Loksabha Elections 2024: పగటి కలలు కనడం మానుకుంటే మంచిది, కాంగ్రెస్ వాదనను తప్పుపట్టిన రవిశంకర్ ప్రసాద్
Loksabha Exit Polls 2024: జూన్ 4న ఎన్డీయే 400సీట్లను దాటుతుందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ మోడీని విమర్శించడం మానుకోవాలని.. ప్రజల్లో విశ్వాసం పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.
Ravi Shankar Prasad : 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు మూడు రోజుల ముందు ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. అన్ని ఛానళ్ల సర్వేలు బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తాయని అంచనా వేశాయి. కొన్ని సర్వేల్లో ఎన్డీయే 400 దాటుతుందన్న నినాదం కూడా సాధ్యమేనని అనిపించింది. జూన్ 4న అసలైన ఫలితాలు రానున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌పై పాట్నా సాహిబ్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. నాన్సెన్స్ మాటలను మాట్లాడే వాళ్లను ప్రజానీకం శిక్షించబోతోందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
పేదలు, రైతుల పట్ల ప్రధాని మోడీకి శ్రద్ధ ఉందన్నారు. ఆయన దేశాన్ని అభివృద్ధి చేస్తూ, ప్రజలకు భద్రత సైతం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ పనితీరు పేలవంగా ఉంది. వారు పగటి కలలు కనడం మానుకోవాలన్నారు. ఇకనైనా ప్రధాని మోడీని విమర్శించడం మానేయాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని పొందాలని కాంగ్రెస్‌కు సలహా ఇచ్చారు రవిశంకర్ ప్రసాద్. ఎగ్జిట్ పోల్ ఖచ్చితమైన పోల్‌ను మాత్రమే ప్రతిబింబిస్తోందన్నారు. కచ్చితంగా ఈ సారి 400స్థానాలు, అటు బీహార్ లో 40స్థానాలు దాటుతాయని ధీమా వ్యక్తం చేశారు.
#WATCH | Patna, Bihar: On Rahul Gandhi's remark for exit polls and claim of getting 295 seats in #LokSabhaElections2024, BJP MP and candidate from Patna Sahib constituency, Ravi Shankar Prasad says, "There is no bar on daydreaming in India. The Exit Poll is only reflecting the… pic.twitter.com/ouJKWDmukr
— ANI (@ANI) June 2, 2024
వచ్చేది ‘ఇండియా’ కూటమినే: కాంగ్రెస్
ఎగ్జిట్ పోల్స్ అబద్ధమని జూన్ 4న మోడీ ప్రభుత్వం ఏర్పడదని ఇండియా (I.N.D.I.A) అలయన్స్ పేర్కొంది. ఆదివారం జరిగిన ఇండియా కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మీడియా ముందుకు వచ్చి I.N.D.I.A అలయన్స్ విజయం ఖాయమని ప్రకటించారు. ఎన్ని సీట్లు గెలుస్తారని రాహుల్ గాంధీని అడిగితే? దీనికి సమాధానంగా రాహుల్ మాట్లాడుతూ- మీరు సిద్ధూ మూసేవాలా ఉత్నీ పాట విన్నారా అని ప్రశ్నించారు.
ఎగ్జిట్ పోల్ కాదు.. మోడీ మీడియా పోల్
ఎగ్జిట్ పోల్ అంచనాలను కాంగ్రెస్ నేత, రాయ్‌బరేలీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీ పూర్తిగా తోసిపుచ్చారు. ఇది ఎగ్జిట్ పోల్ కాదు, మోడీ మీడియా పోల్ అని, ఇది ఆయన ఫాంటసీ పోల్ అని అన్నారు. భారత కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుందనే ప్రశ్నకు, "మీరు సిద్ధూ మూసేవాలా పాట 295 విన్నారా? " అని అన్నారు. అంతకుముందు శనివారం కూడా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా విపక్ష నేతలతో సమావేశమైన తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ప్రకటించారు. ఈసారి ఇండియా అలయన్స్ 295 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని విశ్వాసంతో చెప్పగలమన్నారు. శనివారం రాత్రి జరిగిన ఎగ్జిట్ పోల్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘనవిజయం సాధిస్తుందని ప్రధాన సర్వేలన్నీ అంచనా వేశాయి. బీజేపీ, దాని మిత్రపక్షాలు మరోసారి 300 సీట్ల మార్కును దాటగలవని సర్వే సంస్థలన్నీ అంచనాలు వేశాయి. ఈ సారి బీజేపీ దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరవడం ఖాయమని తెలిపాయి.