అన్వేషించండి

National Politics : ఇటు మోడీ - అటు ఎవరు ? ప్రధాని అభ్యర్థిని ప్రతిపక్ష కూటమి తేల్చుకోగలదా ?

ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరు ?ఎన్డీఏ కూటమి నుంచి మోదీనే ప్రధాని అభ్యర్థిమోదీకి ధీటుగా ఉండే నేత ఉన్నారా ?ఒకరి పేరును సూచించలేని దుస్థితిలో విపక్షాలు !మరి మోదీని ఎలా ఎదుర్కోగలవు ?


National Politics :   ఇటు  మోడీ... అటు ఎవరు.. ?
   
                   ఈ ప్రశ్న గడచిన రెండు జనరల్ ఎలక్షన్లలో బీజేపీ వేసింది. మూడోసారి అదే స్లోగన్ తో వెళ్లేందుకు సిద్ధమైంది. ఎన్నికలు ఎన్నాళ్లో లేవు కాబట్టి... బీజేపీ అడగకపోయినా.. ఇప్పుడు మనం ఓ మాట అనకుందాం.. మళ్లీ అదే ప్రశ్న... ఇటు మోడీ.. అటు ఎవరు..? 

అయితే అప్పటికీ.. ఇప్పటికీ ఓ తేడా ఉంది. అప్పుడు ఏ పేరు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఫ్రంట్ రన్నర్ అదే రాహుల్ గాంధీ. ఇంకా కొన్ని పేర్లు ఉన్నప్పుటికీ... ఇప్పటికైతే రాహుల్ పేరు ముందుంది. 2009లో యూపీఏ రెండోసారి కూడా అధికారం చేపట్టాక.. ప్రధానమంత్రి పదవి కళ్లముందటే ఉంటే.. దానిని స్వీకరించకుండా.. తాను రాజకీయంగా ఇంకా ఎదగాలి అంటూ.. తప్పించుకున్న రాహుల్ గాంధీ.. ఆ తర్వాత అసలు కనిపించకుండానే పోయారు. మళ్లీ ఏడాది కాలంగా యాక్టివ్ అయిన రాహుల్.. తిరిగి సీన్ లోకి వచ్చారు. 

మోదీకి రాహుల్ పోటీదారు కాగలరా ?

మనం  మొదట అడిగిన ప్రశ్న.. అదే ఇటు మోడీ.. అటు ఎవరు అన్నదానికి పదేళ్లుగా జవాబు లేదు. కానీ.. ఈసారి జవాబు రాహుల్ గాంధీ రూపంలో  అయితే కనిపిస్తోంది. కర్ణాటకలో గెలుపు.. మార్చిలో జరగబోయే అసలైన సమరానికి ముందు జరిగే సెమీఫైనల్ ఎన్నికల్లో సానుకూల సంకేతాలు.. జోడో యాత్రతో జోడింపు ఇవన్నీ కలగలసి....మోదీ ముందు కనిపించేంత పరిస్థితికి రాహుల్ ఇమేజ్ వచ్చింది. సరే రాహుల్ కాకపోతే.. కేజ్రీవాల్, నితీష్, మమత, కేసీఆర్.. ఇలా పేర్లు చాలా ఉన్నాయి. 

వీళ్లందరిలోకి రాహుల్ కు ఉన్న అడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజెన్స్, ఆమోదయోగ్యత.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది. ఇప్పటికీ బీజేపీతో సమానంగా జాతీయ హోదా కలిగిఉంది. ఈమధ్య NDTV -CSDS సర్వే చేస్తే. ప్రధానికి ప్రధాన కంటెండర్ గా రాహుల్ నే ప్రజలు గుర్తించారు. ఈ సర్వే ప్రకారం మోదీ మళ్లీ ప్రధాని అవుతారని తేలీనప్పిటికీ.. రాహుల్ పాపులారిటీ పెరగడాన్ని.. మోదీకి సమఉజ్జీగా ఆయన్నే గుర్తించడాన్ని మనం చూడాలి. మోదీకి 43శాతం మంది ఓటేస్తే.. రాహుల్ గాంధీకి 27శాతం మంది మద్దతు తెలిపారు. దేశంలోని 19 రాష్ట్రాల్లో ఈ సర్వే జరిగింది కాబట్టి దీనిని పరిగణనలోకి తీసుకోవాలి. పైగా భారత్ జోడో యాత్ర తర్వాత.. రాహుల్ ను లైక్ చేస్తున్నామని చెప్పిన వాళ్లు 15శాతం మంది ఉన్నారు. అంటే.. యాత్ర ఎఫెక్ట్ బాగానే ఉన్నట్లు. దానికి తోడు.. కర్ణాటక ఎన్నికల ఊపు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల సంకేతాలు.. రాహుల్ కు బలాన్నిస్తున్నాయి. ఇక మిగిలిన మమత, కేజ్రీవాల్, వంటివాళ్లకు 4శాతం ఓట్లు వస్తే.. అఖిలేష్ కు 3శాతం, నితీష్ కు 1శాతం మంది మద్దతుఇచ్చారు. ఈ రకంగా చూసుకున్నా వీళ్లు రాహుల్ దరిదాపుల్లో లేరు..
National Politics : ఇటు మోడీ - అటు ఎవరు ? ప్రధాని అభ్యర్థిని ప్రతిపక్ష కూటమి తేల్చుకోగలదా ?

గత ఎన్నికల్లో మోదీ సునామీ 

మరి అంతా బాగుంది కాబట్టి పోటీ పోటాపోటీ ఏనా అనిపించొచ్చు. అలా అనుకునేముందు మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి.. కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి.  2014 ఎన్నికల్లో దేశం మొత్తాన్ని ఊడ్చేసిన బీజేపీ.. యూపీలో అయితే సునామీనే సృష్టించింది. 80కి 73సీట్లు చేజిక్కించుకుంది. దేశంలోని లోక్ సభ సీట్లలో దాదాపు ఏడో వంతు ఉన్న యూపీలో 90శాతం సీట్లు సాధించేశారు. దీనితో ఎలాగైనా మోదీ హవాను అడ్డుకోవాలని.. ప్రత్యర్థులైన ఎస్పీ-బీఎస్సీ జతకట్టాయి. దీనికి ఆర్.ఎల్.డి చేరింది. కాంగ్రెస్ సీక్రెట్ పార్ట్ నర్. ఇంత మంది కలిసిన మోడీ-యోగీని అడ్డుకోలేకపోయారు. సీట్లు కాస్త తగ్గినా... మళ్లీ యూపీని బీజేపీ ఊడ్చేసింది. 62సీట్లు వచ్చాయి. స్వయంగా రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారు. ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. అలయెన్స్ ఉందో లేదో ఎవరికీ తెలీదు. ఈ సారి ఇక్కడ ఎన్నిసీట్లు సాధిస్తారో చెప్పేవారు లేరు. 2018లో కర్ణాటకలో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించలేదు. కానీ  ఆ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 28 కి 25స్థానాల్లో గెలుపొందింది.  అదే ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే గెలుచుకున్న బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకోగలిగింది.
National Politics : ఇటు మోడీ - అటు ఎవరు ? ప్రధాని అభ్యర్థిని ప్రతిపక్ష కూటమి తేల్చుకోగలదా ?

వచ్చే ఎన్నికల కోసమూ పకడ్బందీ వ్యూహాలు 

ఇక యూపీ తర్వాత దేశంలో పెద్ద రాష్ట్రాలు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్, మహరాష్ట్ర, బీహార్ .. గురించి మాట్లాడదాం. 2018లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. కానీ ఓట్ల తేడా లేదు. రాజస్థాన్ లో బీజేపీ కంటే కేవలం 1శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు రాగా.. మధ్యప్రదేశ్ లో అయితే బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చినా సీట్లు ఎక్కువ రావడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజృంభంణ ఊహించని రీతిలో ఉంది. ఎంపీలో 29కి 28 సీట్లు, రాజస్థాన్ లో 25కు.. 24సీట్లు సాధించింది. ఓట్ల తేడా ఏకంగా పాతిక శాతం ఉంది. పాతిక శాతం ఓట్ల తేడా అంటే మరో పార్టీ దాదాపు జీరో అని అర్థం. మరి అంతటి అంతరాన్ని అధిగమించి అక్కడ నెగ్గగలరా  అన్నది ప్రశ్న. మహరాష్ట్రలో 2014, 19లలో రెండుసార్లు శివసేన- బీజేపీ కలిసి 48కి 41 స్థానాల్లో గెలిచాయి.  ఆతర్వాత రాష్ట్రంలో శివసేన విడిపోయింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. ఆ ప్రభుత్వం పడిపోయింది.. ఇవన్నీ జరిగాయి. మళ్లీ శివసేన లో ఓ బలమైన వర్గాన్ని చీల్చి బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొన్ని నెలల కిందట .. బీజేపీకి వ్యతిరేకంగా.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఓ బలమైన కూటమిగా అక్కడ నిలిచాయి. కానీ... నెలలు తిరిగే సరికే.. శివసేన.. శివసేన కాకుండా పోయింది. ఎన్సీపీ మొత్తం బీజేపీ చేతిలోకి వచ్చింది.
 
ఇక బీహార్ ఒక్కటే.. బీజేపీకి... కాస్త పోటీ కనిపిస్తోంది. అక్కడ ఆర్జేడీ, కాంగ్రెస్ , నితీష్ జనతాదళ్ కూటమి కాస్త బలంగానే కనిపిస్తోంది. కానీ 2019లో 40కి 39 స్థానాలు.. అప్పట్లో బీజేపీ-నితీష్ గెలిచిన విషయం మరువకూడదు. ఇక 42స్థానాలున్న వెస్ట్ బెంగాల్ లో అసలు ఏమీ లేదనుకున్న బీజేపీ 18 స్థానాల్లో గెలవడం సామాన్యమైన విషయం కాదు కదా.. ఒడీశా.. ఎప్పుడూ బీజేపీ కౌంటే. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ గెలిచినా అది బీజేపీ లెక్కే. తమిళనాడు- కేరళలో బీజేపీ ఎప్పుడూ సున్నానే. అక్కడ ఏమొచ్చినా అది బోనస్.


National Politics : ఇటు మోడీ - అటు ఎవరు ? ప్రధాని అభ్యర్థిని ప్రతిపక్ష కూటమి తేల్చుకోగలదా ?
జాతీయ స్థాయి మోదీది అసాధారణ బలం 

సో అర్థమైందిగా.. అసెంబ్లీ లెక్కలు ఎలాగైనా ఉండొచ్చు. కానీ పార్లమెంట్ కు వచ్చే సరికే మోదీ.. మడుగులో ఉన్న మొసలితో సమానం. ఇక్కడ అంత ఈజీకాదు.  ప్రధాని పదవికి ఇమేజ్ పరంగా చూసుకున్నప్పుడు.. మోదీ దరిదాపుల్లో లేకపోయినా.. కనీసం పోటీలో ఇవ్వగలిగే పరిస్థితిలో రాహుల్ ఉన్నారు. కానీ పార్టీ లెక్కల్లో చూసుకున్నప్పుడు.. కాంగ్రెస్ కనీసం కనిపించడం లేదు. పెద్ద రాష్ట్రాలైన బెంగాల్, బిహార్, యూపీ, ఒడీశా, ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, తమిళనాడులలో దాని ఉనికే లేదు. అదే సమయంలో మిగతా ఏ పార్టీకన్నా చూసినా బెటర్. అదొక్కటే కాంగ్రెస్ ను కాపాడుతోంది. ఆప్ చాలా చిన్న రాష్ట్రాల్లో చిన్నపార్టీ, కేసీఆర్ తెలంగాణలోనే పులి.. బయట ప్రభావం లేదు. అక్కడ ఉన్న సీట్లే 17. అందులో ఎన్ని గెలవగలుగుతారో తెలీదు. 

విపక్షాలకు చాన్సే లేదని చెప్పలేం కానీ అంత తేలిక కాదు ! 

ఇక బలమైన నేతలుగా ఎక్కువ సీట్లు సాధించగలిగే అవకాశం ఉంది..  మమత, స్టాలిన్, జగన్, అఖిలేష్. వీరిలో మమతకు జాతీయ ఆశలున్నా.. మిగిలన వారు మద్దతిచ్చే పరిస్థితి లేదు. జగన్ ఇప్పుడే ఆశపడే పరిస్థితి లేదు. స్టాలిన్ కు ప్రాంతీయత అడ్డంకిగా మారుతుంది.  కేసీఆర్ ను మిగిలిన పార్టీలు తమ మీటింగులకే పిలవడం లేదు. ఏతావతా.. రాహుల్ గాంధీనే మిగులుతారు. రాహుల్ పై జోడో యాత్ర ద్వారా 15శాతం యాక్సెప్టెన్సీ పెరిగిందంటున్నారు. అది ఎన్నికల్లో ప్రతిఫలిస్తే.. రాహుల్ ఇమేజ్ అమాంతంగా మారిపోయినట్లే.  17-18 పార్టీలున్న కొత్త అలయెన్సులో ఒక నేతపై ఒకరికి పొసగడం లేదు కాబట్టి.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ  గెలుచుకోగలిగితే.. రాహుల్ రేసులో మరింత ముందుకు రావడం ఖాయం. అత్యంత శక్తివంతమైన మోదీని తట్టుకోగలరా అంటే.. ఇంతకంటే శక్తివంతమైన ఇందిరాగాంధీనే ఇంటికి పంపించారు. ఇక్కడి ఓటర్లు. వాళ్లల్లో మార్పు వస్తే... అదేమీ అసంభవం కాదు. అంతేకాదు... జాతీయ స్థాయిలో ఏమాత్రం ప్రభావం లేని దేవగౌడ, గుజ్రాల్ వంటి వాళ్లు కూడా ప్రధానులు అయ్యారు. కాలం కలిసొస్తే.. చిన్న లీడర్లకు కూడా చాన్సుంటాయి.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget