అన్వేషించండి

Untold Story of Baba Vanga: బాబా వంగా గురించి మీకు తెలియని కథ! ఆమె కళ్ళు ఎలా పోగొట్టుకున్నారు, భవిష్యత్ చూసే శక్తి ఎలా పొందారు?

Baba Vanga: బల్గేరియా భవిష్యత్ ప్రవక్త బాబా వాంగా . 5000 సంవత్సరాల వరకు భవిష్యవాణి చెప్పారు. ఆమె గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.

Baba Vanga Predictions: బాబా వాంగ అంధురాలైన భవిష్యత్ వక్త, ఆమె తన కచ్చితమైన జోస్యాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆమెను బాల్కన్ నాస్ట్రడామస్ అని కూడా పిలుస్తారు. ఈ దివంగత భవిష్యత్ వక్త 1911లో స్ట్రూమికా నగరంలో వెంగెలియా పాండేవ డిమిట్రోవాగా జన్మించారు. 

బాబా వాంగ 2004లో ఇండోనేషియాలో సంభవించిన సునామీ, సోవియట్ యూనియన్ పతనం, ప్రిన్సెస్ డయానా మరణం , 9/11 ఉగ్రవాద దాడులను ముందే ఊహించి జోస్యం చెప్పిన ఘనత ఆమెకు దక్కుతుంది.

సాధారణంగా బాబా వాంగ  జోస్యాలు 85 శాతం ఖచ్చితమైనవని చెబుతారు. ఆమె మరణానికి ముందు 5079 వరకు జోస్యాలు చెప్పింది. ఇందులో ప్రపంచం అంతం కూడా ఉంది. కానీ భవిష్యత్ వక్త బాబా వాంగా జీవితం ఎలా ఉండేదో తెలుసా?

ది మిర్రర్ న్యూస్ నివేదిక ప్రకారం, బాబా వాంగా తల్లి చిన్నతనంలోనే మరణించారు.  ఆమె తండ్రి మొదటి ప్రపంచ యుద్ధంలో బల్గేరియన్ సైన్యం తరపున యుద్ధంలో పాల్గొన్నారు. 12 సంవత్సరాల వయస్సులో ఒక సుడిగాలి ఆమె కళ్ళను పోగొట్టిందని చెబుతారు. కానీ ఈ సంఘటన తర్వాత ఆమెకు భవిష్యత్తును చూసే శక్తి వచ్చిందని చెబుతారు. 

మానసిక సామర్థ్యాలను ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించారు 

బాబా వాంగకు 1940ల వరకు తనలో ఉండే సామర్థ్యం గురించి తెలియదు.  ఆమె ఈ సామర్థ్యాన్ని రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో తప్పిపోయిన సైనికులను కనుగొనడంలో ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగించారు. యుద్ధం తరువాత ఆమె గురించి ప్రతిచోటా చర్చ జరిగింది. 

బాబా వాంగపై సంవత్సరాల తరబడి అధ్యయనం చేసిన విద్యావేత్త విక్టోరియా విటానోవా ప్రకారం, ప్రజలు ఆమె సలహా కోసం దేశం మరియు విదేశాల నుంచి వచ్చేవారు. 1960ల నాటికి బాబా వాంగా ఇంటి ముందు భారీ క్యూలైన్లు ఉండేవట. 

బాబా వాంగ 1996లో 84 సంవత్సరాల వయస్సులో మరణించారు. తన జోస్యాలలో, ఆమె మానవులు, గ్రహాంతరవాసుల కలయిక గురించి మాట్లాడింది. ఆమె గురించి వ్రాతపూర్వక పత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆమె తనతో ఎలాంటి డైరీ లేదా పెన్ను ఉంచుకోలేదని చెబుతారు. 

2025 కోసం బాబా వాంగ  ఏం చెప్పారంటే..
 
యూరప్‌లో రెండు దేశాల మధ్య కొత్త యుద్ధం మొదలై, జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతుంది
 
 ఒక పెద్ద క్రీడా సంఘటన సమయంలో భూమిపై ఏలియన్స్ సంపర్కం ఏర్పడుతుందని ఆమె ఊహించి చెప్పారు
 
2025లో శాస్త్రవేత్తలు మనస్సు ద్వారా సంభాషణ సాధ్యమయ్యే విధంగా బ్రెయిన్‌వేవ్‌లను ఉపయోగించే పద్ధతిని కనుగొంటారని ఆమె ఊహించారు
 
మానవ అవయవాలను ప్రయోగశాలలో తయారు చేసే సాంకేతికత 2025లో పరిపూర్ణం అవుతుందని, దీనివల్ల ట్రాన్స్‌ప్లాంట్ కోసం వేచి ఉండే సమయం తగ్గి, జీవితకాలం పెరుగుతుంది

ఆగస్ట్ 2025లో భూమి , ఆకాశం నుంచి ఒకేసారి డబుల్ ఫైర్ ఉద్భవిస్తుందని ఆమె ఊహించినట్లు ఉంది
 
2025లో భూకంపాలు, వరదలు,  ఇతర సహజ విపత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతాయని చెప్పారామె

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే.  ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Surya Gochar 2026: సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Embed widget