అన్వేషించండి

RaZole Janasena : రాజోలు జనసేన అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు కూతురేనా ? - జనసేన ఆశావహులకు షాక్

RaZole Janasena : రాజోలు జనసేన అభ్యర్థిత్వం కోసం నలుగురు పోటీ పడుతున్నారు. వారిలో గొల్లపల్లి సూర్యారావు కుమార్తె కూడా ఉన్నారు.

Who is RaZole Janasena candidate  :  పొత్తుల్లో భాగంగా రాజోలు నియోజకవర్గం జనసేనకు కేటాయించారని పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించారు. దీంతో అక్కడ జనసేన అభ్యర్థిత్వం కోసం పలువురు పోటీ పడుతున్నారు. మొత్తంగా రేసులో నలుగురు ఉన్నారు. నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన ఎమ్మెల్యేనే. ఆయన పార్టీలోనే ఉండి ఉంటే ఆయనకే టిక్కెట్ ఖరారు చేసేవారు. కానీ వైసీపీలో చేరిపోయి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో జనసేన కొత్త అభ్యర్థిని పోటీకి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 

గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం  
 
రాజోలు నియోజకవర్గం గత ఎన్నికల్లో  జనసేన పార్టీ గెలిచిన ఏకైన స్థానం. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతుందని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి గెలిచి అధికార వైసీపీ  గూటికి  వెళ్లిపోయిన ఎంఎల్‌ఎను తిరిగి అదే జనసేన పార్టీ అభ్యర్థి ఓడించేందుకు రాజోలు నియోజకవర్గంలో జనసైనికులు కంకణం కట్టుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రకటనతో రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీలో పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.  రాజోలు నియోజక వర్గంలో 2019 జనసేన గెలిచిన స్థానం. ఎస్‌సి, ఒసి (కాపు) సామాజిక వర్గాని చెందిన ఎక్కువ ఒటర్లు రాజోలులో ఉన్నారు.

టీడీపీ ఇంచార్జ్ గా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు 

టీడీపీకి మంచి బలం ఉన్న నియోజకవర్గం అయిన రాజోలులో  మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పార్టీని చూసుకుంటున్నారు. జనసేన 2019లో జనసేన గెలిచిన స్థానం కావడంతో టీడీపీ  ఆశలు వదులుకుంది. గొల్లపల్లి సూర్యారావు తన కుమార్తెను జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇస్తే గెలుపు ఖాయమని కూటమి నేతలకు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.  అమూల్య భర్త బిసి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గం నుండి మెజారిటీ ఓట్లు తెచ్చుకుంటుదన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. అయితే గొల్లపల్లి కుటుంబానికి టిక్కెట్ ఇస్తే.. నియోజకవర్గం టీడీపీకి ఇచ్చినట్లేనని జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

జనసేన టికెట్‌ కోసం తీవ్ర పోటీ…!

ఈ నియోజకవర్గ నుంచి మరో ముగ్గురు జనసేన నేతలు పోటీ పడుతున్నారు.  రాజోలు నియోజకవర్గంలో చింతలమోరి గ్రామ సర్పంచ్‌ రాపాక రమేష్‌ బాబు తనకే సీటు వస్తుందని అంటున్నారు. రమేష్‌ బాబు వైద్య వృత్తిలో ఉండి స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.  రాజోలుకే చెందిన రిటైర్డ్‌ ఐఎఎస్‌ దేవ వరప్రసాద్‌ చంద్రబాబు ప్రభుత్వంలో పని చేశారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జనవాణి కార్యక్రమాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరొకరు బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి అనంతరం జనసేన పార్టీలో చేరారు. తనకే కచ్చితంగా సీటు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  . సీటు అవకాశం దక్కితే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Embed widget