YS Sharmila joins In Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల- వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ విలీనం
YSRTP Merge In Congress: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ఆర్‌టీపీ పార్టీని హస్తం పార్టీలో విలీనం చేశారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.
Sharmila Join Congress: వైఎస్‌ఆర్టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో (Congress) చేరారు. ఢిల్లీ (Delhi)లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన షర్మిల... వైఎస్సాఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.. షర్మిల వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ.. షర్మిలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
షర్మిల ఏమన్నారంటే...
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. వైఎస్ షర్మిల మాట్లాడారు. తాను... తన తండ్రి వైఎస్‌ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నానని చెప్పారామె. వైఎస్‌ఆర్ జీవితమంతా కాంగ్రెస్ కోసం పనిచేశారని అన్నారు. ఆయన కూతురుగా నేను కాంగ్రెస్‌లో చేరినందుకు గర్వంగా ఉందన్నారు. అలాగే వైఎస్‌ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని చెప్పారామె. ఎందుకంటే... కాంగ్రెస్ ఉన్నంత వరకు వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ కూడా అందులో భాగమై ఉంటుందని చెప్పారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్సే అని చెప్పారు. దేశంలోని అన్ని వర్గాలకు ఏకం చేసిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు షర్మిల. మణిపూర్‌లో క్రైస్తవులపై దాడులు దారుణమమని ఖండిచారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ... తనతోపాటు ప్రజలందరిలో ఆత్మవిశ్వాసం నింపారని చెప్పారు. రాహుల్ జోడో యాత్రతోనే కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రాహుల్‌ని ప్రధాని చేయడం నా తండ్రి వైఎస్‌ఆర్ కల అని... ఆ కలను నిజం చేసేందుకు కృషిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు కోసమే నేను తెలంగాణలో పోటీ చేయలేదన్నారు షర్మిల.
షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్..!
వైఎస్ షర్మిలకు... ఏఐసీసీ (AICC)లో చోటు కల్పించడం లేదా ఆంధ్రప్రదేశ్ పీసీసీ (APCC) అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే... షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు రాహుల్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో.. ఆయన, మల్లికార్జునఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో షర్మిలకు ప్రాధాన్యం ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో కేటీఆర్ ముందు అసలు సవాల్!
- భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుని తెలంగాణ వాయిస్ అంటే ప్రజలు నమ్ముతారా ? వ్యూహాత్మక తప్పిదం బీఆర్ఎస్‌ను ఇంకా వెంటాడుతోందా ?
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే...?
నిన్న సోదరుడు సీఎం జగన్ (CM jagan)ను కలిసేందుకు తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు వైఎస్ షర్మిల. అన్న వైఎస్ జగన్, వదిన భారతి (YS Bharathi)కి తన కుమారుడి నిశ్చితార్థ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా... తాడేపల్లి వెళ్లేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన వైఎస్ షర్మిలను... ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna reddy) కలిశారు. ఆమెకు స్వాగతం పలికి.. సీఎం జగన్ ఇంటి వరకు ఆమె క్వానాయ్‌తోపాటు వెళ్లారు. ఆ సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిన తర్వాత... తాను కూడా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కండువా కప్పుకుంటానని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. దీన్ని బట్టి చూస్తే... షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలే అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది.
షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలు అయితే... అన్న సీఎం జగన్‌తో ఢీకొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సీఎం జగన్ కూడా... కుటుంబాన్ని చీల్చేందుకు కుట్రలు చేస్తున్నారని కూడా నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి... 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అన్నచెల్లెళ్ల మధ్య రాజకీయ పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్- వచ్చే వారం రాష్ట్రానికి ఈసీ బృందాలు
- వచ్చే వారంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల బృందాలు పర్యటించనున్నాయి. ఓటర్ల జాబితా, వచ్చే ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించనున్నారు.