Where Is KCR : ప్రజల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నా సైలెన్స్ - ఇలాంటి సందర్భంలోనూ కేసీఆర్ మాట్లాడరా ?
Telangana : ఇలాంటి పరిస్థితుల్లోనూ కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదని తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అసలు కేసీఆర్ వ్యూహమేంటి ?
Why is KCR not coming out in such situations : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఇటీవల బయట కనిపించారు. బయట అంటే.. ఆయన ఫామ్ హౌస్‌లోనే జైలు నుంచి వచ్చిన కుమార్తెకు స్వాగతం చెబుతూ కనిపించారు. ఆ దృశ్యాలు బయటకు వచ్చాయి. అప్పటి వరకూ దాదాపుగా రెండు నెలలు ఆయన బయట కనిపించకపోయే సరికి ఆరోగ్యం బాగో లేదన్న పుకార్లు కూడా వచ్చాయి. కానీ కేసీఆర్ వేటినీ పట్టించుకోలేదు. బయటకు రాలేదు. కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన కార్యచరణ ఉంటుందని.. వెంటనే రైతుల కోసం టూర్ కి వెళ్తారని బీఆర్ఎస్ వర్గాలు లీక్ ఇచ్చాయి. కానీ అది లీక్ గానే మిగిలింది .ఆయన సైలెంట్ గానే ఉన్నారు.
ప్రతిపక్ష నేత ఎక్కడ అంటూ రేవంత్ పదే పదే విమర్శలు
ఇంతటి వరదలు వస్తే ప్రతిపక్ష నేత కేసీఆర్ కనీసం బయటకు వచ్చి కూడా చూడలేదని.. అలాంటి ప్రతిపక్షానికి తాము ఎలా సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ కు పరిమితం అయితే.. ఆయన కుమారుడు అమెరికాలో జల్సా చేస్తున్నారని.. అక్కడ్నుంచి సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను రేవంత్ టార్గెట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం దగ్గర్నుంచి కేసీఆర్ ఎందుకు బయటకు రారని పదే పదే ప్రశ్నిస్తూ వస్తున్నారు. కానీ బీఆర్ఎస్ వద్ద సరైన సమాధానమే లేకుండా పోయింది.
తెలంగాణ మొత్తం హైడ్రా లాంటి వ్యవస్థ, ఇక ఎవ్వరైనా వదలం - రేవంత్ రెడ్డి
ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమంటున్న బీఆర్ఎస్
అయితే రైతు రుణమాఫీ ఇతర అంశాలపై కాంగ్రెస్ తీరును ఎండగట్టేందుకు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారని.. రూట్ మ్యాప్ పై కసరత్తు కూడా చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వాతావరణం సాధారణంగా ఉంటే ఈ పాటికి ఆయన బస్సు తెలంగాణ రోడ్లపై పరుగులు పెడుతూ ఉండేదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడేవారని అంటున్నారు. వర్షం తగ్గిన తర్వాత మంచి రోజు చూసుకుని కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తారని చెబుతున్నారు. అయితే ప్రజల్లోకి వెళ్లడానికి ఇంత కన్నా మంచి సందర్భం ఏమి ఉంటుందని.. ప్రభుత్వ వైఫల్యంపై విరుచుకుపడితే పార్టీకే మేలు కదా అని బీఆర్ఎస్ నేతల్లోనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
సాయం చేతగాక బీఆర్ఎస్ లీడర్లపై దాడి చేస్తారా - కేటీఆర్ ఆగ్రహం
కేసీఆర్ వ్యూహమేంటో ?
కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో మౌనానిది కీలక పాత్ర. ఆయన కీలకమైన విషయాల్లో మౌనంగా ఉంటారు. సరైన సమయం చూసి ఎంటర్ అవుతారు. సిక్సర్ కొడతారు. అప్పటి వరకూ ఆయన చుట్టు ముసురుకున్న వ్యతిరేకత అంతా పాజిటివ్ గా మారుతుంది. రేవంత్ ప్రభుత్వానికి సమయం ఇచ్చేందుకే ఆయన సైలెంట్ గా ఉన్నారని.. ఇవాళ కాకపోతే రేపు.. రేపు కాకపోతే ఎల్లుండి ఆయన ప్రజల్లోకి వస్తారని .. కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తారని బీఆర్ఎస్ వర్గాలు నమ్ముతున్నాయి. అయితే మంచి అవకాశాల్ని కోల్పోతున్నామన్న భావన మాత్రం కొంత మంది బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది.