Telangana: కేసీఆర్ తీరు నయా నిజాం పాలనను తలపిస్తోంది: బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి
సీఎం కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రెడ్డి పలు విమర్శలు గుప్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనను నయా నిజాం పాలను తలపిస్తుందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వేయి ఊడల మర్రి వద్ద అమరవీరులకు మహేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... నయా నిజాం పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ను తరిమి కొట్టాలన్నారు.
ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోంది. ఒకవైపు దొరల వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు.. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు.
1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయిందని తెలిపారు. భారత దేశ నడిబొడ్డున క్యాన్సర్ కణితిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయం తో సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటనతో హైదరాబాద్ వాసులకు స్వాతంత్య్రం వచ్చి, హైదరాబాదు రాష్ట్రం ఏర్పడిందని వెల్లడించారు. తెలంగాణ రాష్టం వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్న ప్రజలకు, స్వ రాష్ట్రంలో కూడాబతుకులు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
నయా నిజాం మాదిరిగా కేసీఆర్ పాలన కొనసాగుతుంది. పోలీసులను అడ్డుపెట్టుకొని దొరల పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ సర్కార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అని నాడు భూటకపు మాటలు మాట్లాడిన కేసీఆర్ , నేడు స్వరాష్ట్రం సాధించాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో చెప్పాలని డిమాండ్ చేసారు. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలకు బయపడి ఈ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదా రాజకీయ లబ్ది కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్న కెసిఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వెల్లడించారు. రానున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని హామీ ఇచ్చారు.
ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు....
నవభారత నిర్మాత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా మహేశ్వర్ రెడ్డి కేక్ కట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ కి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్, సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, వొడిసెల అర్జున్, అలివేలు మంగ, సాదం అరవింద్, అయ్యన్న గారి రాజేందర్, గాదె విలాస్, అల్లం భాస్కర్, రామోజీ నరేష్, విజయ్, రాజేష్, శైలేష్, లింగారెడ్డి, హరీష్ రెడ్డి, మార గంగారెడ్డి, వీరేష్, అనిల్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.