ఢిల్లీకి వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు- చేరికలు, విభేదాలకు చెక్ పడుతుందా?
తెలంగాణలో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. ఇన్నాళ్లూ ఉప్పు నిప్పులా ఉన్న వాళ్లంతా ఐక్యంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నారు.
ఐదు నెలల్లో తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిన్నింటి కంటే తెలంగాణపై కాంగ్రెస్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అందుకే రెగ్యులర్‌గా తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలుపిస్తోంది. వారంతా సఖ్యతగా ఉంటూ పార్టీ విజయానికి చేపట్టాల్సిన ప్రోగ్రామ్స్‌ను చెబుతోంది.
ఢిల్లీకు పయనం
తెలంగాణలో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. ఇన్నాళ్లూ ఉప్పు నిప్పులా ఉన్న వాళ్లంతా ఐక్యంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నారు. ఒకరితో ఒకరు సమావేశమై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ స్పీడ్‌ను మరింత పెంచేందుకు వ్యూహాలకు పదును పెట్టేందుకు సుమారు 40 మందికిపైగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు.
ఐక్యరాగం
కాంగ్రెస్ అంటే అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ అని ఆ పార్టీ నేతలే సెటైర్లు వేస్తుంటారు. ఆ పార్టీకి బయట శత్రువులతో కంటే లోపల ఉన్న ప్రత్యర్థులతోనే ప్రమాదం ఎక్కువని కూడా చెబుతుంటారు. దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్‌గా తెలంగాణ కాంగ్రెస్ ఇన్నాళ్లూ ఉండేది. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసిన నేతల మైండ్ సెట్ మారినట్టు కనిపిస్తోంది. అధినాయకత్వం కూడా వారిని ట్యూన్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే నేతలంతా ఇప్పుడు ఐక్యరాగం వినిపిస్తున్నారు.
Also Read: కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారు! ఆ సొమ్ముతో అక్కడికే పారిపోతారు - రేవంత్ ఆరోపణలు
కలిసిన చేతులు
ఎప్పుడూ ఢీ అంటే ఢీ అనుకునే రేవంత్‌రెడ్డి, కోమటి రెడ్డి కలిసిపోయి మీటింగ్స్ పెడుతున్నారు. మొన్నటికి మొన్న జూపల్లి, పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించడానికి వీళ్లద్దరూ కలిసి వెళ్లారు. అదే టైంలో రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సీనియర్లుగా ఉంటున్న వారి సలహా మేరకే చేరికలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయని ప్రకటించేశారు. దీంతో పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో పాజిటివ్ వైబ్ కనిపిస్తున్న వేళ దాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది అధినాయకత్వం. అందుకే కీలమైన నేతలను ఢిల్లీకి పిలిచింది. వీళ్లంతా రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రెగ్యులర్‌గా రాష్ట్రంలో బహిరంగ సభలు పెట్టే అంశంపై చర్చిస్తారు. అదే టైంలో కొత్తగా చేరుతున్న వారిపై కూడా దృష్టి పెట్టబోతున్నారు. ఎవరెవర్ని చేర్చుకోబోతున్నారు. వారికి ఎలాంటి హామీ ఇవ్వాలనే అంశాలపై చర్చిస్తారు.
Also Read: ‘దళితబంధుకు ఎమ్మెల్యేలే రాబందులు! KCR మళ్లీ దొంగల చేతికే తాళాలు ఇచ్చారు’
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో బాధితులుగా ఉన్న వర్గాలతో మీటింగ్స్ పెట్టి వారికి భరోసా ఇవ్వడం, వారి ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడేలా చేయడంతోపాటు రాహుల్, ప్రియాంకతో భారీ బహిరంగ సభలను పెట్టేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వీటిపై ఈ సమావేశం అనంతరం క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీలో ఉండలేక ఊగిసలాడుతున్న వారికి కూడా భవిష్యత్‌పై భరోసా ఇచ్చి వారిని పార్టీలోకి అహ్వానించడం కూడా చేయబోతున్నారని టాక్.
షర్మిల విషయాన్ని తేల్చేస్తారా?
మరోవైపు షర్మిల విషయంపై కూడా చర్చించే ఛాన్స్ ఉందని సమాచారం. షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీన్ని షర్మిల ఖండిస్తున్నప్పటికీ ప్రచారం మాత్రం ఆగడం లేదు. దీనిపై కూడా అధినాయకత్వం నేతలతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial