ రూమ్ లో రన్నింగ్ రేస్ పెట్టడం కరెక్ట్ కాదు | ABP Desam
Ind vs Nz 3rd T20I Preview | న్యూజిలాండ్ తో నేడు మూడో టీ20 మ్యాచ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Droupadi Murmu:
"అభివృద్ధి చెందిన భారత్‌ వైపు వెళ్ళే మార్గంలో అందర్నీ ఆహ్వానించాలి" రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిపబ్లిక్‌డే సందేశం
Gig Workers Shutdown Strike: గిగ్ వర్కర్స్ సమ్మె బాట! నేడు నిలిచిపోనున్న స్విగ్గి, జొమాటో సహా ఆన్‌లైన్ డెలివరీ సేవలు!
గిగ్ వర్కర్స్ సమ్మె బాట! నేడు నిలిచిపోనున్న స్విగ్గి, జొమాటో సహా ఆన్‌లైన్ డెలివరీ సేవలు!
Padma Awards 2026: తమిళనాడు, బెంగాల్‌పై కేంద్రం ఫోకస్‌!ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఎన్ని పద్మ అవార్డులు వచ్చాయి?
తమిళనాడు, బెంగాల్‌పై కేంద్రం ఫోకస్‌!ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఎన్ని పద్మ అవార్డులు వచ్చాయి?
Padma Awards 2026: పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు ప్రముఖులు వీరే.. వారి టాలెంట్ ఏంటి
పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు ప్రముఖులు వీరే.. వారి టాలెంట్ ఏంటి
Republic Day 2026 : రిపబ్లిక్‌డే నాడు పాక్‌ దుశ్చర్య- జమ్ము కశ్మీర్‌లోని సాంబాలో చొరబాటుకు యత్నం- కాల్చిపడేసిన సైన్యం
రిపబ్లిక్‌డే నాడు పాక్‌ దుశ్చర్య- జమ్ము కశ్మీర్‌లోని సాంబాలో చొరబాటుకు యత్నం- కాల్చిపడేసిన సైన్యం
Padma Awards 2026: పద్మ అవార్డులు ఎక్కడ తయారవుతాయి.. వాటి కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది?
పద్మ అవార్డులు ఎక్కడ తయారవుతాయి.. వాటి కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది?
Padma Awards 2026: సౌత్‌ సినిమాలో విరిసిన పద్మాలు... తెలుగు హీరోలు ఇద్దరికి పద్మశ్రీ, దివంగత ధరేంద్రకు పద్మ విభూషణ్
సౌత్‌ సినిమాలో విరిసిన పద్మాలు... తెలుగు హీరోలు ఇద్దరికి పద్మశ్రీ, దివంగత ధరేంద్రకు పద్మ విభూషణ్
Rohit Sharma Padma Shri Award: రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్‌లను వరించిన పద్మశ్రీ పురస్కారం
రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్‌లను వరించిన పద్మశ్రీ పురస్కారం
Embed widget