TDP Digital Plan : తెలుగుదేశం డిజిటల్ బాట - యువతకు చేరువయ్యేందుకు కొత్త వ్యూహం !
డిజిటల్ మీడియా ద్వారా యువతకు దగ్గరవ్వాలని టీడీపీ భావిస్తోంది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా మహానాడుకు సరిగ్గా కవరేజీ ఇవ్వడం లేదని టీడీపీ భావిస్తోంది.
TDP Digital Plan : తెలుగుదేశం పార్టీ ఇప్పుడు డిజిటల్ మీడియాపై ఎక్కువగా దృష్టి పెట్టింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అధికారపక్షానికే అండగా ఉంటూడటంతో ఇక నుంచి ఆ మీడియా ను పట్టించుకోవడం కన్నా... ప్రజలకు డిజిటల్ మీడియా ద్వారా దగ్గరవ్వాలని నిర్ణయించుకుంది. ప్రతి మనిషికి ఇప్పుడు సెల్ ఫోన్ కీలకంగా మారింది. అందుకే పార్టీ కార్యక్రమాలు.. భవిష్యత్ కార్యచరణ ఇక పై డిజిటల్ రూపంలోనే ఉండాలని టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ దిశగానే టీడీపీ మహానాడుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలకు కూడ అగ్ర నాయకత్వం ఇలాంటి సలహాలు సూచనలే ఇస్తోంది.
TDP మహానాడులో కీలక తీర్మానాలు, నారా లోకేష్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు
టీడీపీ అనుబంధ విభాగం ఐటీడీపీ ప్రత్యేకంగా ఈ డిజిటల్ మీడియా ద్వారా ఎలా పార్టీకి దగ్గర చేయాలో పార్టీ నేతలకు ప్రత్యేకంగా వర్క్ షాపులు నిర్వహించారు. ఇక రాబోయేది అంతా ఎన్నికల సంగ్రామమేనని మహానాడును వేదికగా చేసుకునిని తెలుగు తమ్ముళ్ల లో జోష్ నింపేందుకు టీడీపీ హైకమాండ్ ప్ణాళికలు సిద్ధం చేసుకుంది. రాబోయే రోజుల్లో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా అధికారం అందుకోవాలని నిర్ణయించుకుంది.
ఎన్టీఆర్ అప్పట్లోనే చేసి చూపించారు - అవినీతికి పాల్పడితే మంత్రినీ వదల్లేదు !
తెలుగుదేశం పార్టీ మహానాడుకు మీడియాలో కవరేజీ రాకూడదన్న ఉద్దేశంతోనే మంత్రుల బస్సు యాత్ర చేపట్టాలని ఇప్పటికీ టీడీపీ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. బస్సు యాత్రకు పెద్దగా ఆదరణ లేకపోయినప్పటికీ.. మహానాడు సంబరంగా జరుగుతున్నప్పటికీ అధికార పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సరైన కవరేజీ ఇవ్వడం లేదన్న అభిప్రాయంలో టీడీపీ నేతలు ఉన్నారు. కొన్ని మీడియా చానళ్లు ఏపీలో రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్ట్లు పొందిన కాంట్రాక్టర్ల చేతుల్లో ఉండటంతో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కవరేజీ వస్తుందని పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.
అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు విరాళాల వెల్లువ - డీఎంకే, వైఎస్ఆర్‌సీపీకే సగం !
అందుకే ఇక నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత కవరేజీ ఇస్తుందన్నదానిపై అంచనాలు పెట్టుకోకుండా పూర్తి స్థాయిలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రజలకు దగ్గర కావాలని భావిస్తున్నారు. ప్రస్తుతం యువత మొత్తం డిజిటల్ మీడియా మీదనే ఆధారపడుతోంది. ఆ డిజిటల్ స్పెషల్ ఆపరేషన్ మహానాడు నుంచే టీడీపీ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.