అన్వేషించండి

Vijayasai Reddy On TDP: త్వరలోనే టీడీపీలో చీలిక-విజయసాయిరెడ్డి హాట్‌ కామెంట్స్‌

తెలుగుదేశం పార్టీలో చీలిక రాబోతోందన్నారు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. త్వరలోనే టీడీపీ రెండు, మూడు ముక్కులు అవుతుందంటూ ట్వీట్‌ చేశారాయన.

తెలుగుదేశం పార్టీపై హాట్‌ కామెంట్స్‌ చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. వరుస ట్వీట్లతో విరుచుపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు అవినీతి కేసులో జైలుకు  వెళ్లినా... ఆ పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోవడంలేదంటూ ట్వీట్‌ చేశారు విజయసాయిరెడ్డి. ఈ పరిస్థితి ఆ పార్టీలోకి దయనీయస్థితికి అద్దం పడుతోందని ఆరోపించారు.  అంతేకాదు.. తెలుగుదేశం పార్టీ రెండు, మూడు ముక్కలుగా చీలిపోయేందుకు రెడీగా ఉందంటూ ట్వీట్‌ చేశారు విజయసాయిరెడ్డి. 40 సంవత్సరాలుగా టీడీపీకి మద్దతిస్తున్న  బలమైన వ్యాపార వర్గంలో పునరాలోచన మొదలైందన్నారు. చంద్రబాబు దోపిడీలను తామెందుకు సమర్థించాలని ఆ వ్యాపార వర్గంలో ఆలోచన మొదలైందంటూ ట్వీట్‌ చేశారు  విజయసాయిరెడ్డి.

సిల్క్‌ స్కామ్‌లో అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు... నీతిమంతుడంటున్న ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు  విజయసాయిరెడ్డి. ప్రజల సొమ్ము దోచుకోవాల్సి అవసరం తమకు లేదన్న నారా భువనేశ్వరి వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. రెండు ఎకరాల ఆసామి.. హెరిటేజ్‌ ఎలా స్థాపించారో  ప్రజలందరికీ తెలుసంటూ ట్వీట్‌ చేశారు విజయసాయిరెడ్డి. తమ కంపెనీలో రెండు శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయని.. అవినీతికి పాల్పడే ఖర్మ తమకేంటి అంటూ నారా  భువనేశ్వరి అన్న అంటున్నారని... ఆమె వ్యాఖ్యలను నమ్మేదెవరు అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు మ్యానిప్యులేటివ్‌ స్కిల్స్‌, తమ మనుషులను వ్యవస్థల్లోకి  జొరబెట్టింది ప్రజా సేవకోసమనా అంటూ క్వశ్చన్‌ చేశారాయన. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబు.. రాజమండ్రి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. 23 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. మరోవైపు... ఆయనపై కేసు  కొట్టించేయాలని చంద్రబాబు తరపు లాయర్లు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఏసీబీ కోర్టులో, ఏపీ హైకోర్టులో వీలుకాకపోవడంతో.. సుప్రీం కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. రేపు ఈ  పిటిషన్‌ అత్యున్నత ధర్మాసనం ముందుకు రానుంది చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌. మరోవైపు.. చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్‌కు బెయిల్‌ కోసం తీవ్రంగా  శ్రమిస్తున్నారు లాయర్లు. కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. ఇక.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో రెండు రోజుల క్రితం నారా లోకేష్‌కు కూడా నోటీసులు ఇచ్చారు ఏపీ  సీఐడీ అధికారులు. 4వ తేదీ విచారణకు రావాలని ఆదేశించారు. అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్‌... అవినీతి కేసుల్లో ఇరుక్కోవడంతో... ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న  వ్యాపార వర్గంలో పునరాలోచన మొదలైందంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG Group 1 Results: తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్టు లింక్
తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్టు లింక్
KTR Chit Chat: మళ్లీ నోటీసులిస్తారు - అరెస్ట్ అని ప్రచారం చేస్తారు - కేటీఆర్ జోస్యం
మళ్లీ నోటీసులిస్తారు - అరెస్ట్ అని ప్రచారం చేస్తారు - కేటీఆర్ జోస్యం
Yanamala Rama Krishnudu: టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
Honor Killing Case: పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడాRohit Sharma Champions Trophy 2025 | 9నెలల్లో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మInd vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Group 1 Results: తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్టు లింక్
తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్టు లింక్
KTR Chit Chat: మళ్లీ నోటీసులిస్తారు - అరెస్ట్ అని ప్రచారం చేస్తారు - కేటీఆర్ జోస్యం
మళ్లీ నోటీసులిస్తారు - అరెస్ట్ అని ప్రచారం చేస్తారు - కేటీఆర్ జోస్యం
Yanamala Rama Krishnudu: టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
Honor Killing Case: పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
Mahesh Babu: మహేష్ బాబు సినిమాకు రెండు వేర్వేరు క్లైమాక్స్‌లు.. షాక్‌లో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్, ఎందుకో తెలుసా?
మహేష్ బాబు సినిమాకు రెండు వేర్వేరు క్లైమాక్స్‌లు.. షాక్‌లో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్, ఎందుకో తెలుసా?
Jagga Reddy movie: టాలీవుడ్‌లోకి జగ్గారెడ్డి ఎంట్రీ - లవ్ స్టోరీలో ప్రధాన పాత్ర - ఇంత తీవ్ర నిర్ణయం ఎందుకంటే ?
టాలీవుడ్‌లోకి జగ్గారెడ్డి ఎంట్రీ - లవ్ స్టోరీలో ప్రధాన పాత్ర - ఇంత తీవ్ర నిర్ణయం ఎందుకంటే ?
Money Secrets: పాత పద్ధతులు వదిలేయండి, ఈ క్వాలిటీస్‌ ఉంటే మీ సంపద సరసరా పెరుగుతుంది!
పాత పద్ధతులు వదిలేయండి, ఈ క్వాలిటీస్‌ ఉంటే మీ సంపద సరసరా పెరుగుతుంది!
Rohit Kohli Bonding: రోహిత్‌కు హగ్ ఇచ్చి అనుష్క శర్మ  కంగ్రాట్స్.. కోహ్లీతో హిట్ మ్యాన్ దాండియా.. సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్
రోహిత్‌కు హగ్ ఇచ్చి అనుష్క శర్మ కంగ్రాట్స్.. కోహ్లీతో హిట్ మ్యాన్ దాండియా.. వీడియోలు వైరల్
Embed widget