AP MLC Elections : ఈ ఏడాది వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఎమ్మెల్సీ పదవుల యోగం - జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు నేతల తంటాలు !
వైఎస్ఆర్‌సీపీకి పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. అవకాశం కోసం సీనియర్లు జగన్‌ను సంప్రదిస్తున్నారు.
![AP MLC Elections : ఈ ఏడాది వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఎమ్మెల్సీ పదవుల యోగం - జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు నేతల తంటాలు ! YSRCP will get MLC posts on a large scale. AP MLC Elections : ఈ ఏడాది వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఎమ్మెల్సీ పదవుల యోగం - జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు నేతల తంటాలు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/11/d48e25febb25a47b073ccd8f4456ff6c1673448832976228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP MLC Elections : ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్‌సీపీలో పదవుల హడావుడి ప్రారంమయింది. ఈ ఏడాది ఈ ఏడాది 23 శాసన మండలి పదవులు ఖాళీ కానున్నాయి. ఎన్నికలు జరగనున్న స్థానాలు తప్ప అన్నీ వైసీపీకి దక్కనున్నాయి. ఎన్నికలు జరిగే వాటిరోనూ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు గెలుపొందవచ్చు. కానీ ఎన్నికలు లేకుండా పదవి పొందే అవకాశం వైసీపీ నేతలకు వచ్చింది. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఎన్నికైతే 2029 వరకు వారు ఆ పదవిలో కొనసాగే అవకాశముంది. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ఆరేళ్ళపాటు ఎమ్మెల్సీ పదవిలో కొనసాగవచ్చు. దీంతో ఎమ్మెల్సీ పదవికి భారీ డిమాండ్ పెరిగింది. పలు జిల్లాల్లో సీనియర్ నాయకులు సైతం ఎమ్మెల్సీ పదవులకు పోటీపడున్నారు.
ఈ ఏడాది ఖాళీ కానున్న 23 ఎమ్మెల్సీ స్థానాలు
2019 ఎన్నికల్లో 175 అసెంబ్లిd స్థానాలకు గాను 151 సీట్లు సాధించిన వైసీపీ శాసన సభలో తిరుగులేని ఆధిక్యతను సొంతం చేసుకుంది. శాసన మండలిలో మెజార్టీ లేకపోవడంతో సీఎం జగన్‌కు తలనొప్పిగా మారింది. ఒకదశలో శాసన మండలిని రద్దు చేయాలనే ప్రతిపాదన చేశారు. తీర్మానం పంపారు. అయితే కేంద్రం ఆమోదించలేదు. కానీ తర్వాత జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పలువురు టీడీపీ సభ్యుల పదవికాలం పూర్తవ్వడంతో వైసీపీ బలం పెరిగిం ది. మండలిలో ఇప్పుడు మెజార్టీ కూడా వైసీపీదే. తాజాగా 23 స్థానాలు భర్తీ కావాల్సి ఉండటం తో శాసన మండలిలోనూ పూర్తిగా వైసీపీ ఆధిక్యత చూపించనుంది. శాసన మండలి లో టీడీపీ ప్రాతినిధ్యం పరిమితం కానుంది.
ఎమ్మెల్యే , గవర్నర్ కోటా స్థానాలు ఎక్కువ !
ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్ని ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలతో పాటు స్థానిక సంస్థల కోటాతో భర్తీ చేయాల్సి ఉంటుంది. అ ఎమ్మెల్యే కోటాలో భర్తీ కావాల్సిన 7 స్థానాలు గవ ర్నర్ కోటాలో భర్తీ అయ్యే రెండు స్థానాలు, వైసీపీ సొంతం అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఫ్యాన్ స్పీడ్ ముందు ప్రతిపక్షాలు నిలవలేకపోయాయి. మున్నెన్నడూ లేనంతగా పంచాయితీ నుంచి జిల్లా పరిషత్‌ల వరకు వైసీపీ తిరుగులేని ఆధిపత్యంలో నిల్చింది. స్థానిక సంలటస్థల కోటాలో భర్తీ కావా ల్సిన 9 స్థానాలు వైసీపీ ఖాతాలోనే జమకానున్నా యి. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో భర్తీ కావాల్సిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ ఉత్కంఠభరితంగా జరగనుంది. ఆ స్థానాల్లో పీడీఎఫ్ బలమైన పోటీ ఇవ్వనుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఐదు స్థానాల్లో కనీసం రెండు సీట్లు దక్కించుకున్నట్లైతే 23కు 20 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ సొంత అవుతాయి.
చాన్స్ కోసం వైసీపీ ఆశావహుల ప్రయత్నాలు!
పదవులు ఆశించే నేతలు పార్టీ పెద్దలను కలిసి తమ మనసులో మాట చెబుతున్నారు. పార్టీ పెద్దల వద్ద ఇప్పటికే తమ మనసులో మాట బయటపెట్టిన ఆశావహులు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి హామీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల వేడి పెరగడంతో ఎమ్మెల్సీ పదవుల భర్తీలో ఆచితుచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఎమ్మెల్సీ పదవుల ఆశిస్తు న్న ఆశావహులకు తనను కలిసే ఛాన్స్ కూడా జగన్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. జిల్లాల వారీగా సామాజిక సమీకరణల్ని ముఖ్య అనుయాయులతో జగన్ బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో పలువురికి ఎమ్మెల్సీ హామీలు ఇచ్చి ఉన్నారు. వారంతా ఇప్పుడు పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)