అన్వేషించండి

YSRCP Political Strategy Failures: వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి!

TDP Counter to Jagan: వైఎస్ జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు రివర్స్ అవుతున్నాయి? ప్రజా సమస్యలను వదిలి ఫ్యాక్షన్ చరిత్ర గురించి మాట్లాడటం వైసీపీకి శాపంగా మారుతోందా?


Jagan Press Meet Analysis:  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు , ఆయన అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయన ఎంచుకుంటున్న అంశాలు, అవి రివర్స్ అవుతున్న తీరుపై రాజకీయ విశ్లేషకులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

 అనవసర చర్చలకు ఆస్కారం 

వైఎస్ జగన్ ప్రెస్ మీట్లలో తరచుగా ఎదురవుతున్న ప్రధాన సమస్య  సందర్భోచితం కాని వ్యాఖ్యలు . ఏదైనా ఒక ప్రజా సమస్యపై మాట్లాడాలని భావించినప్పుడు, అనూహ్యంగా ఆయన గతం వైపు లేదా కుటుంబ చరిత్ర వైపు వెళ్తున్నారు. ఇటీవల ఆయన తన తాత రాజారెడ్డి, బాబాయ్ వివేకా హత్యల గురించి ప్రస్తావించడం రాజకీయంగా టీడీపీకి పెద్ద అస్త్రంగా మారింది. అసలు చర్చను పక్కదారి పట్టించి, కడప ఫ్యాక్షన్ చరిత్రను ప్రజల్లోకి మళ్ళీ తీసుకెళ్ళేలా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఇది ఆయనకు తెలియకుండా జరుగుతున్న ఫ్లో కాదని, భావోద్వేగంతో సానుభూతి పొందే ప్రయత్నమని కొందరు భావిస్తున్నప్పటికీ, అది అంతిమంగా విపక్షాలకు అనుకూలంగా మారుతోంది.

 టీడీపీ  కౌంటర్  వ్యూహంలో చిక్కుకోవడం 

జగన్ ఎప్పుడైతే ఫ్యాక్షన్ లేదా హత్యల ప్రస్తావన తెస్తున్నారో, అప్పుడే టీడీపీ నాయకులు పక్కా ప్రణాళికతో పాత రికార్డులను, నాటి పత్రికల క్లిప్పింగులను సోషల్ మీడియాలో వదులుతున్నారు. జగన్ ఒక పాయింట్ మాట్లాడితే, టీడీపీ నేతలు పది పాత విషయాలను బయటకు తీస్తున్నారు. దీనివల్ల జగన్ చెప్పాలనుకున్న ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యం పక్కకు పోయి, పాత నేరాల చరిత్రపైనే చర్చ సాగుతోంది. ఇది వైఎస్సార్సీపీకి వ్యూహాత్మక తప్పిదమనే చెప్పాలి.

 ప్రజా సమస్యల ఎంపికలో వైఫల్యం

ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే నిత్యావసర ధరలు, నిరుద్యోగం, లేదా అభివృద్ధి పనుల్లో జాప్యం వంటి అంశాలను ఎంచుకోవాలి. కానీ, వైసీపీ తరచుగా వ్యక్తిగత దూషణలు లేదా గతంలో జరిగిన సంఘటనల చుట్టూనే తిరుగుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గట్టిగా వినిపించడంలో వైసీపీ విఫలమవుతోంది. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆ పార్టీ వెనుకబడుతోంది. జగన్ ప్రెస్ మీట్ తర్వాత నెరేటివ్ సెట్ చేయడంలో సోషల్ మీడియా వింగ్ విఫలమవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  ఆయన ప్రసంగంలోని పాజిటివ్ పాయింట్స్ కంటే, ఆయన మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలే హైలైట్ అవుతున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ వివాదాస్పద వ్యాఖ్యలనే ప్రధాన వార్తలుగా ఇస్తుండటంతో, సామాన్య ప్రజల్లో జగన్ ఇంకా పాత గొడవల్లోనే ఉన్నారనే భావన కలుగుతోంది. ఇది పార్టీ ఇమేజ్‌ను మరింత దెబ్బతీస్తోంది.

 ఫ్లోలో జరుగుతున్నాయా.. కావలనే చేస్తున్నారా? 

 జగన్ తన సహజ ధోరణిలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురవుతున్నారు. అయితే, సలహాదారులు ఆయనకు సరైన ఇన్పుట్స్ ఇవ్వకపోవడం లేదా ఆయన ఎవరి మాట వినకపోవడం వల్ల ఈ తప్పిదాలు జరుగుతున్నాయి. తనను తాను రక్షించుకునే   క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ప్రత్యర్థులకు దాడి చేయడానికి  అవకాశాన్ని ఇస్తున్నాయని వైసీపీ క్యాడర్ భావిస్తోంది.  వైసీపీ  ఇలాంటి సమయంలో తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.   గతాన్ని తవ్వడం మానేసి, వర్తమానంలో ప్రజలకు ఏం అవసరమో ఆ సమస్యలపై మాత్రమే ఫోకస్ చేయాలి. ఒక క్రమపద్ధతిలో, డేటాతో కూడిన విమర్శలు చేస్తేనే ప్రభుత్వ వ్యతిరేకతను పట్టుకోగలరు. లేదంటే ప్రతి ప్రెస్ మీట్ ప్రత్యర్థులకు ఒక పండుగలా మారి, వైసీపీని మరింత రక్షణలో పడేస్తుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget