అన్వేషించండి

Andhra Politics : టీడీపీ, జనసేనతో బీజేపీ కలుస్తుందా ? కర్ణాటక ఫలితాల తర్వాత క్లారిటీ వస్తుందా ?

ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ కలుస్తుందా?కర్ణాటక ఎన్నికల ఫలితాలే ఏపీ పొత్తులు డిసైడ్ చేస్తాయా?కర్ణాటకలో ఓడితే బీజేపీ ఆలోచిస్తుందా?గెలిస్తే దక్షిణాదిన దూసుకెళ్లే అవకాశంలా చూస్తుందా ?

 

Andhra Politics :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లేందుకు జనసేన ఆసక్తి చూపుతోంది. ఆ విషయాన్ని నాదెండ్ల మనోహర్ చాలా స్పష్టంగా చెబుతున్నారు. మరి బీజేపీ పయనం ఎటు ? అనేది చర్చనీయాంశంగా మారింది. 2014 కూటమి మళ్లీ కలిసి పోటీ చేయాలని కొంత మంది బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. అయితే వీరిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్న లీకులు కూడా ఇస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు మోదీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. కానీ ఎన్డీఏలో చేరిక గురించి మాత్రం ఏమీ చెప్పడం లేదు. 

జనసేన - టీడీపీ కాంబో ఖాయం !

ఏపీ రాజకీయాల్లో కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా ఉన్నది పొత్తులే. టీడీపీ, జనసేన కలిస్తే రాజకీయాలు ఏకపక్షంగా మారిపోతాయన్న  ఓ అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. ఈ సమయంలో ఆ రెండు పార్టీలు కలుస్తాయా లేదా అన్నది సస్పెన్స్ గానే మారింది. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని  వైఎస్ఆర్‌సీపీ వైపు నుంచి సవాళ్లు వస్తున్నాయి. ఆ పార్టీ నేతలు ఈ రెండు పార్టీలు కలవకుండా  ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పొత్తుల దిశగా ఆ రెండు పార్టీలు అజుగులు వేస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఇప్పటికే వివిధ సందర్బాల్లో 3 సార్లు చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ భేటి అయ్యా రు. టీడీపీ,జనసేన కలిసి ముందుకు వెళ్తా యని ఇప్పటికే ఉన్న రాజకీయ వాతావరణంలో కనిపిస్తోంది.  లోకేష్‌ పాద యాత్రలో జనసేన నేతలు కూడా పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పుడు వీరితో బీజేపీ కలుస్తుందా లేదా అన్నదే కీలకంగా మారింది. 

బీజేపీ హైకమాండ్ ఏదనుకుంటే అదే !  

టీడీపీ, జనసేనతో  బీజేపీ కలుస్తుందా లేదా అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంచేందుకు కలిసి రావాలని బిజెపి కూడా పవన్‌ కళ్యాణ్‌ విజ్ఞప్తి చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ అసలు బీజేపీ ఏమనుకుంటుందో మాత్రం క్లారిటీలేదు. ఏపీ బీజేపీ  నేతలు మాత్రం రెండు రకాలుగా విడిపోయారు. ఓ వర్గం అసలు టీడీపీతో వెళ్లే ప్రశ్నే లేదని.. కుటుంబ, అవినీతి పార్టీలకు వ్యితరేకమంటోంది. జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తామని చెబుతోంది. అయితే మరో వర్గం మాత్రం టీడీపీతో పొత్తులుంటాయని బలంగా వాదిస్తోంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. కానీ ఆయనపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిందని.. పొత్తుల గురించి ఎవరు మాట్లాడమన్నారని ప్రశ్నించారని బీజేపీ వర్గాలే లీక్ చేస్తున్నాయి. 

కర్ణాటక ఎన్నికల తర్వాత  పొత్తులపై క్లారిటీ   

బీజేపీకి ఏపీలో పెద్దగా బలం లేదు. ఒక్క శాతం ఓట్లు మాత్రమే వస్తున్నాయి. కలిసి వచ్చే ఓట్ల పరంగా చూసుకోవాలంటే బీజేపీతో కూటమి కట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ బీజేపీతో పొత్తు వల్ల ఎన్నికలు సక్రమంగా జరగడంతో పాటు ఏపీలో అరాచకాలను తగ్గించవచ్చని అనుకుంటున్నారు. అందుకే బీజేపీని కలుపుకోవాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే చంద్రబాబుతో సంబంధం లేకుండా కలిసి పోటీ చేద్దామని జనసేనకు బిజెపి ప్రతిపాదిస్తోంది. దీనివల్ల వైసిపికే లాభం జరుగతుందని జనసేన భావిస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే.. ఆ పార్టీ కలిసి వస్తే జనసేనతో లేకపోతే ఒంటరిగా పోటీ చేసే చాన్స్ ఉంది. ఒక వేళ కర్ణాటకలో ఫలితాలు వ్యతిరేకంగా వస్తే వచ్చే  పార్లమెంట్ ఎన్నికలను  దృష్టిలో పెట్టుకుని.. ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
బ్యాడ్‌న్యూస్‌: దేశంలోనే నంబర్‌ 1 బైక్‌ Hero Splendor Plus ధర పెంపు, కొత్త ధరల లిస్ట్‌ ఇదిగో!
బ్యాడ్‌న్యూస్‌, పల్లె నుంచి పట్నం దాకా సామాన్యులు వాడే ఈ బైక్‌ రేటు పెంపు

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
బ్యాడ్‌న్యూస్‌: దేశంలోనే నంబర్‌ 1 బైక్‌ Hero Splendor Plus ధర పెంపు, కొత్త ధరల లిస్ట్‌ ఇదిగో!
బ్యాడ్‌న్యూస్‌, పల్లె నుంచి పట్నం దాకా సామాన్యులు వాడే ఈ బైక్‌ రేటు పెంపు
Ee Nagaraniki Emaindi Sequel Cast: 'యానిమల్' నుంచి ఈ నగరానికి... తరుణ్ భాస్కర్ సినిమాలో హీరోగా 'హిట్' యాక్టర్!
'యానిమల్' నుంచి ఈ నగరానికి... తరుణ్ భాస్కర్ సినిమాలో హీరోగా 'హిట్' యాక్టర్!
Gold Investment: లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
Nandyala Crime News:నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
Mana Shankara Vara Prasad Garu BO Day 10: బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
Embed widget