అన్వేషించండి

Mystic Food: ఆహారం ద్వారా బ్లాక్ మ్యాజిక్ , వశీకరణ! లక్షణాలు ఎలా ఉంటాయ్ , మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి!

Black Magic: ఆహారం ద్వారా తంత్ర సాధనతో వశీకరణం చేసుకుంటారని విన్నాం. నిజంగానే నల్ల మందు, వశీకరణలో ఆహారంతో హాని చేస్తారా? అదే నిజమైతే దాన్నుంచి ఎలా బయటపడాలి?

Black Magic on Food: తంత్ర సాధన , బ్లాక్ మ్యాజిక్ ప్రయోగంలో ఆహారం పాత్ర చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దీని ఆధారంగా చెప్పాలంటే ఆహారం శరీరాన్ని శక్తివంతం చేసే సాధనం మాత్రమే కాదు.. దీని ద్వారా వ్యక్తి  ప్రతికూల, సానుకూల శక్తిని కూడా నియంత్రించవచ్చంటారు.
 
బ్లాక్ మ్యాజిక్, వశీకరణ క్రియల సమయంలో ఆహారం ద్వారా ఓ వ్యక్తి మానసిక , శారీరక స్థితి, ప్రవర్తన ప్రభావితమవుతుంది. అందుకే ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రస్తావించి ఉంటుంది ( ఎలాంటి భోజనం తినకూడదు - దీని గురించి పురాణాల్లో ఏముందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)

వశీకరణ , బ్లాక్ మ్యాజిక్ కు సంబంధించి ముఖ్యమైన విషయాలు
 
తంత్ర విద్యలో బ్లాక్ మ్యాజిక్, వశీకరణం ద్వారా ఓ వ్యక్తికి రహస్యంగా హాని చేస్తారు. ఈ నష్టం కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. ఆహారాన్ని మంత్రించి తినిపించడం వల్ల మీ శరీరంలో ఊహకందని, ఎలాంటి మెడికల్ రిపోర్టులలో దొరకని మార్పులు వస్తాయి. ఆహారం ద్వారా చేసే ఈ తాంత్రిక క్రియ..ఆ వ్యక్తి భావోద్వేగాలు, ఆలోచనలు, నిర్ణయాలను కూడా పూర్తిగా కంట్రోల్ చేసి ఓ బొమ్మలా మార్చేస్తుంది. ఇది రోజు రోజుకీ మార్పుచెందుతూ పూర్తిగా వారి స్వేచ్ఛను కోల్పోయేలా చేస్తుంది.
 
ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే?

ఆకలి వేయదు
తిన్నది అరగదు
తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది
పనిపై కన్నా నిద్రపై ఫోకస్ పెరుగుతుంది
తొందరగా ఆవేశం వచ్చేస్తుంటుంది

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

పరిచయం లేనివారు, మీకు హానిచేస్తారనిపించే వ్యక్తులు ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించకూడదు. నిత్యం భగవంతుడి ఆరాధనను భక్తిశ్రద్ధలతో చేసేవారికి ఈ విషయం ముందుగానే అవగతం అవుతుంది. ఇలాంటి వ్యక్తులకు ఆ భోజనం చేసే సమయంలో ఏదో గందరగోళంగా అనిపిస్తుంది. వెంటనే మీ కుడి చేతిని ఆజ్ఞా చక్రం (కనుబొమ్మల మధ్య) మీద ఉంచండి. మనస్సులో ఓం దుర్గాయై నమః , ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః మంత్రాన్ని జపించండి. ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఏదైనా చెడు మీ శరీరంలోకి ప్రవేశించే ముందే నాశనం చేస్తుంది. మీ వంటగది లేదా భోజనం చేసే ప్రదేసంలో దుర్గా, హనుమాన్ , బగలాముఖి వంటి రక్షణ యంత్రాలను పెడితే ఇలాంటి ప్రతికూల శక్తి దరిచేదని కొందరు పండితులు చెబుతారు.  

శాస్త్రాలు - వేదాల‌్లో రుజువైంది

అథర్వణవేదం- ఇందులో మంత్రాల ద్వారా ఆహారాన్ని ప్రతికూలంగా మార్చవచ్చు. అందుకే  ఆహారాన్ని భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి మాత్రమే తీసుకోవాలని చెబుతారు.
భగవద్గీత అధ్యాయం 17 శ్లోకం 7-10 లో ఆహారాన్ని మూడు వేర్వేరు వర్గాలుగా విభజించారు. వీటిలో (సాత్విక, రాజసిక , తామసిక) ఆహారం ఉన్నాయి. సాత్విక ఆహారం మనస్సును శాంతింపజేస్తుంది,  తామసిక ఆహారం ప్రతికూలత , గందరగోళాన్ని పెంచుతుంది. 
గరుడ పురాణం  ప్రకారం తెలియని వ్యక్తుల నుంచి, మనకు హానిచేస్తారనిపించే వ్యక్తుల నుంచి ఆహారాన్ని తీసుకోకూడదని ఉంది. ఎందుకంటే అలా చేయడం వల్ల మీపై ప్రతికూల శక్తుల ప్రభావం పెరుగుతుంది. 
మనుస్మృతి ప్రకారం ఆహారం స్వచ్ఛత , పవిత్రతను కాపాడాలని ఉంది
తాంత్రిక గ్రంథం ప్రకారం, మంత్రించిన ఆహారం ద్వారా ఏ వ్యక్తిపైనైనా బ్లాక్ మ్యాజిక్ లేదా  వశీకరణ చేయవచ్చని ఉంది

మీకు ఎప్పుడైనా చెడు శక్తి సోకిందేమో అనిపిస్తే.. పసుపు  ఉప్పు నీటితో  ముఖాన్ని కడుక్కోండి. దీంతో పాటు ఇల్లంతా ధూపం వేసి  దుర్గాయై నమః మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి.  ఇలాంటి చర్యల ద్వారా మీకు తెలియకుండానే మరబొమ్మలా మారిన మీరు మళ్లీ సాధారణ శక్తి పొందుతారని చెబుతారు. ఎందుకంటే మీపై ఉండే ఈ ప్రతికూల ప్రభావం బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది.  

గమనిక:  ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు.  ఈ సమాచారాన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Solar Eclipse 2026: మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
Pisces Half Year Horoscope: మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget