Bhavishya Purana Predictions: దైవభక్తి కూడా ప్రదర్శనే ! అష్టాదశ పురాణాల్లో ఒకటైన భవిష్య పురాణంలో చెప్పిన ఇవన్నీ నిజమయ్యాయి!
Bhavishya Purana Predictions: అష్టాదశ పురాణాల్లో ఒకటైన భవిష్య పురాణంలో ప్రపంచంలో జరగబోయే ఎన్నో సంఘటనల గురించి ఉంది. కాలుష్యం, యుద్ధాలు, విపత్తుల గురించి వేల సంవత్సరాల క్రితమే చెప్పారు వ్యాసమహర్షి

Bhavishya Purana Predictions: హిందూ ధర్మంలో ప్రధానమైన పద్దెనిమిది పురాణాలలో ఒకటైన భవిష్య పురాణం భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు, యుద్ధాలు, మతపరమైన మార్పులు .. సామాజిక అశాంతి గురించి తెలియజేస్తుంది. వేల సంవత్సరాల క్రితమే భారతీయ జ్ఞానులు నైతిక విలువలు క్షీణించడం, వ్యక్తి స్వభావంలో మార్పులు, విపత్తులు గురించి జోస్యాలు చెప్పారు, అవి నేడు నిజమవుతున్నాయి.
భవిష్య పురాణంలో వర్ణించిన అనేక విషయాలు ప్రస్తుత కాలానికి ఆశ్చర్యం కలిగించే విధంగా సరిపోలుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం, దేశాల మధ్య ఉద్రిక్తతలు , యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు , ప్రజల మతపరమైన ప్రవర్తనలో మార్పులు ఈ జోస్యాలను నిజం చేస్తున్నాయ్
ఆచ్ఛిన్నదారద్రవిణా, యాస్యంతి గిరికాననం।
శాకమూలామిషక్షౌద్ర: ఫల పుష్పాష్టిభోజనా:॥
ఆర్థిక సంక్షోభం గురించి భవిష్య పురాణంలో ముందే ఇలా ఉంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక వర్గంపై అన్ని పనులను మోపుతుంది. ఒక సమయంలో ప్రజలు పట్టణాలు ..నగరాలను విడిచిపెట్టి మళ్ళీ అడవులకు వలస వెళ్ళవలసి వస్తుంది. కరవు వరదల కారణంగా ప్రజలు ఆకులు, మాంసం, పువ్వులు , అటవీ వస్తువులను తిని కడుపు నింపుకోవలసి వస్తుంది.
క్షుత్తృడ్భ్యాం వ్యాధిభిశ్చైవ, సంతప్స్యంతే చ చింతయా।
త్రింశద్వింశతి వర్షాణి, పరమాయు: కలి నృణామ్।।
కలియుగంలో ప్రజలు తమ పనుల గురించి ఆందోళన చెందుతారు. బాల్యం గందరగోళంలో గడుస్తుంది .. యవ్వనంలో వ్యక్తి చాలా ఇబ్బంది పడతాడు, జీవితకాలం తగ్గిపోతుంది. మనిషి జీవితకాలం కేవలం 20-30 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.
దాక్ష్యం కుటుంబభరణం యశోఽర్థే ధర్మసేవనం ।
ఏవం ప్రజాభిర్దుష్టాభి: ఆకీర్నే క్షితిమండలే ॥
భవిష్య పురాణం ప్రకారం.. కలియుగం కేవలం మోసం , ప్రదర్శనల కాలం. ప్రజలు ఇతరుల ముందు మంచిగా కనిపించడానికి నటిస్తారు , ప్రదర్శన కోసమే మతపరమైన పనులు కూడా చేస్తారు. అవినీతిపరుల సంఖ్య పెరిగిపోతుంది, ప్రజలు ఎవరినైనా చంపడానికి లేదా హాని చేయడానికి వెనుకాడరు. భౌతిక సుఖాలను పొందిన వ్యక్తి బద్ధకంతో నిండిపోతాడు.
అనావృష్ట్యా వినఙ్క్ష్యంతి దుర్భిక్షకరపీడితా:।
శీతవాతాతపప్రావృడ్యం హిమైరన్యోన్యత: ప్రజా:॥
కలియుగంలో ప్రజలు స్వార్థం కోసం ప్రకృతి , పర్యావరణానికి హాని చేస్తారు. అందుకే సమయానికి వర్షాలు పడవు, వాతావరణం అనుకూలంగా ఉండదు. ప్రతిచోటా కరవు ఉంటుంది. విచిత్రమైన వాతావరణం ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. వేసవిలో అధిక వేడి .. చలికాలంలో ఎక్కువ చలి మానవ జీవితాన్ని భరించలేనిదిగా చేస్తుంది.
అనాఢ్యతైవ అసాధుత్వే, సాధుత్వే దంభ ఏవ తు।
స్వీకార ఏవ చోద్వాహే స్నానమేవ ప్రసాధనం॥
కలియుగంలో ధనవంతులకు మాత్రమే గౌరవం ఉంటుంది. తెలివి, జ్ఞానానికి విలువ ఉండదు. ధనం లేని వ్యక్తిని అపవిత్రుడు, అధర్మం మరియు పేదవాడిగా పరిగణిస్తారు. వివాహం పేరుతో స్త్రీ పురుషుల మధ్య కేవలం ఒప్పందాలు మాత్రమే ఉంటాయి.
నేటి పరిస్థితులకు సరిపోయేలా..
జ్ఞానం పేరుతో భ్రమ
సోషల్ మీడియా యుగంలో, నకిలీ వార్తలు, పుకార్లు , భ్రమలు వ్యాప్తి చెందుతున్న తీరు ఇందుకే నిదర్శనం
విపత్తుల పెరుగుదల
భవిష్య పురాణంలో భూమి చీలిపోతుంది, సముద్రాలు ఉగ్రరూపం దాల్చుతాయి, భూకంపాలు పెరుగుతాయి అని ఉంది. నేటి కాలంలో పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు .. వాతావరణ సంక్షోభం దీనికి ఒక సూచన.
జనాభా పెరుగుదల
నీరు, భూమి , ఉద్యోగాల కోసం పెరుగుతున్న పోటీ ఈ జోస్యానికి సరిపోతుంది.
రోగాల వ్యాప్తి
భవిష్య పురాణంలో తెలియని వ్యాధులు .. మహమ్మారి వ్యాప్తి ఉంది. కోవిడ్-19 వంటి మహమ్మారి, వైరల్ వ్యాధుల పెరుగుదల యాంటీబయాటిక్ నిరోధకత దీని ఆధునిక సంకేతంగా పరిగణించవచ్చు.
నైతికత పతనం
అవినీతి, ఆర్థిక నేరాలు, సంబంధాలలో నమ్మకం లేకపోవడం భవిష్య పురాణం క్క జోస్యాన్ని నిజం చేస్తున్నాయి.
మతంలో ప్రదర్శన పెరుగుతుంది
గ్రంథం ప్రకారం, కలియుగంలో ప్రజలు మతం పాటిస్తారు, కాని ప్రదర్శన కోసం, లోపల విశ్వాసం బలహీనంగా ఉంటుంది. నేడు సోషల్ మీడియా యుగంలో ఇదే జరుగుతోంది. ప్రజలు దేవాలయాలు ... పూజల ఫోటోలు-వీడియోలను షేర్ చేస్తున్నారు. కానీ ఇది శ్రద్ధ ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంది.
యుద్ధాల మంటలు
భవిష్య పురాణం ప్రకారం కలియుగంలో పెద్ద యుద్ధాలు జరుగుతాయి, దీనివల్ల కోట్ల మంది ప్రభావితమవుతారు.
అసాధారణ వాతావరణం
పురాణంలో ఋతు చక్రం దెబ్బతింటుందని ఉంది. నేడు అకాల వర్షాలు, భయంకరమైన వేడిమి, కరువు, హిమానీనదాలు కరగడం వంటి సంకేతాలు ఈ జోస్యానికి సరిపోతాయి.
భూమి విషపూరితం కావడం
భవిష్య పురాణంలో కలియుగం చివరిలో గాలి, నీరు , భూమి అంతా కలుషితమవుతుందని ఉంది. నేటి కాలంలో పెరుగుతున్న కాలుష్యం, గాలిలో విషపూరిత కణాలు, నదుల్లో చెత్త.. నేల సారవంతం కాకపోవడం కూడా ఈ జోస్యం సత్యాన్ని సూచిస్తుంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.






















