బాబా వాంగ 2025లో ఏం జరగబోతోందో చెప్పిన భయంకరమైన భవిష్యవాణి ప్రభావం భారతదేశంలో కనిపిస్తోందా!
Baba Vanga Predictions 2025: బాబా వాంగ అంధ భవిష్యత్ వక్త. 2025లో భారత్ లో ఏం జరగబోతోందో ఆమె చెప్పింది.. ఆ విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయా అనిపించే ఘటనలు జరుగుతున్నాయి..

Baba Vanga Prediction in Telugu: బల్గేరియాకు చెందిన బాబా వాంగ అనే అంధురాలు చెప్పిన జ్యోతిష్యాన్ని చాలామంది విశ్వసిస్తారు. ఇప్పటికే ఆమె చెప్పిన చాలా విషయాలు నిజం కావడంతో ఆ జోస్యాలను నమ్ముతారు
బాబా వాంగా సోవియట్ యూనియన్ పతనం, అమెరికాలో 9/11 ఉగ్రదాడి, ప్రిన్సెస్ డయానా మరణం వంటి వాటి గురించి కచ్చితమైన జోస్యాలు చెప్పారు. ఇవన్నీ నిజం అవడంతో ఆమె చెప్పిన జోస్యంపై నమ్మకం పెరిగింది.
1911లో జన్మించిన బాబా వాంగ 86 సంవత్సరాల వయసులో 1996లో మరణించారు. ఆమె మరణానికి ముందు 5079 వరకు ప్రపంచం అంతం కావడంతో సహా చాలా జోస్యాలు చెప్పారు.
బాబా వాంగ మరణించే ముందు ప్రపంచవ్యాప్తంగా భారీ విధ్వంసం, ప్రకృతి వైపరీత్యాల గురించి చెప్పారు..ఇవన్నీ ఇప్పుడు నిజం అవుతున్నట్టు కనిపిస్తున్నాయ్.
ఆర్థిక సంక్షోభం హెచ్చరిక
బాబా వాంగా జోస్యాల ప్రకారం, రాబోయే కాలం ప్రపంచానికి చాలా కష్టతరంగా ఉండబోతోంది. దీనితో పాటు, ప్రపంచ స్థాయిలో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుంది. ఆమె ప్రకారం, 2025లో పెద్ద ఆర్థిక సంక్షోభం రావచ్చు, ఇది అనేక దేశాల ఆర్థిక పరిస్థితిని దిగజార్చవచ్చు. ఈ జోస్యం గురించి అందరిలో భయాందోళన నెలకొంది. ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నారంతా.
ప్రకృతి వైపరీత్యాల హెచ్చరిక
బాబా వాంగా ప్రకృతి వైపరీత్యాల గురించి చేసిన జోస్యాల గురించి కూడా ప్రజలలో భయాందోళనలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వరదలు, వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి.
ప్రత్యేకంగా భారతదేశం గురించి చెప్పుకుంటే... ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల పరిస్థితి నెలకొంది. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పర్వత రాష్ట్రాల్లో వరదలు
పర్వత ప్రాంతాల్లో మేఘాల విస్ఫోటనం కారణంగా పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బాబా వాంగ తన జోస్యాలలో 2025ను ప్రకృతి వైపరీత్యాలతో నిండిన సంవత్సరంగా పేర్కొన్నారు. దీనితో పాటు అగ్నిపర్వతాలు బద్దలవుతాయని కూడా హెచ్చరించారు.
ఈ సంవత్సరం మార్చి నెలలో మయన్మార్లో చాలా వినాశకరమైన భూకంపం సంభవించింది, దీనిలో 5 వేల మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ సంఘటనల తర‌్వాత, బాబా వాంగా ఇతర జోస్యాలు కూడా నిజమవుతాయేమోనని ప్రజలు భయపడుతున్నారు.
తన జోస్యాలలో, ఆమె 2025లో ప్రకృతి వైపరీత్యాలు, ఐరోపాలో యుద్ధ పరిస్థితి, ప్రపంచ స్థాయిలో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుందని చెప్పారు.
2025లో మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందని కూడా చెప్పారు.
వానలు వరదలు
వారం రోజులుగా జమ్మూకశ్మీర్‌ను వరదలు ముంచెత్తుతున్నాయ్. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జమ్మూ- శ్రీనగర్ జాతీయరహదారితో పాటూ ప్రధాన మార్గాలన్నీ పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉధంపుర్ జిల్లా జఖేనీ, చెనాని మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ మధ్య మచైల్ మాతా దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై మేఘ విస్ఫోటం విరుచుపడిన ఘటనలో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ విషాధ ఘటన తర్వాత అధికారులు యాత్రను నిలిపేశారు. ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు దేశం మొత్తం మీద పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి ఇచ్చినది మాత్రమే. ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించడం లేదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.





















