భోజనం చేస్తున్నప్పుడు ఉప్పు అడుగుతున్నారా? అయితే గ్రహాల అసమతుల్యతకు కారణమయ్యే రహస్య నియమాలు తెలుసా!
Astrology : భోజన నియమాలు పాటించాలి. అయితే భోజనం చేసేటప్పుడు ఉప్పు అడగటం గ్రహాల కోపానికి సంకేతం అంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు

భోజన నియమాలు: హిందూ ధర్మం , జ్యోతిష్యశాస్త్రంలో ఆహారం కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు. ఇది శక్తి, సంస్కారం , గ్రహాల సమతుల్యతతో ముడిపడి ఉంది. అందువల్ల ఆహారానికి సంబంధించిన కొన్ని అలవాట్లు గ్రహాల స్థితిపై నేరుగా ప్రభావం చూపుతాయి.
వాస్తు , జ్యోతిష్యంలో ఆహారం కోసం ఎన్నో నియమాలున్నాయి. వంట చేయడం నుంచి తినడం వరకు నియమాలు, దిశలు ప్రత్యేకంగా సూచించారు వాస్తు జ్యోతిష్య శాస్త్ర పండితులు. వీటిని ప్రతి ఒక్కరూ పాటించాలి. అయినప్పటికీ తెలియకుండానే మనం కొన్ని తప్పులు చేస్తాం, ఇది ఆరోగ్యంపైనే కాకుండా గ్రహాల స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది.
ఆహారం తీసుకునేటప్పుడు, మనకు కొన్నిసార్లు నీరు, కొన్నిసార్లు మిరపకాయలు, కొన్నిసార్లు ఊరగాయలు, కొన్నిసార్లు పాపడు , కొన్నిసార్లు ఉప్పు అవసరం అవుతుంది..అవన్నీ అడిగి వేయించుకుంటాం.కానీ జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చెబుతున్నారంటే.. భోజనం చేసేటప్పుడు ఉప్పు అడగకూడదు. భోజనం చేసేటప్పుడు ఉప్పు అడగడం అనే చిన్న అలవాటు మీ జాతకంలో గ్రహాలను అసమతుల్యం చేసి సమస్యలను కలిగిస్తుందట.
ఉప్పు అడగడం వల్ల బలహీనపడే గ్రహాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు భోజనం చేసేటప్పుడు ఉప్పు అడిగినప్పుడు... ఇది చంద్రుడు , శుక్రుడు వంటి గ్రహాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. తెలుపు రంగు కారణంగా ఉప్పు చంద్రుడు , శుక్ర గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల, ఉప్పు ఆహారంలో రుచిని పెంచడమే కాకుండా మీ అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. భోజనం చేసేటప్పుడు ఉప్పు అడగడం మానసిక అస్థిరతకు సంకేతం. అలాగే, తరచుగా అలా చేసేవారికి భౌతిక సుఖాలు తగ్గుతాయి.
ఎక్కువ ఉప్పు తినడం సూర్యుడు బలహీనంగా ఉన్నాడని సూచిస్తుంది!
అంతేకాకుండా, జ్యోతిష్యంలో, ఎక్కువ ఉప్పు తినడం సూర్య గ్రహం బలహీనంగా ఉండటానికి సంకేతం అని నమ్ముతారు. దీనికి కారణం ఏంటంటే, సూర్యుడు అగ్ని మూలకం కలిగిన గ్రహం, ఇది ఆత్మవిశ్వాసం, శక్తి, నాయకత్వం, తేజస్సు , ప్రతిష్టకు కారకంగా పరిగణిస్తారు. అదే సమయంలో, ఉప్పు భూమి , నీటి మూలకాలతో ముడిపడి ఉంది. దానిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో బద్ధకం, సోమరితనం, నీటి మూలకం పెరుగుతుంది. శరీరంలో నీటి మూలకం పెరిగినప్పుడు, అగ్ని మూలకం (సూర్యుడు) బలహీనపడుతుంది. అందుకే ఎక్కువ ఉప్పు తినడం వల్ల వ్యక్తి యొక్క తేజస్సు నిర్ణయాధికారం ప్రభావితమవుతుందని చెబుతారు.
ఉప్పును వృధా చేయవద్దు
చాలా మందికి వారి ఆహార ప్లేట్‌లో కొంచెం ఉప్పు ఉంచే అలవాటు ఉంటుంది. మీరు కూడా అలా చేస్తే, భోజనం చేసిన తర్వాత ప్లేట్‌లో ఉప్పు మిగిలితే, దానిని పారవేయకుండా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు ఉప్పును సురక్షితంగా వేరే పాత్రలో ఉంచండి మరుసటిసారి ఉపయోగించండి. ఉప్పు అంటుకున్నా లేదా పాడైపోయినా, ఉప్పులో కొంచెం నీరు కలిపి పారవేయండి. ఉప్పును అనవసరంగా వృధా చేయడం వల్ల ఇంట్లో కలహాలు ఏర్పడవచ్చు...ఏపని ప్రారంభించినా అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది
ఉప్పు రుచి కోసం కాదు, ఆరోగ్యం కోసం
ఆరోగ్య నిపుణులు కూడా తక్కువ ఉప్పు తినమని సలహా ఇస్తారు. ఎందుకంటే ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, ఆహారంలో ఉప్పును రుచి కోసం కాకుండా ఆరోగ్యం కోసం చేర్చండి .. ముఖ్యంగా వండిన ఆహారంలో పైన ఉప్పు వేసి తినకుండా ఉండండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించిన సమాచారం మాత్రమే . ఇక్కడ ABP దేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















