అన్వేషించండి

Andhra News: షర్మిలపై YSRCP నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం! అన్నగా జగన్ స్పందించాలి!

YS Jagan vs YS Sharmila: షర్మిలపై వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవం అని, కొందరు అసత్య ప్రచారాలు, బూతులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని వైస్సార్ టీపీ నేత పిట్ట రాంరెడ్డి అన్నారు.

హైదరాబాద్: వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలు వదిలి ఏపీలో ఎంట్రీ ఇచ్చాక అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ షర్మిల పొలిటికల్ కామెంట్లు మొదలుపెట్టాక, వైఎస్సార్ సీపీ నుంచి ఆమెకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. షర్మిలను చూస్తే జాలేస్తోందని కొందరు అంటే, జగన్ పై విమర్శలు చేసే స్థాయి షర్మిలది కాదని వైసీపీ నేతలు, ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. అయితే షర్మిలపై వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవం అని, కొందరు అసత్య ప్రచారాలు, బూతులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని వైస్సార్ టీపీ నేత పిట్ట రాంరెడ్డి అన్నారు. ఇటువంటి ఘటనలు సమాజానికి సిగ్గు చేటు అన్నారు.

Andhra News: షర్మిలపై YSRCP నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం! అన్నగా జగన్ స్పందించాలి!

కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర 
పిట్ట రాంరెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కేసీఆర్ పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే YSRTP పార్టీని పెట్టి సుదీర్ఘ పాదయాత్ర చెసిన నేత షర్మిల. అందుకే ప్రభుత్వం వ్యతిరేక ఓట్ చీలకుండా పోటీ నుంచి తొలగి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. కేసీఆర్‌ను గద్దె దింపడానికి షర్మిల చేసిన కృషిని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తూ ఏపీలో పార్టీని అధికారంలోకి తేవాల్సిన గౌరవం ఇచ్చారు. ఏపీసీసీ బాధ్యతలు స్వీకరించిన తరువాత షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. షర్మిల ముక్కు సూటి మనిషి. డేర్ అండ్ డైనమిక్ లీడర్. ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి రావడానికి షర్మిల కీలక పాత్ర పోషించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫలాలపై షర్మిల ప్రశ్నిస్తే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఏపీలోని కొందరు విలువలు లేని నాయకులు షర్మిలపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణలో చేసినట్లే ఏపీలోనూ ఆమె పోరాటం కొనసాగుతోంది. షర్మిల సొంత కష్టంతో రాజకీయంగా ఎదుగుతున్నారు. ఆమె నిజాయితీ ఉన్న నాయకురాలు. కుటుంబంలో ఉన్న సమస్యలను తనలో తాను దిగమింగుకొని రాజకీయం చేస్తున్నారు. కానీ షర్మిల ఎక్కడా నోరు జారడం లేదు. కానీ షర్మిల రాకతో ఏపీ ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ఆమెపై రాజకీయంగా మాట్లాడండి, కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే సూర్యుడు పైన ఉమ్మేస్తే మన మీదే పడుతుంది అని గుర్తుంచుకోవాలి. షర్మిలపై YSRCP నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే బాగోదు అంటూ హెచ్చరిక జారీ చేస్తున్నాం. జగన్ కు మా వినతి... వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చెల్లి షర్మిల ఎంత కష్టపడ్డాదో ఆయనకు తెలుసు. కానీ ఆమెపై వస్తున్న ఆరోపణలు, అసత్య ప్రచారాలపై ఒక అన్నగా జగన్ ఖండిచాలని ఆశిస్తున్నామని’ పిట్ట రాంరెడ్డి పేర్కొన్నారు.  

Andhra News: షర్మిలపై YSRCP నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం! అన్నగా జగన్ స్పందించాలి!

షర్మిల ఎవరినీ మోసం చేయలేదు..
తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దింపి కాంగ్రెస్ లో అధికారంలోకి తెచ్చాక, అధిష్టానం ఇచ్చిన బాధ్యతలతో ఆమె ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని పిట్ట రాంరెడ్డి తెలిపారు. అయితే తెలంగాణలో ఉన్న YSRTP నాయకులను, కార్యకర్తలను షర్మిల మోసం చేయలేదు అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో YSRTP నాయకులకు మంచి స్థానం ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారని తెలిపారు. కానీ పార్టీ వీడి, వెళ్లిన వారికి ఇప్పటికీ షర్మిల అంటే వెన్నులో వణుకు పుడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget