అన్వేషించండి

Anant Chaturdashi 2025 Date: అనంత చతుర్దశి 2025 తేదీ, పూజా విధి, అనంత సూత్రం ప్రాముఖ్యత ఏంటి! ఇదే రోజు గణేష్ నిమజ్జనం ఎందుకు చేస్తారు?

Anant Chaturdashi 2025 : అనంత చతుర్దశి 2025 సెప్టెంబర్ 6 శనివారం. ఇదే రోజు వినాయక నిమజ్జనం... ఈ రోజు విష్ణువుని పూజిస్తారు, సుఖశాంతులు కోరుకుంటారు.

Anant Chaturdashi Puja Vidhi 2025: శ్రీ మహావిష్ణువు అనంతరూపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏటా అనంత చతుర్దశి రోజు శ్రీ మహావిష్ణువు అనంత రూపాన్ని పూజిస్తారు. ఏటా ఈ రోజుతోనే గణేష్ నిమజ్జనం పూర్తవుతుంది. భాద్రపద శుక్ల చవితి రోజు ప్రారంభమయ్యే గణేష్ చతుర్థి వేడుకలు భాద్రపద శుక్ల చతుర్ధశితో ముగుస్తాయి. ఈ రోజునే అనంత చతుర్థశి..విష్ణుపూజ చేస్తారు. ఈ ఏడాది అనంత చతుర్థశి సెప్టెంబర్ 6 శనివారం వచ్చింది. అనంత చతుర్థశి పూజా సమయం, సూత్రం ప్రాముఖ్యత తెలుసుకుందాం.
 
అనంత చతుర్దశి అంటే ?

అనంత చతుర్దశి అంటే 'అనంత' (అంతం లేనిది)  'చతుర్దశి' (పద్నాలుగవ రోజు). ఇది భాద్రపద మాసం యొక్క శుక్ల పక్షంలోని చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు. దీనిని అనంత చౌదస్ అని కూడా అంటారు.

అనంత చతుర్దశి ముహూర్తం

భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థశి తిథి సెప్టెంబర్ 5 శుక్రవారం రాత్రి తెల్లవారుజామున ఒంటిగంట 41 నిముషాలకు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 06 శనివారం రాత్రి 1 గంట 03 నిముషాలవరకూ ఉంటుంది. ఈ ఏడాది గణేష్ నిమజ్జనం, అనంత చతుర్థశి వేడుకలు సెప్టెంబర్ 6న వచ్చాయి. 
 
అనంత చతుర్దశి పూజా ముహూర్తం - ఉదయం 7.27 వరకూ దుర్ముహూర్తం ఉంటుంది..ఆ తర్వాత నుంచి మధ్యాహ్నం లోగా పూజ పూర్తిచేయాలి
 
అనంత చతుర్దశి ప్రాముఖ్యత

పురాణాల ప్రకారం, అనంత చతుర్దశి వ్రతం రోజు విష్ణువును పూజిస్తే, అన్ని బాధలు తొలగిపోతాయి.  విద్యార్థులు తమ సబ్జెక్టులలో లోతైన జ్ఞానాన్ని పొందుతారు. ధనం కావాలనుకునే వారికి సంపద లభిస్తుంది. ఈరోజు భక్తిశ్రద్ధలతో భగవంతుడిని పూజించేవారికి అనంతమైన దైవిక శక్తి , ఆశీర్వాదం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అనంత విశ్వాన్ని నడిపించే శ్రీ మహావిష్ణువు..అనంత బాధలు తొలగించి, అంతులేని సుఖాలను అందిస్తాడని నమ్ముతారు.  

అనంత సూత్రం ప్రాముఖ్యత

అనంత చతుర్దశి నాడు విష్ణువును పూజించిన తర్వాత అనంత సూత్రాన్ని చేతికి కట్టుకుంటారు. అనంత సూత్రంలో 14 ముడులు ఉండాలి, ఈ 14 ముడులను 14 లోకాలతో అనుసంధానించి ఉంటాయి. ఇది అన్ని దుఃఖాలు , పాపాల నుంచి రక్షిస్తుంది. అతనికి సుఖం, శ్రేయస్సు , దీర్ఘాయువును అందిస్తుంది.

అనంత చతుర్దశి పూజా విధానం (Anant Chaturdashi 2025 puja vidhi)

అనంత చతుర్దశి రోజు వేకువజామునే స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.
పూజా స్థలంలో శ్రీ విష్ణువు, గణేష్ విగ్రహాలను ప్రతిష్టించాలి.
చెక్క పీఠం ఏర్పాటు చేసి దానిపై సింధూరంతో 14 తిలకాలు దిద్దాలి.
అనంత సూత్రాన్ని తయారు చేసి నూలు లేదా పట్టు దారంతో 14 ముడులు వేయాలి. ఈ ముడులు 14 లోకాలకు చిహ్నంగా ఉంటాయి.
ఈ సూత్రాన్ని పంచామృతంతో శుద్ధి చేయాలి
ధూపం, దీపం, పువ్వులు, పండ్లు, తులసి సమర్పించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి
పూజ తర్వాత పురుషులు కుడి చేతిలో, మహిళలు ఎడమ చేతిలో అనంత సూత్రాన్ని కట్టుకోవాలి. దీనిని రక్షా సూత్రానికి చిహ్నంగా భావిస్తారు.
ఈ రోజున గణేష్ విగ్రహాన్ని కూడా నిమజ్జనం చేస్తారు. గణేష్‌ను భక్తితో వీడ్కోలు పలకాలి.

అనంత చతుర్దశి నియమాలు (Anant Chaturdashi 2025 Rules)

అనంత చతుర్దశి సందర్భంగా కట్టిన రక్షా సూత్రాన్ని కనీసం ఒక సంవత్సరం పాటు ఉంచుకోవాలి. ఏదైనా కారణం వల్ల ఇది సాధ్యం కాకపోతే, రక్షా సూత్రాన్ని కనీసం 14 రోజులైనా ఉంచాలి..ఈ లోగా తీయకుండా ఉంచాలి
ఉదయం సమయంలో పూజ చేయలేకపోతే అనంత చతుర్థశి రోజు సాయంత్రం అయినా పూజ చేయొచ్చు
ఈ రోజు శ్రీ విష్ణువుతో పాటు వినాయకుడిని పూజించాలి
తామసిక ఆహారం తీసుకోవద్దు.. 

అనంత చతుర్దశి ప్రాముఖ్యత (Anant Chaturdashi 2025 Significance)

అనంత స్వరూపానికి అంకితమైన అనంత చతుర్థశి  అపారమైన శక్తికి, విశ్వాసానికి చిహ్నం.
ఈ రోజున గణేష్ ఉత్సవం కూడా ముగుస్తుంది.
పురాణాల ప్రకారం, ఎవరైనా ఈ రోజున శ్రద్ధతో, నియమాలతో వ్రతం చేస్తారో కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయి, శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం

గమనిక:  ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు.  ఈ సమాచారాన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget