Baba Vanga prophecy for July 2025: బాబా వంగా భవిష్యవాణి - జూలై 2025 లో ప్రపంచాన్ని వణికించే సంఘటనలు జరగబోతున్నాయా!
Japanese Baba Vanga's Prediction For July 2025: జూలై 2025లో ఏం జరగబోతోందో చెప్పారు బాబా వంగా. ఇప్పటికే వరుస ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో వంగా భవిష్యవాణి మరింత భయపెడుతోంది.

Baba Vanga prediction : పేరొందిన జపాన్ జ్యోతిష్యురాలు బాబా వంగా 2025 లో ఏం జరగబోతోందో చెప్పిన విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటికే వరుస ప్రమాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు దేశ ప్రజలు. విమాన ప్రమాదాలు, పరిశ్రమల్లో ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు వణికిస్తున్నాయి. పంచభూతాలు పగబట్టాయా అన్న రేంజ్ లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నెలలో ఏం జరగబోతోందో చెప్పిన విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి.
జూలై నెలలో వాతావరణం, వ్యాధులు , ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన విషయాలు చెప్పిన బాబా వంగా ఇవి సాధారణ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు.
బాబా వంగా 2025 సంవత్సరానికి ముందే సూచనలు చేశారు. వంగా గత సూచనలు చాలావరకూ నిజమయ్యాయి కాబట్టి, జూలై నెల గురించి ఏమి చెప్పారో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు?.
జూలైలో కొన్ని సంఘటనల గురించి బాబా వంగా సూచనలు చేశారు. ఇది నిజమైతే, ప్రపంచం భయంకరమైన వినాశనాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
బాబా వంగా జూలైలో ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత ప్రమాదాలు జరుగుతాయి
ఈ నెలలో బాబా వంగా అగ్ని, గాలి మరియు నీటికి సంబంధించిన వినాశనం జరగబోతోందనే సూచనలు చేశారు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 7న మొదలైన అంగారకయోగం జూలై 28 వరకు ఉంటుంది. ఈ సమయంలో రోడ్డు ప్రమాదాలు, పేలుళ్లు, అగ్నిప్రమాదాలు, విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
జూన్ 7 నుంచి జూలై 28 వరకు అంగారక యోగం ఉండడంతో జూలై మొత్తం ప్రమాదాలు, పేలుళ్లు, అగ్నిప్రమాదాలు, విమాన ప్రమాదాలు జరుగుతాయి
జూలైలో బాబా వంగా ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు వంటి భయంకరమైన సంఘటనల గురించి సూచనలు చేశారు. ఒకవేళ ఇది నిజమైతే, మానవ చరిత్రలో ఇది అతిపెద్ద విషాదం కావచ్చు.
బాబా వంగా మరియు జ్యోతిష్య గణనల ఆధారంగా, జూలై నెల జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.
బాబా వంగా ఎవరు?
బాబా వంగా 1911 సంవత్సరంలో బల్గేరియాలో జన్మించారు. ఓ వ్యాధి కారణంగా చిన్నతనంలోనే తన కళ్ళు కోల్పోయారు. ఈ సంఘటన తరువాత, ఆమెకు భవిష్యత్తును చూసే శక్తి వచ్చిందని చెబుతారు. భవిష్యత్తును చెప్పడం వల్ల ఆమె ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. బాబా వంగా ఇప్పుడు లేనప్పటికీ, ఆమె సూచనలు నేటికీ ప్రాచుర్యం పొందాయి.
బాబా వంగా గత అంచనాలు
1995 కోబ్ భూకంపం
వాస్తవ ప్రపంచ సంఘటనలను అంచనా వేయగల తన సామర్థ్యాన్ని ప్రదర్శించి, ఈ వినాశకరమైన భూకంపాన్ని ముందుగానే ఊహించారు.
2011 తోహోకు భూకంపం , సునామీ
22,000 మందికి పైగా మరణాలకు దారితీసిన ఈ విపత్తును బాబా వంగా ముందే అంచనా వేశారు. ఇది ఆమె ఖ్యాతిని మరింత పటిష్టం చేసింది.
COVID-19 పాండమిక్
టట్సుకి రాసిన పుస్తకం, "ది ఫ్యూచర్ ఐ సా" 2020లో వైరస్ వ్యాప్తి గురించి సూచించింది
ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణం
బాబా వంగా క్వీన్ లెజెండ్ మరణాన్ని కూడా అంచనా వేశారు
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించినది మాత్రమే. ఏబీపీ దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు. మీరు దీనిని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.





















