అన్వేషించండి

Bathukamma Dates 2024: బతుకమ్మ పండుగ డేట్స్ 2024 ...ఈ రోజు ఏ బతుకమ్మని పూజించాలి!

Bathukamma Festival 2024: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ వేడుక . ఈ ఏడాది అక్టోబర్ 02 భాధ్రపద అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటూ సందడిగా జరుగుతుంది..

Bathukamma 2024 - Festival of Telangana: తెలంగాణ ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో సంబరంగా జరుపుకునే పండుగ బతుకమ్మ.  తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ తొమ్మిది రోజుల పాటూ తెలంగాణ వ్యాప్తంగా ఊరూ వాడా ఎక్కడ చూసినా సందడే. చిన్నా పెద్దా వేడుకలలో పాల్గొంటారు. ముచ్చటగా ముస్తాబై బతుకమ్మలు తయారు చేసి అంతా కలసి ఆడిపాడతారు. ఈ ఏడాది 2024 లో భాద్రపద అమావాస్య అక్టోబరు 02న వచ్చింది. ఈ రోజు ప్రారంభమయ్యే వేడుకలు తొమ్మిది రోజుల పాటూ వైభవంగా సాగి... అక్టోబరు 10 తో ముగుస్తాయి. 

Also Read: బతుకమ్మకు ఏ రోజు ఏ నైవేద్యం పెడతారో తెలుసా? రెసిపీలు ఇవే
 
భాద్రపద అమావాస్య ( అక్టోబరు 02) నుంచి దుర్గాష్టమి ( అక్టోబరు 10) వరకూ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.. 

అక్టోబర్ 02 బుధవారం భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజు జరుగుతుంది. 
 
అక్టోబర్ 03 గురువారం ఆశ్వయుజ శుక్ల పాడ్యమి - అటుకుల బతుకమ్మ
రెండో రోజు అటుకుల బతుకమ్మ నవరాత్రి కలశ స్థాపన  రోజు జరుపుకుంటారు

అక్టోబర్ 04 శుక్రవారం ఆశ్వయుజ శుక్ల విదియ - ముద్దపప్పు బతుకమ్మ
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ

Also Read : బతుకమ్మ పూలలో ఎన్ని ఔషధగుణాలు ఉంటాయో తెలుసా? ఈ పండుగ ఆనందానికే కాదు ఆరోగ్యానికి కూడా 

అక్టోబర్ 05 శనివారం ఆశ్వయుజ శుక్ల తదియ - నానే బియ్యం బతుకమ్మ
నాలుగో రోజు నానేబియ్యం బతుకమ్మ 

అక్టోబర్ 06 ఆదివారం ఆశ్వయుజ శుక్ల చవితి - అట్ల బతుకమ్మ
ఐదో రోజు అట్ల బతుకమ్మ

అక్టోబర్ 07 సోమవారం ఆశ్వయుజ శుక్ల పంచమి  - అలిగిన బతుకమ్మ
ఆరో రోజు అలిగిన బతుకమ్మ - ఈ రోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించరు

అక్టోబరు 08 మంగళవారం ఆశ్వయుజ శుక్ల షష్టి - వేపకాయల బతుకమ్మ
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ

అక్టోబరు 09 బుధవారం ఆశ్వయుజ శుక్ల సప్తమి - వెన్నముద్దల బతుకమ్మ
ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ

అక్టోబరు 10 గురువారం ఆశ్వయుజ శుక్ల అష్టమి ( దుర్గాష్టమి) -సద్దుల బతుకమ్మ
బతుకమ్మ పండుగలో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. ఈ రోజు బతుకమ్మలను గడిచిన రోజుల కన్నా పెద్ద పరిమాణంలో తయారు చేస్తారు. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో సంబరాలు అంబరాన్నంటుతాయి. భారీ బతుకమ్మలు తయారు చేసి ఆడిపాడిన తర్వాత..తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ వేడుక దుర్గాష్టమి రోజు జరుపుకుంటారు.

Also Read: ఈ ప్రాంతాల్లో దసరా సెలబ్రేషన్స్ అదిరిపోతాయ్..మీరు వెళ్లారా ఒక్కసారైనా!

బతుకమ్మ పండగ తెలంగాణలో ఎప్పుడు ప్రారంభమైందో చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు కానీ వేల ఏళ్లుగా కొనసాగుతోందని చెప్పేందుకు చాలా కథలున్నాయి. దీని వెనుక ఎన్నో కథలు చెబుతారు. జగన్మాత మహిషాసురుడిని చంపిన తర్వాత అలసటతో మూర్ఛపోయిందట. ఆమెను మేల్కొలిపేందుకు స్త్రీలంతా గుమిగూడి ప్రార్థించారట. బతుకమ్మా అంటూ పాటలు పాడారట..సరిగ్గా పదో రోజు ఆమె నిద్రలేచిందని అప్పటి నుంచి బతుకమ్మ వేడుక జరుపుకుంటున్నాని ఓ కథనం ప్రచారంలో ఉంది. ఈ వేడుకలో అలిగిన బతుకమ్మ రోజు మినహా మిగిలిన రోజుల్లో అమ్మవారికి రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తుంటారు. ఈ వేడుకల్లో పాల్గొనే తెలంగాణ ఆడబిడ్డలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
AP Inter Exams: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Romantic Life : శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
Embed widget