BRS Meet : బీఆర్ఎస్ కార్యవర్గ భేటీలో సంచలన నిర్ణయాలు ? కేసీఆర్ షాకివ్వబోతున్నారా?
ఓ వైపు కవిత జంతర్ మంతర్ వద్ద దీక్ష !మరో వైపు బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంకేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు?సంచలన నిర్ణయాలు ఉంటాయా ?
BRS Meet : భారత రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరగనుంది. ఇది అత్యవసర సమావేశం. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గంతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, అన్ని స్థాయిల్లో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారంతా విధిగా పాల్గొనాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో కీలకమైన నిర్ణయాలు, ఎన్నికల నేప థ్యంలో కొత్త వ్యూహాలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవనున్నారు. అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలువినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యవర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కేబినెట్ భేటీలో ఆమోదిచిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం
తెలంగాణ కేబినెట్ ప్రజలకు రూ. లక్షలు ఇచ్చే పథకాల విషయంలో కీలక నిర్ణయాలుతీసుకుంది. సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకునే వారి ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకువచ్చింది. పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుతలో 4లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే మరో లక్షా 30వేల మందికి దళిత బందు ఇవ్వనున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలను ఖరారు చేసుకునే అవకాశం ఉంది. కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించినందున కార్యవర్గ సమావేశంలో వ్వాటినీ ప్రస్తావించే అవకాశం ఉంది. రాజకీయంగా అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఢిల్లీలో కవిత ఉన్నా హడావుడి సమావేశం ఎందుకు ?
వాస్తవానికి ఢిల్లీలోని జంత ర్‌మంతర్ వద్ద మహిళా బిల్లు డిమాండ్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయనున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటు-లో ప్రవేశ పెట్టాలని ఆమె గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 13 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు తీసుకువచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న లక్ష్యంతో చేపడుతున్న ఈ దీక్షలో పాల్గొనాలని అన్ని పార్టీలు, సంఘాలకు ఆహ్వానాలు పంపారు. దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు కవితకు మద్దతుగా దీక్షలో పాల్గొననున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు పలువురు మంత్రులతో పాటు కార్యవర్గ సభ్యులు వెళ్లారు. అయినప్పటికీ కేసీఆర్ ఇదే రోజు సమావేశం నిర్వహించాలనుకోవడం ఆసక్తికరంగా మారింది.
కవితను అరెస్ట్ చేస్తే చేపట్టాలని కార్యక్రమాలపై దిశానిర్దేశం ?
బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనుంది. ఈ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ పార్లమెంటు- సభ్యులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్‌లు, డిసిఎమ్‌ఎస్, డిసిసిబి చైర్మన్‌లు పాల్గొంటారు. ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రతీఒక్కరూ ఈ సమావేశానికి తప్ప నిసరిగా హాజరుకావాలని అధినేత కేసీఆర్ సూచించారు. అటు దేశ రాజ ధానిలో, ఇటు రాష్ట్ర రాజధానిలో ఒకేరోజు కీలకమైన రాజకీయ వేదికలు ఉండడం చర్చనీయాంశంగా మారింది. పదకొండో తేదీన కవిత విచారణకు హాజరవుతారు. ఆ రోజున కవితను అరెస్ట్ చేస్తే.. బీజేపీకి వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టే ప్రణాళికలను కూడా వివరించే అవకాశం ఉందని భావిస్తుననారు.