News
News
X

Trouble In YSRCP : వైఎస్ఆర్‌సీపీలో ఇంత అలజడి ఎందుకు ? పార్టీ నేతల్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే సమస్యలా ?

వైఎస్ఆర్‌సీపీలో సమస్యలకు కారణం ఏమిటి ? ఎలా సర్దుబాటు చేయబోతున్నారు ?

FOLLOW US: 
Share:

Trouble In YSRCP :   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే ఎప్పుడు వివాదాస్పద కామెంట్లు చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది, ఒకే జిల్లా నుంచి ముగ్గురు మ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఇద్దరిపై వైఎస్ఆర్‌సీపీ ఆశలు వదిలేసుకోగా.. మరో ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా కామెంట్లు చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా అలాంటి వారు బయటకు వస్తారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగా సమయం ఉండటంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తారని అంటున్నారు. కారణం ఏదైనా వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో తమ పార్టీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి ఉందనేది మాత్రం ఆ పార్టీలో ఎక్కువగా వినిపించే అంశం దానికి అనేక కారణాలు ఉన్నాయి. 

ఎమ్మెల్యేలకు విలువ లేకపోవడం - సీఎం అపాయింట్‌మెంట్ కూడా కష్టం కావడం ! 

వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. దీనికి కారణం  విధానపరంగా తీసుకున్న నిర్ణయాలే అనుకోవచ్చు. ప్రతి యాభై ఇళ్లకు వాలంటీర్లను పెట్టారు. అలాగే ప్రతి రెండు వేల మంది జనాభాకు ఓ గ్రామ సచివాలయం  పెట్టారు. ఏ సమస్య ఉన్నా వాలంటీర్ నే సంప్రదిస్తున్నారు. పథకాలు ఇవ్వాలన్నా.. తీసేయాలన్న వాలంటీర్ చేతిలోనే పెట్టారు. దీనిపై పలుమార్లు ఎమ్మెల్యేలు అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. వాలంటీర్లకు ఉన్నంత గౌరవం కూడా లేదని  బహిరంగంగానే చెప్పారు. అదే సమయంలో సీఎం  జగన్ అపాయింట్‌మెంట్  పొందలేని వారు కూడా చాలా మంది ఉన్నారు. ఏదో ఓ సందర్భంలో కలవడం తప్ప... నియోజకవర్గ సమస్యలు చెప్పుకుందామనుకుంటే సమయం దొరికిన వారు చాలా తక్కువ. ఈ కారణంగా కూడా ఎమ్మెల్యేలకు హైకమాండ్‌కు మధ్య గ్యాప్ పెరిగిపోయిందన్న వాదన వినిపిస్తోంది. 

జిల్లాలో ఆధిపత్య పోరాటాలు - ఓ వర్గానికి హైకమాండ్ మద్దతు !

జిల్లాల్లో ఆధిపత్యం కోసం నేతలు చేసిన పోరాటం కూడా ఓ రకంగా వైఎస్ఆర్‌సీపికి ఇబ్బందికరంగా మారాయి.  ఈ సమస్యలను సమర్థంగా డీల్ చేయకపోవడం.. ఓ వర్గానికి హైకమాండ్ మద్దతు ప్రకటించినట్లుగా వ్యవహరించడంతోనే సమస్య వచ్చిందని భావిస్తున్నారు. కోటంరెడ్డి ఇష్యూనే తీసుకుంటే.. ఆయన అసంతృప్తికి ప్రధాన కారణం ఆధిపత్య పోరాటమే. అదే సమయంలో ఆయనపై అనుమానం తెచ్చుకుని నిఘా పెట్టడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. అసలు కోటంరెడ్డి పార్టీని ధిక్కరిస్తారని వైసీపీ నేతలే అనుకోలేదు. కానీ అలాంటి పరిస్థితులు వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ సృష్టించడం వల్లే వచ్చాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఐ ప్యాక్ బృందాల పెత్తనం - టిక్కెట్ పై టెన్షన్ !

మరో వైపు సీఎం జగన్ సొంత పార్టీ నేతల కన్నా... పొలిటికల్ స్ట్రాటజీ  టీమ్ ఐ ప్యాక్ బృందాలనే ఎక్కువగా నమ్ముతారు. వారు ఇచ్చే సర్వేలు.. రిపోర్టులనే హైలెట్ చేసి..  ఎమ్మెల్యేలకు క్లాస్ పీకుతూంటారు. ఇది చాలా మంది  సీనియర్ ఎమ్మెల్యేలకు కష్టంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో తమకు సీటు ఇవ్వాలా వద్దా అనేది  ఐప్యాక్ డిసైడ్ చేస్తుందని చెప్పడం కూడా చాలా మందిలో అభద్రతా భావాన్ని కల్పించింది. గత ఎన్నికల్లో విపరీతంగా ఖర్చు పెట్టుకుని గెలిచామని.. కనీసం చేస్తున్న పనులకు బిల్లులకు కూడా ఇప్పించుకోలేని పరిస్థితి ఉన్నా... పార్టీ కోసం పని చేస్తున్నామని..అయినా గుర్తించడం లేదన్న భావనలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కారణంగా హైకమాండ్‌పై అసంతృప్తి పెరుగుతోందని చెబుతున్నారు. 

కారణం ఏదైనా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ విధానాలు.. పార్టీ నేతలు, క్యాడర్ పట్ల అధికార పార్టీ పెద్దలు వ్యవహరించిన తీరు .. పార్టీలో ఈ పరిస్థితులు ఏర్పడటానికి కారణం అని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితులు మారితేనే.. .అలజడి తగ్గుతుందనే వారు కూడా ఉన్నారు. 

Published at : 05 Feb 2023 08:00 AM (IST) Tags: CM Jagan YCP Disturbance in YSRCP dissatisfaction in YCP

సంబంధిత కథనాలు

Somu Veerraju On Pawan: కొందరికి మోదీ నచ్చుతారు, బీజేపీ నచ్చదు: జనసేనానిపై సోము వీర్రాజు పరోక్ష వ్యాఖ్యలు

Somu Veerraju On Pawan: కొందరికి మోదీ నచ్చుతారు, బీజేపీ నచ్చదు: జనసేనానిపై సోము వీర్రాజు పరోక్ష వ్యాఖ్యలు

TSPSC Leaks What Next : ఓ వైపు లిక్కర్ కేసు - మరో వైపు పేపర్ లీకేజీ దుామరం ! కేసీఆర్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దబోతున్నారు ?

TSPSC Leaks What Next :  ఓ వైపు లిక్కర్ కేసు - మరో వైపు పేపర్ లీకేజీ దుామరం ! కేసీఆర్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దబోతున్నారు ?

TDP Vs Janasena: జనసేన - బీజేపీ మధ్య గ్యాప్‌కు కారణం ఎవరు ? పవన్ పట్టించుకోలేదా ? బీజేపీ నిర్లక్ష్యం చేసిందా ?

TDP Vs Janasena:  జనసేన -  బీజేపీ మధ్య గ్యాప్‌కు కారణం ఎవరు ? పవన్ పట్టించుకోలేదా ? బీజేపీ నిర్లక్ష్యం చేసిందా ?

Warangal BJP: వరంగల్ పశ్చిమ బీజేపీలో టికెట్ కోసం పోటా పోటీ, నేతల వరుస పర్యటనలు

Warangal BJP: వరంగల్ పశ్చిమ బీజేపీలో టికెట్ కోసం పోటా పోటీ, నేతల వరుస పర్యటనలు

నోటీసుల కంటే ముందే ఫోన్ల గురించి ఎలా మాట్లాడుతారు?- మంత్రి శ్రీనివాస్ గౌడ్

నోటీసుల కంటే ముందే ఫోన్ల గురించి ఎలా మాట్లాడుతారు?- మంత్రి శ్రీనివాస్ గౌడ్

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!