Rain: మీ పెళ్లిలో కూడా వర్షం కురిసిందా! అది శుభ సంకేతమా - అశుభ సంకేతమా?
Rain on Wedding Day: పెళ్లి రోజున వర్షం పడితే అది శుభ సంకేతమా? అశుభమా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?

Rain During Marriage lucky or Unlucky: హిందూ ధర్మంలో వివాహాన్ని శుభకరమైన సంస్కారంగా భావిస్తారు. అందుకే వివాహంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు శుభ ముహూర్తం (వివాహ ముహూర్తం) చూస్తారు. కానీ ప్రకృతిలో ఎప్పుడు, ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు, అది ఎవరి అధీనంలోనూ ఉండదు. ముహూర్తం నిర్ణయించిన తర్వాత ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. కానీ పెళ్లి రోజున అకస్మాత్తుగా వర్షం కురిస్తే ఏర్పాట్లన్నీ వృధా అవుతాయి.
ఇంతకీ పెళ్లి సమయంలో వాన పడడం మంచిదా కాదా?
జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
ఇది శుభ సంకేతమా? అశుభ సంకేతమా?
పెళ్లి రోజున వర్షం కురవడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ జ్యోతిష్యం ప్రకారం కొన్ని సంస్కృతులలో దీనిని శుభానికి చిహ్నంగా భావిస్తారు. వర్షం వాతావరణాన్ని ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా పెళ్లి రోజున వర్షం కురవడం శుద్ధికి చిహ్నం. ఇది వరుడు, వధువుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని సూచిస్తుంది.
కొన్ని సంప్రదాయాల్లో, ఎవరి పెళ్లిలో అయితే వర్షం కురుస్తుందో... వారికి త్వరలో సంతానం కలుగుతుందని నమ్ముతారు. అందుకే పెళ్లి రోజున వర్షం కురవడం వరుడు, వధువులకు ఆశీర్వాదం లాంటిది.
పెళ్లి రోజున కురిసిన వర్షం సంబంధాల బలానికి కూడా చిహ్నం. ఎందుకంటే హిందూ ధర్మంలో వర్షాన్ని సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వర్షపు స్వచ్ఛమైన బిందువులు ప్రతికూలతను దూరం చేస్తాయి, దంపతులు సానుకూల వాతావరణంతో వారి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు.
తెలుగు సాంప్రదాయంలో, పెళ్లి రోజు వర్షం కురవడం సాధారణంగా శుభ సంకేతంగానే పరిగణిస్తారు. వర్షం సమృద్ధి, ఫలవంతం, దైవ కృపకు చిహ్నంగా చూస్తారు. ఇది నీటి ద్వారా సంతోషం, శ్రేయస్సు, కొత్త జీవితం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుందని నమ్ముతారు. అయితే, ఈ విశ్వాసం వ్యక్తులు ప్రాంతాల ఆధారంగా కొంత భిన్నంగా ఉండవచ్చు.
పూరీ జగన్నాథుడి రథయాత్ర సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇది ఉత్సవ వాతావరణంపై కొంతవరకూ ప్రభావం చూపించినా కానీ ఆ జోష్ తగ్గదు..మరింత పెరుగుతుంది.ఎందుకంటే వర్షాన్ని భక్తులు దైవిక ఆశీర్వాదంగా భావిస్తారు. అందుకే జగన్నాథ రథయాత్ర అనగానే వాన పడుతుందని అంతా సన్నద్ధంగా ఉండాలని ముందే సూచిస్తారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖాధికారులు చెబుతారు
సీతారాముల కళ్యాణం జరిగిన రోజు కూడా మేఘం వర్షిస్తుంది. ఎందుకంటే రామయ్య ఆకాశానికి చిహ్నం, సీతమ్మ పుడమికి చిహ్నం. ఇది సృష్టి ప్రక్రియతో పోల్చుతారు. ఆకాశం నుంచి వాన చినుకు పుడమిని చేరుకుంటుంది. ఆ చినుకు నేల కురిసినప్పుడే ప్రకృతి పులకరిస్తుంది. అందుకే సీతారాముల కళ్యాణం లోక కళ్యాణాన్ని సూచిస్తుంది.
ఆహారం ద్వారా తంత్ర సాధనతో వశీకరణం చేసుకుంటారని విన్నాం. నిజంగానే నల్ల మందు, వశీకరణలో ఆహారంతో హాని చేస్తారా? అదే నిజమైతే దాన్నుంచి ఎలా బయటపడాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు. ఈ సమాచారాన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.






















