Monthly Horoscope for July 2025 : జూలై నెల మాసఫలాలు - ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కెరీర్ కి సంబంధించి ఏ రాశులవారికి శుభ ఫలితాలున్నాయి!
July 2025 Monthly Horoscope in Telugu : జూలై నెల ఈ రాశులవారికి అన్నీ మంచి ఫలితాలే ఇస్తోంది. ఇందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి...

జూలై 2025 మాసఫలాలు
మేష రాశి (Aries July 2025)
జూలైలో మేష రాశివారికి అనుకూల గ్రహసంచారం ఉంటుంది కానీ సంపాదన కన్నా ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు తగ్గుతాయి. మాటపట్టింపులు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో వివాదాలు వచ్చినా వెంటనే సమసిపోతాయి
వృషభ రాశి (Taurus July 2025)
వృషభ రాశివారికి జూలైలో అత్యంత అనుకూలంగా ఉంటుంది. గ్రహాల అనుకూల సంచారంవల్ల అన్నిరంగాలవారికి అనుకూలమే. ఆదాయంబాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.
మిథున రాశి (Gemini July 2025)
ఈ నెల ఆరంభంలో సమస్యలుంటాయి కానీ రెండోవారం నుంచి పరిస్థితిలో మార్పుంటుంది. అన్ని రంగాలవారికి లాభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనసౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రుల రాక ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శుభవార్తలు వింటారు. నూతన పరిచయాల వల్ల లాభపడతారు.
కర్కాటక రాశి (Cancer July 2025)
జూలైలోనూ గ్రహ సంచారం మీకు అనుకూల ఫలితాలను ఇవ్వడం లేదు. వాహన ప్రమాద సూచనలున్నాయి. ఆరోగ్యం సరిగా ఉండదు. చేసే వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులుంటాయి. ఊహించని సంఘటనలు జరుగుతాయి. నమ్మిన వారివల్ల మోసపోతారు. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కానీ...ఆత్మస్థైర్యంలో అన్నింటినీ ఎదుర్కొంటారు.
సింహ రాశి (Leo July 2025)
ఈ నెలలో సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఇబ్బందిపెడతాయి. అనారోగ్య సూచన. నమ్మినవారే మోసం చేస్తారు. ముఖ్యమైన పనులున్నీ వాయిదా పడతాయి. జన్మంలో కుజుడి సంచారం వల్ల వివాదాలు, ప్రమాదాలుంటాయి.
కన్యా రాశి (Virgo July 2025)
కన్యా రాశివారు జూలైలో ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. దూరప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలొస్తాయి కానీ ఆర్థికంగా ఆశించిన ఫలితం రాదు. జాయింట్ వ్యాపారాలు ఆగిపోతాయి. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ వహించాలి
తులా రాశి (Libra July 2025)
ఈ నెలలో తులా రాశివారికి అన్నివిధాలుగా అనుకూల సమయం. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. పుణ్యనదీ స్నానాలు చేస్తారు. స్నేహితులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. సోదరమూలకంగా లాభపజడతారు.
వృశ్చిక రాశి (Scorpio July 2025)
ఈ నెలలోనూ అష్టమంలో గ్రహసంచారం చికాకులు కలిగిస్తుంది. మానసికంగా కుంగిపోతారు. అవమానాలు పడతారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ అవసరానికి డబ్పు చేతికందుతుంది. ఆరోగ్యం బావుంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius July 2025)
అష్టమంలో గ్రహ సంచారం కారణంగా ఈ నెలలో సమస్యలు తప్పవు. అధైర్యంగా ఉంటారు. పని ఒత్తిడి పెరుగుతుంది కానీ ఫలితం దక్కదు. వాహన ప్రమాద సూచనలున్నాయి. దూర ప్రయాణాలు చేయొద్దు.
మకర రాశి (Capricorn July 2025)
మకర రాశివారికి జూలై నెలలో కుజుడి ప్రభావంతో అనారోగ్య సమస్యలుంటాయి. చేపట్టిన పనులు నిలిచిపోతాయి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. కుటుంబంలో వ్యతిరేకత ఉంటుంది. పని ఒత్తిడి, పరామర్శలు ఉంటాయి.
కుంభ రాశి (Aquarius July 2025)
ఈ రాశివారికి ఈ నెలలో వృతివ్యాపారముల్లో లాభాలొస్తాయి. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. అయితే కుజుడి సంచారం వల్ల మీకు చికాకులు తప్పవు. అత్యధిక కోపంగా ఉంటారు. సోదరులతో వివాద సూచనలుంటాయి
మీన రాశి (Pisces July 2025)
జూలై నెల మీనరాశివారికి అనుకూల సమయమే. అన్నిరంగాలవారికి కలిసొస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మీదే పైచేయి అవుతుంది. ఆర్థికంగా లాభపడతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది.నూతన వాహనం కొనుగోలుచేస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















